హుక్కా తాగితే ఏం జరుగుతుంది?

By B N Sharma

నేటి రోజులలో యువతకు హుక్కా తాగటం ఫ్యాషన్ అయిపోయింది. అదివరకు రోజులలో ముసలివారు గ్రామాలలో హుక్కా తాగుతూ ఆనందించేవారు. కాని ఇపుడు ఆ అలవాటు గ్రామాలనుండి నగరాలకు పాకి పెద్ద ఫ్యాషన్ అయికూర్చుంది. స్కూల్, కాలేజ్ విద్యార్ధులు కూడా హుక్కా పార్లర్ కు వెళ్ళి తాగి ఆనందిస్తున్నారు.
అసలు ఈ హుక్కా ఎలా పనిచేస్తుంది? ఒక పాత్రకు పొడవైన నీటి గొట్టాన్ని కలిపి ఉంచుతారు. దానికి ఒక పొగ ఛాంబర్ మరియు ఒక హోస్ అంటే గొట్టం వుంటాయి. మంచి రుచి లేదా సాధారణమైన పొగాకును ఆ ఛాంబర్ లో కాలుస్తారు. పైప్ ద్వారా మీరు దానిని పీలిస్తే, చక్కటి ఆ రుచి లేదా పొగాకు పొగ మీకు అందుతుంది. హుక్కా తాగటం సిగరెట్ కంటే కూడా అధికమైన హాని అని తెలుసుకోండి. దానికి కారణం, సిగరెట్ పీల్పు కొద్దిపాటే, కాని హుక్కా వెడల్పైన గొట్టం ద్వారా పీలుస్తారు. మరి ఈ రకంగా పీల్చే హుక్కా ఆరోగ్యానికి కలిగించే హాని ఏమిటో పరిశీలిద్దాం.

హుక్కా తాగితే వచ్చే దుష్పరిణామాలు
సిగరెట్ కంటే కూడా హానికరమైనది. చిన్న సిగరెట్ అనేది 4 లేదా 5 నిమిషాలు తాగుతారు. కాని హుక్కా కనీసం అంటే 30 నిమిషాలవరకు పీలుస్తారు. రీసెర్చర్ల మేరకు అధిక సమయం పీల్చటం వలన హుక్కా ఆరోగ్యానికి అధిక హాని కలిగిస్తుంది. 45 నిమిషాలు హుక్కా పీలిస్తే అది షుమారు 45 సిగరెట్ల హానికి సమానం అంటారు. అంటే, మీరు షుమారుగా 20 సిగరెట్ల లోని టార్ ను పీల్చేస్తారన్నమాట. సిగరెట్లతో పోలిస్తే, నోటిలో కణాల నష్టం అధికంగా వుంటుంది.

Smoking

తలనొప్పి - హుక్కా తాగటం మొదట్లో సరదాగానే వుంటుంది. కాని హుక్కా పార్లర్ నుండి బయటకు వస్తే చాలు మీ తల తీవ్ర నొప్పి కలిగి వుంటుంది. అది మీకే కాదు, ప్రతి హుక్కా తాగేవారికి వుంటుంది. వీరు తాగే కార్బన్ మొనాక్సైడ్ తలనొప్పి, వికారం కలిగిస్తుంది. మరి రుచి కనొరకు హుక్కా తాగే వారికైతే, బ్రెయిన్ మరింత ప్రభావించి తలనొప్పి తీవ్రంగా వుంటుంది. తాగేటపుడు బలంగా పొగ తాగటం వలన కూడా మీ తల నొప్పి పెడుతుంది.

సిగరెట్ కంటే చెడు - చాలామంది హుక్కా తాగటం సిగరెట్ కంటే మంచిదని భావిస్తారు. దీనికి కారణం, పొగాకును నీటిలో వుంచటమే. కాని ఇది ఒక అపోహ మాత్రమే, హుక్కా మీ శరీరానికి మరింత హాని కలిగిస్తుంది. హుక్కాలో కూడా సిగరెట్ వలెనే నికోటిన్ వుంటుంది. మీరు నికోటిన్ ఎక్కువ సమయం పీల్చినపుడు మీరు దానికి అలవాటు పడిపోతారు. మీరు కనుక తలనొప్పి, చికాకు, అలసట లేదా డిప్రెనషన్ వంటివి హుక్కా తాగకపోయినా కలిగి వున్నట్లయితే, మీరు హుక్కాకు బానిస అయ్యారని గ్రహించండి.

కేన్సర్ - మీరు హుక్కా తాగితే, దానిని మెటల్ పైప్ నుండి తాగుతారు. దానితో మీరు ఆ మెటల్ లో వుండే కార్బన్ మొనాక్సైడ్, టార్, ఐరన్ మరియు ఇతర విషపూరిత మెటల్ ను కూడా పీలుస్తారు. ఈ చర్య శరీరానికి ఎంతో అనారోగ్యం కలిగిస్తుంది. హుక్కాకు గల ప్రధాన చెడు పరిణామం అది మీకు క్రమేణా కేన్సర్ కలిగిస్తుంది. దీనిలో వుండే రసాయనాలు శరీరానికి కేన్సర్ కలిగించేవిగా వుంటాయి. షీషా లేదా హుక్కా తాగుడు, అనారోగ్యకరం, ప్రత్యేకించి అది నోటికి, గొంతుకు, ఊపిరితిత్తులకు, పెదవులకు కేన్సర్ వ్యాధి కలిగేలా చేస్తుంది.

ఇవన్నీ హుక్కా తాగటం వలన వచ్చే చెడు పరిణామాలు. మీరు హుక్కా తాగాలనుకుంటే, ఔషధ మూలికలది అంటే హెర్బల్ హుక్కా తాగి ఆనందించండి. దానిలో నికోటిన్ వుండదు. అయితే, ఏ రకమైన చెడు అలవాటు వుండరాదనుకుంటే, హుక్కాను పూర్తిగా మానేయటం మంచిదిగా చెప్పాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, June 21, 2012, 9:12 [IST]
Desktop Bottom Promotion