Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
హాయిగా నిద్రిస్తే...ఎంతో ప్రయోజనం!

శరీరంలో నిద్ర అధికంగా పోయినా, లేక తక్కువ నిద్ర పోయినా మార్పులు బాగా కనపడతాయి. అవి మంచివి కావచ్చు లేదా చెడు ప్రయోజనాలు కూడా కావచ్చు. న్యూయార్క్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ స్లీప్ మెడిసిన్ డైరెక్టర్ మరియు ప్రొఫెసర్ డేవిడ్ రాపోపోర్ట్ మేరకు నిద్ర శరీరంలో హార్మోన్లను ప్రభావింపజేస్తుంది.
ఈ అంశంలో మరో స్టడీగా చికాగో యూనివర్శిటీ నిర్వహించింది. ఆ స్టడీలో కూడా బరువు తగ్గాలంటే, తగినంత నిద్ర పోవాలని వెల్లడైంది. కనుక, డైటింగ్ అంటూ ఆహారాలు తక్కువగా తీసుకుంటూ, ఇబ్బందులు పడేకన్నా, హాయిగా ప్రతిరోజూ 7 గంటలపాటు సమయానికి రాత్రివేళ నిద్రిస్తే చాలు అది మరింత సమర్ధవంతంగా పనిచేస్తుందంటున్నారు పరిశోధకులు. మరి మంచి నిద్ర మీ బరువును ఎలా తగ్గిస్తుందో పరిశీలించండి.
ఆకలి నియంత్రణ - నిద్ర ఆకలిని కలిగించే హార్మోన్ల తయారీని అధికం చేస్తుంది. ఈ హార్మోన్లలో ప్రధానమైన గ్రెలిన్ అనే హార్మోన్ తన ఉత్పత్తిని పెంచి మీలోని ఎనర్జీ కోల్పోవటాన్ని తగ్గిస్తుంది. మీ నిద్ర కనుక కనీసం 6 గంటలుగా వుంటే చాలు ఈ హార్మోన్ బాగా తయారవుతుంది. సరైన నిద్ర లేకుంటే, లెప్టిన్ హార్మోన్ స్ధాయిలు పడిపోయి ఆకలి పెరిగిపోతుంది. అంటే దాని అర్ధం బాగా తినేసి అధికంగా నిద్ర పొమ్మని కాదు. మీరు మీ డైటింగ్ ప్రణాళికలు కూడా ఆచరిస్తూ వుండాలి. అయితే మీ ఆహారాలలో కొవ్వు కలిగించేవి లేకుండా జాగ్రత్త పడండి.
కొవ్వు నిల్వలు తగ్గుట - తగినంత నిద్ర శరీరం కార్బో హైడ్రేట్లను జీవక్రియలో ఖర్చు చేస్తుంది. మీరు బాగా నిద్రిస్తే, మీ జీవక్రియ చర్యలు బాగా జరిగి శరీరంలో కొవ్వు తక్కువ నిల్వ వుంటుంది. నిద్ర కనుక సరిగాలేకుంటే, అది మీ బ్లడ్ షుగర్ స్ధాయిలను పెంచుతుంది మరియు ఇన్సులిన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. తర్వాతి రోజులలో అది డయాబెటీస్ ఏర్పడేందుకు కూడా దోహదం చేస్తుంది.
డిప్రెషన్ తగ్గుట - మానసిక ఆందోళనలు కూడా బరువు పెంచుతాయి. మీకు మనోవేదన వుంటుంది. కాని మీరు బాగా నిద్రిస్తే, ఆ మనోవేదన చాలావరకు తగ్గిపోతుంది. బ్లడ్ ప్రెషన్ మరియు షుగర్ స్ధాయిలు, ఒత్తిడి, డిప్రెషన్ ఏర్పడినపుడు బాగా పెరుగుతాయి. నిద్ర కనుక బాగా పోతే, అది ఈ సమస్యలను తొలగిస్తుంది.
కనుక, ఇరవై నాల్గు గంటలూ పనిచేసి బరువు తగ్గాలనుకోకండి. హాయిగా రాత్రివేళ నిద్రించి, మంచి ఆహారం తింటూ తేలికగా మరియు సమర్ధవంతంగా మీ బరువు తగ్గించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications