Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు -
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్! -
గుండె పదిలం, కండరాలు దృఢం.. 30 ఏళ్లు దాటిన మగవాళ్లు రోజూ తినాల్సిన అద్భుతమైన గింజలివే -
అసిడిటీకి చెక్ పెట్టే, గట్ హెల్త్ పెంచే హెల్తీ స్నాక్..ఈ బ్రాహ్మణ స్టైల్ అరటిపువ్వు వడ ట్రై చేయండి!
ఆరోగ్యంగా వుండాలంటే... చన్నీళ్ళ స్నానమే?

క్రమం తప్పకుండా రోజూ చల్లని నీటితో స్నానం చేస్తే, చాలా వ్యాధులు నివారించవచ్చు. చల్లని నీరు రక్తప్రసరణ అధికం చేసి మీ రోగ నిరోధకత పెంచుతుంది. చాలామంది వేడినీటి స్నానం కంటే కూడా చల్లని నీటి స్నానాన్ని కోరతారు. అది వారిలోని ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దూరం చేస్తుందంటారు. మరి అసలు ఈ చల్లని నీటి స్నానం ఏ రకమైన ఆరోగ్య ప్రయోజనాలిస్తుందనేది పరిశీలిద్దాం.
రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది - చన్నీటి స్నానం మొదటి ప్రయోజనం రక్త ప్రసరణ పెరగటం. చల్లని నీరు శరీరానికి తగిలితే అది రక్త ప్రసరణ పెంచి గుండె ఆరోగ్యం కాపాడుతుంది. అంతేకాదు, మీలోని చర్మ కాంతి పెరిగి మీరు ఎప్పటికి తాజాగా, చిన్న వయసు వారిగా కనపడతారు.
డిప్రెషన్, ఒత్తిడి దూరం చేస్తుంది - వర్జీనియా కామన్ వెల్త్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోని రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్ మెంట్ పరిశోధన మేరకు చల్లని నీటి స్నానం బ్రెయిన్ లోని బ్లూ స్పాట్ ను ఉత్తేజపరచి ఎడ్రినాలిన్ హార్మోన్ ను ప్రభావితం చేస్తుంది. ఇది మానవులలో డిప్రెషన్ దూరం చేస్తుంది. కనుక ఎపుడు ఒత్తిడి వున్నా లేక డిప్రెషన్ కలిగినా, చల్లని నీటి స్నానం చేసి ఔషధాల ఖర్చు లేకుండా హాయి పొందండి.
రోగ నిరోధకతను పెంచుతుంది - రెగ్యులర్ గా చల్లని నీటి స్నానం చేస్తే మన శరీరంలో రోగాలతో పోరాడే తెల్ల రక్త కణాలు సంఖ్య పెరుగుతుందని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రీసెర్చి చెపుతోంది. ఆ రకమైన నీటి వైద్యం మన రోగ నిరోధకతలను మెరుగుపరచి, మెటబాలిజం రేటు పెంచుతాయి. మెటబాలిజం రేటు పెరిగితే మరోమారు రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది.
చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా వుంటాయి - చల్లని నీరు మన చర్మం నుండి హానికరమైన రసాయనాలను తొలగిస్తుంది. వేడినీరు చర్మ రంధ్రాలను తెరిస్తే, సరిగ్గా దానికి వ్యతిరేకంగా చల్లని నీరు పనిచేస్తుంది. చర్మ రంధ్రాలు మూసుకుంటే మురికి అక్కడ పేరుకోదు. చర్మం శుభ్రంగా వుండి, మొటిమలవంటివి రాకుండా వుంటాయి. చల్లని నీటి స్నానం మీ వెంట్రుకలు నల్లగా మెరవటమే కాక, జుట్టు రాలకుండా, చేస్తుంది. డాండ్రఫ్ లేదా చుండ్రు రాకుండా తల పై భాగాన్ని కాపాడుతుంది.
ఫలదీకరణ మెరుగవుతుంది - చల్లని నీటితో ప్రతిరోజూ స్నానం చేస్తే, ఎండోక్రిన్ సిస్టం నియంత్రించబడి దాని హార్మోన్ తయారు చేస్తుంది. వేడి నీళ్ళ స్నానం వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తుంది. కనుక పురుషులు ప్రతిరోజూ వేడినీటి స్నానం చేయరాదు. వేడి నీటి స్నానం వారికి గర్భ నిరోధకంగా పనిచేస్తుంది.
చల్లని నీటి స్నానం మీకు శక్తిని, తాజాదనాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ శరీరానికి, మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కనుక చల్లని నీటి స్నానం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారిగా చెప్పాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications