Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
నిత్యం వేధించే తలనొప్పికి గుడ్ బై చెప్పే టాప్ 10 చిట్కాలు

తల నొప్పి తగ్గడానికి 10 చిట్కాలు:
1. ఒక్కోసారి విపరీతమైన తలనొప్పికి డీ హైడ్రేషన్ కూడా కారణమవ్వచ్చు. అందుకని ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్ళు తాగండి. అంతే తలనొప్పి తగ్గుముఖం పట్టడం మీరు గమనిస్తారు.
2. రిలాక్స్ అవ్వడం: తలనొప్పి చిరాకు తెప్పిస్తుందనుకుంటే కాసేపు అన్ని పనులను పక్కన పెట్టేసి రిలాక్స్ అవ్వడం మేలు. దీనివల్ల అలసట తగ్గి తలనొప్పి హుష్కాకి అయిపోతుంది.
3. డైట్: ఒక్కోసారి మనం తీసుకునే ఆహారం కూడా మన తలనొప్పికి కారణమవ్వచ్చు. కాబట్టి మీ ఆహార పద్ధతులను మార్చేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.
4. కాల్షియం సప్లిమెంట్: కాల్షియం సప్లిమెంట్ వల్ల రక్తప్రసరణ జరిగి మీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఒక గ్లాసు నిండా ఆరెంజ్ జ్యూస్ తాగడం లేదా మెగ్నీషియం, కాల్షియం ఉండే సప్లిమెంట్ తీసుకున్నా తలనొప్పి నుండి రిలీఫ్ ని ఇస్తుంది.
5. ప్రెజర్ పాయింట్స్ ని నొక్కి ఉంచడం: మన అరచేతిలో ముఖ్యంగా మన చూపుడు వేలుకు, బొటన వేలుకు మధ్య ఉండే ప్రదేశంలో కరెక్టుగా ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. వాటిని 2, 3 నిమిషాల పాటు నొక్కి ఉంచినట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది.
6. ఎక్సర్ సైజు: సాధారణ తలనొప్పి ఉన్నవాళ్ళకు ఇది మంచి చిట్కా, అనువైన ఎక్సర్ సైజు ను ఎంచుకుని చేయడం మంచిది. తద్వారా శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి తలనొప్పి తగ్గే అవకాశాలు ఉన్నాయి.
7. తల మసాజ్: మీకు మసాజ్ గురించి తెలిసే ఉంటుంది. రాకరకాల స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందాలన్నా, టెన్షన్ నుండి రిలాక్స్ అవ్వాలన్నా మసాజ్ చక్కటి పధ్ధతి. తలనొప్పికి పని ఒత్తిడి కూడా కారణం. కాబట్టి తల , మెడ మసాజ్ చేస్తే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది.
8. వేడి నీళ్ళతో తల స్నానం: తల నొప్పి ఎక్కువగా ఉంటే గోరువెచ్చటి నీటితో తల స్నానం చేసేయండి. తలనొప్పిని చేతితో తీసిపడేసినట్టుగా, రిలాక్స్ గా ఫీలవుతారు.
9. ఐస్ ప్యాక్: తలనొప్పి తగ్గడానికి ఐస్ ప్యాక్ కూడా ఉపకరిస్తుంది. ఒక శుభ్రమైన టవల్ లో చల్లగా ఉండే ఏదైనా వస్తువును చుట్టి మీకు ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ కాసేపు పెట్టుకుంటే సరి. నొప్పి మాయమవుతుంది.
10. ఆరోమా థెరపీ: ఆరోమా థెరపి అన్ని రకాల శ్రేయస్కరం. చందనం, మిరియాలు, యూకలిప్టస్, లావెండర్ మరియు రకరకాల ఔషధాలతో తయారైనది. తలనొప్పి దూరం చేయడానికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
