Latest Updates
-
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి!
మీ ఆరోగ్యపరిరక్షణకు 10 సూపర్ ఫుడ్స్...
ప్రాణకోటి జీవించాలంటే పోషకాహారం చాలా అవసరం. మన శరీరానికి కావలసిన పోషకాలు ఏ ఏ ఆహారపదార్థాలలో లభిస్తాయో చూద్దాము.
ఇక్కడ మీరు మీ రోజువారీ భోజనంలో చేర్చడానికి అవసరమైన మంచి ఆహారపదార్థాల జాబితా ఇస్తున్నాము. చదవండి.
ఈ ఆహారపదార్థాలు పోశాకాలతో నిండి ఉన్నాయి మరియు ఇవి మిమ్మలిని తీవ్రమైన వ్యాధుల బారినపడకుండా ఉంచడమే కాకుండా మీ వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టం చేస్తాయి మరియు మీ చర్మం మరియు జుట్టుపట్ల శ్రద్ధ వహించటానికి కూడా పనిచేస్తాయి. బహుశ, వీటిలో కొన్ని మీరు తినే రోజువారి భోజనంలో ఉండవొచ్చు, లేనట్లయితే ఇప్పుడు మీరు ప్రారంభించవొచ్చు. మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి.

అవెకాడో పండు
అవకాడొలు, మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (MUFAs)వంటి గొప్ప వనరులు మాత్రమే కాదు, ఇందులో ఇతర పోషకాలు మరియు గుండెను రక్షించే కాంపౌండ్స్ కూడా ఉన్నాయి. కరిగే ఫైబర్, విటమిన్ E, ఫోలేట్, మరియు పొటాషియంను కూడా కలిగి ఉన్నాయి.
ఎలా తినాలి? మీరు సలాడ్లు మరియు సల్సాస్ లలో అవకాడొలను వాడవొచ్చు. జున్ను లేదా మాయో దూరంగా ఉంచండి మరియు వీటికి బదులుగా ఈ పండును ఉపయోగించండి.

బ్రోకలీ
నిపుణులు బ్రోకలీ ప్రాణాంతక వ్యాధులతో పోరాడే లక్షణాలు కలిగి ఉందని నమ్ముతారు. ఈ ఆకుపచ్చ కూరగాయ గుండె వ్యాధులు మరియు క్యాన్సర్ ను కూడా నివారించటంలో సహాయపడవచ్చు.
ఎలా తినాలి? మీరు దీని పువ్వును ఆవిరి మీద ఉడికించి, మీ వేపుడు కూరలో కలపవొచ్చు.

గ్రుడ్డ్లు
గ్రుడ్డ్లు హాని చేస్తాయని ఎవరు చెప్పారు? గ్రుడ్డ్లలో పోషకాలు మరియు జీవ క్రియ రక్షకాలు పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా గ్రుడ్లు గుండెకు సంబంధించిన వ్యాధులతో ముడిపడి ఉంటాయి, కాబట్టి వారానికి మూడు గ్రుడ్ల పచ్చసొనలు మాత్రమే తీసుకోవాలి. గ్రుడ్ల తెలుపు భాగం మాత్రం రోజు తీసుకోవొచ్చు.
ఎలా తినాలి? గ్రుద్దును గిలకోట్టండి లేదా రెండు గ్రుడ్డు తెల్లసోనలు మరియు ఒక గ్రుడ్డు పచ్చసొనను కలిపి ఆమ్లెట్ గా వేసుకోవొచ్చు.

పాలు
ప్రతిరోజూ ఫాట్-ఫ్రీ పాలు ఒక గ్లాసు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కాల్షియం ఎముకలను పటిష్టం మాత్రమే చేయడమే కాకుండా, క్రొవ్వు విరోధిగా కూడా పని చేస్తుంది.
ఎలా తీసుకోవాలి? మీరు ఓట్స్ తీసుకున్నప్పుడు నీరుకు బదులుగా ఫాట్-ఫ్రీ పాలు తీసుకోండి మరియు రాత్రుళ్ళు మంచి నిద్ర పోవాలంటే పడుకునేముందు గోరువెచ్చని పాలు చాకొలెట్ తో కలిపి తీసుకోండి.

నట్స్
వీటిని తీసుకోవటం వలన మీరు ఆరోగ్యంగా మాత్రమే కాదు మీ హెయిర్ మరియు చర్మం కూడా మంచి స్థితిలో ఉంటాయి. రోజు ఒక గుప్పెడు నట్స్ తీసుకోవటం వలన గుండె వ్యాధి మరియు చక్కర వ్యాధి ప్రమాదం తక్కువగా ఉంటుంది. వీటిలో గొప్ప యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా 3S మరియు ఆరోగ్యకరమైన నూనెలు ఉన్నాయి.
ఎలా తీసుకోవాలి? చిన్న ముక్కలుగా తరిగిన నట్స్ ను (అక్రోట్లు, బాదం, పిస్తాలు యొక్క మిశ్రమం) మీరు ఉదయం తీసుకునే సిరీల్స్, సలాడ్స్ మరియు వేపుడు కూరల పైన చల్లుకోంది. భోజనం, అల్పాహారం మధ్యన ఒక గుప్పెడు నట్స్ తీసుకోవొచ్చు.

సాల్మన్
చేప నూనెలను కొన్నిసార్లు మీ చర్మం మరియు జుట్టు కోసం చర్మరోగ నిపుణులు సూచిస్తారు. రోజు చేపను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. గుండె జబ్బులను నివారించటం నుండి మీ చర్మం సున్నితంగా,కాంతివంతంగా చేస్తుంది మరియు శరీర బరువును తగ్గిస్తుంది మరియు ఆర్హ్రితిస్ యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. సాల్మన్ లో విటమిన్ D మరియు ఒమేగా 3S పుష్కలంగా ఉన్నాయి.
ఎలా తీసుకోవాలి? సల్మాన్ ఫిల్లెట్(ఉప్పు, నిమ్మరసం, వెల్లుల్లి మరియు మిరియాలు యొక్క డాష్ ఒక పొర లేదా రెండు) చేయండి మరియు ఉడికించిన కూరగాయలతో వడ్డించండి.

టోఫు
కొవ్వు మాంసాలు మరియు చీజ్ స్థానంలో మీరు టోఫు మరియు సోయా పాలు తీసుకోవటం వలన మీ శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది మరియు మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. సోయాలో గుండెకు ఆరోగ్యకరమైన పాలీఅన్సాచ్యురేటేడ్ కొవ్వులు, ఎక్కువ శాతం ఫైబర్ మరియు కొన్ని ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. దీనిలోని ఐసోఫ్లవోన్లు కూడా రొమ్ము క్యాన్సర్ నిరోధించడానికి సహాయపడతాయి.
ఎలా తినాలి? మీ సలాడ్లలో టోఫు యొక్క క్యూబ్స్ ను ఉపయోగించండి. మీరు చోలే మరియు రాజ్మా ఉడికించినట్లుగా మీకు సోయా బీన్స్ ను కూడా ఉడికించుకోవొచ్చు.

వోట్మీల్
వీటిలో ఫైబర్ పదార్ధం ఎక్కువగా ఉండటంవలన గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది మరియు తీపి పదార్ధం తక్కువగా ఉన్న ఓట్స్ తీసుకోవటం వలన టైప్ 2 డైయాబెటిస్ వ్యాధిని నిరోధించవొచ్చు.
ఎలా తినాలి? పండ్ల టాపింగ్ యొక్క వివిధ అల్పాహారంలో, పాలు లేదా పెరుగులో వోట్స్ కలిపి తీసుకోవొచ్చు. మీ సాల్మన్ కు ఓట్స్ పూత వేసి వేపుడు చేసుకోవొచ్చు.

ఆలివ్ నూనె
ఆలివ్ నూనె చెడు కొలెస్ట్రాల్ ను తక్కువ చేస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ఈ MUFA గొప్ప చమురు సహాయంతో తగ్గించవచ్చు.
ఎలా వాడాలి? మీ సలాడ్లు మరియు మరినదేస్ పైన వేదిచేయని ఆలివ్ నూనెను చిలకరించండి. వేపుడు కూరలు తయారుచేయటానికి ఆలివ్ నూనెను వాడండి.

పెరుగు
మన దేశంలో, దహి లేదా పెరుగు ఎల్లప్పుడూ మన రోజువారీ ఆహారంలో వాడుతుంటారు. దీనిలో కాల్షియం మాత్రమే కాదు, రోగ-నిరోధక వ్యవస్థను పెంపొందించే బాక్టీరియా కూడా ఉన్నది. మీరు ఆర్గానిక్ గా ఉండాలంటే, తక్కువ కొవ్వు శాతం ఉన్న పెరుగును వాడాలి.
ఎలా తినాలి? దీనిని పండ్లతో కలిపి రుచికరంగా తినండి. ఒక కప్పు మీకు ఇష్టమైన మామిడి పండును తీసుకోండి మరియు ఒక కప్పు పెరుగుతో బాగా కలపండి. మామిడిపండ్లు తియ్యగా ఉంటాయి,కాబట్టి పంచదార వేయకండి.



Click it and Unblock the Notifications











