Latest Updates
-
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది!
నీరసంగా ఉందా.. ఐతే చెరకు రసంతో తక్షణ శక్తిని పొందండి
గతంలో చెరకు లేదా చెరకు రసాన్ని పల్లెటూర్లలోనే చూస్తున్నాం. కానీ ప్రస్తుత కాలంలో పట్టణాలు, నగరాల్లో కూడా షుగర్ కేన్ స్టాల్స్ ఏర్పడ్డాయి. మనం అక్కడ చూస్తుంటాం. చెరకు నుండి రసాన్ని వేరు చేసి అమ్ముతుంటారు. మీ తెలియాల్సిన ఓ ఆశ్చర్యకర విషయం ఏంటే ఇందులో ఆరోగ్యనానికి సహాయపడే చాలా ఉపయోగాలున్నాయి. ఈ సంక్రాంతి రోజుల్లో ప్రతి ఇంటా చెరకు నిల్వ ఉంటుంది. పొంగల్ సెలబ్రేషన్స్ లో చరకు అతి ముఖ్యంగా ఉపయోగిస్తారు. పండుగ తర్వాత ఈ చెరకు గడలను పారవేయడం కంటే వాటిలో నుండి రసం తీసి మీ ఆరోగ్యనాకి కావల్సిన కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఈ చెరకు రసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినిరల్స్, విటమిన్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
చెరకు రసం పిల్లలు, పెద్దల నోరూరించే చెరకు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చెరకు రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. తక్షణ శక్తినందించడం దీని ప్రత్యేకత. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు మేళవించి చేసే చెరకు రసంలో పోషకాలు కూడా అధికంగానే ఉన్నాయి. శీతల పానీయాలు, కోలాలతో పోలిస్తే ఇది నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. శరీరంలో నీటిస్థాయి పడిపోకుండా జాగ్రత్తపడుతుంది. మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడే వారికి చెరకు రసం చక్కని పరిష్కారం. అంతే కాకుండా కొన్ని ప్రత్యేకమైన జబ్బులను ఇది నివారిస్తుంది. అవేంటో చూద్దాం...
1. కామెర్లకు విరుగుడు: సుగర్ కేన్ జ్యూస్(చెరకు రసం) కామెర్లును సహజంగా నయం చేసే ఒక ఔషధం. రక్తంలోని బిల్లిరుబిన్ కారణంగా కామెర్లు ఏర్పడి చర్మం పొరలుగా పసుపు రంగులోకి మారుతాయి. ఇది కాలేయ పనితీరు సరిగా లేకపోవడం మరియు పిత్తాశయ వాహికలు మూసుకుపోవడం వల్ల కామెర్లకు కారణం అవుతుంది. కాబట్టి దీని నుండి బయట పడటానికి ఒక గ్లాసు చెరకు రసంకి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి ప్రతి రోజూ తీసుకోవాలి.
2. ఇన్ఫెక్షన్(వ్యాధులు): అనేక రకాల వ్యాదులు ఉదా: డయోరియా, మూత్ర మార్గ అంటువ్యాధులు, కడుపు(జీర్ణ) లేదా గుండె సంబంధించిన వ్యాధులు, లైంగిక సంక్రమణ, వాపు ఇటవుంటి వ్యాధులకు చెరకు రసం బాగా నయం చేయవచ్చు.

3. కిడ్నీ(మూత్రపిండం)లో రాళ్ళు: చెరకు రసంతో ఇది చాలా ప్రభావవంతమైన ఆరోగ్య ప్రయోజనం. డీహైడ్రేషన్ వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడుతాయి. కాబట్టి ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు విచ్చినం చేయడానికి సహాయం చేస్తుంది. ఎక్కువ ద్రవాలను మరియు చెరకు రసాన్ని తాగడం వల్ల మూత్రపిండంలో రాళ్ళు విచ్చిన్నం చేయడానికి, కరిగిపోవడానికి చెరకు రసం ఉపయోగపడుతుంది.
4. మధుమేహానికి: మధుమేహం ఉన్నవారికి షుగర్ కేన్ బాగా సహాయపడుతుంది . ఇది ముడి షుగర్ కన్నా లేదా ఆర్టిఫిషియల్ షుగర్ కన్నా ఈ షుగర్ కేన్ జ్యూస్ చాలా మంచిది. మీరు బరువు తగ్గించే పనిలో ఉన్నా లేదా డయాబెటిక్ షుగర్ కేన్ జ్యూస్ తాగడం చాలా ఆరోగ్యకరం. ఈ జ్యూస్ వల్ల శరీరంలో రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ ను క్రమబద్దీకరిస్తుంది.
5. న్యూట్రిషియన్ బెనిఫిట్స్: శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి తో పాటు బి2 (రైబోఫ్లావిన్) పుష్కలంగా అందుతుంది. అదనంగా మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. కెలొరీలు తక్కువ.. పోషకాలెక్కువ. రుచితో పాటు అందుబాటులో కూడా ఉండే ఈ చెరకు రసంలో కార్బోహైడ్రేట్లు అపారం.
6. జలుబు, జ్వరం మరియు గొంతు నొప్పి: మీరు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం హానికరం అని భావిస్తే అది తప్పే. ఇటువంటప్పుడు ఒక గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల ఈ జబ్బులను నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
7. క్యాన్సర్ నివారిణి: ఇందులో ఆల్కలీన్ కలిగి ఉండటం వల్ల, చెరకు రసం ముఖ్యంగా ప్రొస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల లేదా రొమ్మక్యాన్సర్, క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.
8. రీహైడ్రేషన్: సాధారణంగా మనలో చాలా మంది ఎక్కువగా నీరు త్రాగరు. దాంతో డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. కాబట్టి శరీరంలో నీటిని నిల్వ చేయడానికి చెరకు రసం బాగా సహాయపడుతుంది. ఇంకా వేసవి కాలంలో చెరకు రసం త్రాగడం వల్ల శరీరపు వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications