Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళలు బరువు పెరిగితే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు..!
ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం కూడా ఒక్కటిగా చెప్పవచ్చు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల ఊబకాయం సమస్య మరింత పెరుగుతూ వస్తోంది. శరీరంలో అవసరమైనదానికి కన్నా ఎక్కువ మొత్తంలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వల్ల ఊబకాయమనే సమస్య ఉత్పన్నమవుతుంది. ఊబకాయం వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. అయితే ఈ ఊబకాయం అనే సమస్య పురుషుల్లో కంటే మహిళల్లోనే కాస్త ఎక్కువగా ఉంటోంది.
పురుషుల్లో ఊబకాయం అనేది సాధారణ వైద్య లక్షణాలుగానే పరిగనిస్తారు. అయితే మహిళలల్లో ఏర్పడే ఊబకాయం సైకలాజికల్ గా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. అధిక బరువు ఉన్న మహిళల్లో ఊబకాయం తనతోపాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు వెంటబెట్టుకు వస్తుంది. రక్తపోటు, పలురకాల గుండెజబ్బులతోపాటు రుతు(మెనుస్ట్రువల్) సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లాంటి మానసిక వ్యా«ధులకు ఊబకాయం కారణమవుంది.
ఊబకాయం వల్ల మహిళల్లో ముఖ్యంగా రుతు సమస్యల దారితీస్తుంది. దాంతో రుతుక్రమంలో తేడాలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి యుక్త వయస్సు ఉన్న ఊబకాయుల్లో ఉండే అతి సాధారణ సమస్య. ఊబకాయం వల్ల సంతానలోపం, వయస్సు మీద పడినట్టు కనపించడం వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఊబకాయం వల్ల మహిళల్లో ఇంకా గర్భాశయంలో పాలిసిస్టిక్ ఓవరీస్ మరియు హార్మోనుల అసమతుల్యత వంటి లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి.
మహిళల్లో ఊబకాయం వల్ల మానసిక ప్రభావాలు కూడా చాలా ఉన్నాయి. శరీరంలో అధనంగా పెరిగే క్రొవ్వు వల్ల శరీరం యొక్క చర్మ మీద అసహ్యమైన చారలు(స్ట్రెచ్ మార్క్స్)మరియు పాదాల పగుళ్ళకు దారితీస్తుంది. ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురిచేస్తుంది. అంతే కాదు ఊబకాయం ఉన్న మహిళల్లో మరికొన్ని ఎఫెక్ట్స్ ఏంటో ఒకసారి పరిశీలించండి..

ఇర్రెగ్యులర్ పీరియడ్స్: శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు వల్ల ఈ కొవ్వు యూట్రస్(గర్భాశయం)చుట్టు పేరుకుపోవడం వల్ల గర్భశాయం మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో పీరియడ్స్ లో మార్పులు జరుగుతాయి. వేపుళ్ళు, జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఇలా జరగవచ్చు.

గుండె సంబంధిత సమస్యలు: పురుషుల కంటే మహిళల్లో గుండె వ్యాధులు తక్కువ అని భావిస్తుంటారు. పోస్ట్ మోనోపాజ్ మహిళల్లో గుండె వ్యాదులు నిజంగానే ప్రమాధాన్ని కలిగిస్తాయి. కనుక మీరు ఊబకాయం కంటే ఎక్కువ బరువు ఉన్నా కూడా గుండె సంబంధిత సమస్యలు కలిగించే ప్రమాదం ఉంది.

కండరాల క్షీణత: శరీరంలో ఎక్కువ కొవ్వు చేరడం వల్ల కండరాల క్షీణత మరియు బలహీనత జరగుతుంది. ఊబకాయగ్రస్తులు వారి బారీ శరీరంతో ఎటువంటి వ్యాయామాలు చేయకపోవడం వల్ల కండరాలు బలహీనపడుతాయి.

హై బ్లడ్ ప్రెజర్: ఊబకాయగ్రస్తుల్లో రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ నిక్షేపణ కారణంగా అధిక రక్తపోటు రావడం సాధారణం.

కీళ్ళవాపు: శరీరంలోని జాయింట్స్ మీ శరీరబరువును మోయలేక జాయింట్స్ మీద ఒత్తిడి పుడుతుంది. దాంతో కీళ్ళ నొప్పుల వంటి దీర్ఘకాలిక వ్యాదులకు కారణం అవుతుంది.

పగిలిన పాదాలు: అధిక బరువు ఉన్నప్పుడు ఆ బరువు మొత్తం కాళ్ళు పాదాల మీద ఒత్తిడి పెంచుతుంది. దాంతో కాళ్ళ, పాదాల పగుళ్ళకు దారితీస్తుంది.

పిత్తాశయంలో రాళ్ళు : పిత్తాశయ రాళ్ళు గాల్ బ్లాడర్ లో ఏర్పడుతాయి. ఎందుకంటే మహిళలు అధిక బరువు ఉండటం చేత ఇవి మహిళల పిత్తాశయంలో రాళ్ళు ఎక్కువగా పడుతాయి.

పాలీ సిస్టిక్ ఓవరీస్: పాలిసిస్టిక్ ఓవరీస్ ఇది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ఫలితంగా గర్భాశయంలో ఏర్పడుతాయి. ఇవి చిన్న తిత్తులు లేదా నీటి బుడగలు వలే ఉండి అండాశయము పైన అంటిపెట్టుకొని ఉండు రుతు సమస్యలను దారితీస్తుంది. దాంతో మహిళల్లో వంధ్యత్వానికి దారితీస్తుంది.

సంతాన ప్రాప్తి లేకుండుట: లావుగా ఉన్న మహిళల్లో హార్మోనుల అసమతుల్యతలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ. మహిళల్లో వ్యంద్యత్వానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

స్ట్రెచ్ మార్క్స్: ఎపిడెర్మిస్(చర్మ మీద ఉన్న పైపొర) దాని పరిమితి దాటి స్ట్రెచ్ మార్క్స్ (చారలుగుర్తులు)ఏర్పడుతాయి. ఇవి చూడటానికి అసహ్యంగా ఏర్పడుతాయి.

డిప్రెషన్: మహిళల్లో డిప్రెషన్ అనేది చాలా సాధారణ విషయం. మహిళల్లో డిప్రెషన్ కు ప్రధాణ కారణం హార్మోనుల అసమతుల్యత ఇది ఊబకాయం వల్ల వచ్చేదే. లావు ఎక్కువగా ఉండటం వల్ల సైకలాజికల్ ఎఫెక్ట్స్ మహిళల్లో ఎక్కువగా ఉంటుంది.



Click it and Unblock the Notifications