Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఎసిడిటి ఉన్నవారు తినకూడని కొన్ని ఆహారపదార్థాలు...!
ప్రస్తుత రోజుల్లో చాలమందిలో ఎసిడిటి కామన్ ప్రాబ్లెమ్ అయిపోయింది. గుండెలో మంట, అమాశయంలో నొప్పి, ఆహారం అరగనట్లు అనిపించటం, త్రేన్పులు, ఆకలి తగ్గటం, వికారం, వాంతులు నోట్లో నీళ్లూరుతున్నట్లు ఉండటం ఈ లక్షణాల్లో చాలాభాగం మహిళలను వేధిస్తుంటాయి. అనేక సందర్భాల్లో తలనొప్పి, నెలసరి నొప్పివంటివి వాటికి మందులు వేసుకున్నప్పుడు పై లక్షణాలు మూకుమ్మడిగా వేధిస్తాయి. ఈ లక్షణాల సమూహానికి వైద్య పరిభాషలో గ్యాస్‌ట్రైటిస్ అని పేరు. అయితే దీన్ని అందరూ సాధారణంగా ఎసిడిటి అంటుంటారు. ఆయుర్వేదంలో ఆమ్లపిత్తం అని పేరు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్, చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఆహారం తీసుకోవడంలో అవకతవకలు, మానసికమైన ఆందోళనలు, ఇవన్నీ కూడా యాసిడ్ రిఫ్లెకు కు కారణం అవుతాయి. నిద్రాహారాలు లేకుండా చేసే ఈ సమస్య మీద సరైన అవగాహన కలిగి ఉంటే దీనిని సునాయాసంగా ఎదుర్కోవచ్చు.
ఎసిడిటి ఉన్నప్పుడు ఆహారం తినాల్సిన విధానం: ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో నిదానంగా నమిలి తినాలి. హడావిడిగా మింగకూడదు. అలాగని గంటల తరబడి తింటూ కూర్చోకూడదు. గబగబా మింగితే ఆమాశయంలోని యాసిడ్ అన్ననాళికలోకి ఒంగి మంటగా అనిపిస్తుంది. గంటల తరబడి తింటూ ఉంటే ఆహారం సగం జీర్ణం, సగం కాకుండా అజీర్ణం కలుగుతుంది. ఎసిడిటి ఉన్నవారు ప్రతి మూడు గంటలకు ఏదో ఒక ఆహార పదార్థాన్ని తింటూ ఉండటం మంచిది.
ఎప్పుడు నిద్ర పోవాలి?: ఆహారం తిన్న తర్వాత కొంచెం సేపు కూర్చోవాలి. ఆ తరువాత వంద అడుగులు అంటూ ఇటూ నడవాలి. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు. నిద్రకూ, ఆహారానికీ మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఆమాశయంలోనికి ప్రవేశించిన ఆహారం చిన్నప్రేవులోనికి వెళ్లడానికి అరగంట నుంచీ రెండు గంటల వరకు పడుతుంది. ఈ లోపు పడుకుంటే అన్నం మెతుకులు గొంతులోకి వచ్చే అవకాశం ఉంది.
ఎసిడిటికి అసలు కారణం తీసుకొనే ఆహారం. రాత్రిళ్ళో నిద్ర, సరైన టైమ్ కు నిద్రకపోకపోవడం కూడా ఎసిడిటికి కారణం అవుతుంది. రాత్రి సమయంలో మీ నిద్రను పాడు చేసే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆశ్చర్యం కదా...? కొన్ని పదార్థాలను రాత్రిల్లో తినడం వల్ల ఎసిడిటి, ఛాతీలో మంట, కడుపులో వికారం వంటి సమస్యలు ఏర్పడుతాయి. అంతే కాదు తెల్ల వారి నిద్రలేవగానే పుల్లని త్రేన్పులు, వాంతి, నోట్లో చేదుగా అనిపించడం, నోట్లో నీళ్ళు ఊరడం వంటి లక్షణాలు కనబడుతాయి. ఇదంతా రాత్రి సమయంలో తీసుకొనే కొన్ని ఆహారాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ అపహారాలే ఎసిడిటికి దారిస్తుంది. కాబట్టి హార్ట్ బర్న్ సమస్య నుండి బయట పడాలంటే ఎసిడిటికి కారణం అయ్యే కొన్ని ప్రాబ్లమ్యాటిక్ ఆహారాలను రాత్రి సమయంలో అవాయిడ్ చేయడమే ఉత్తం. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

స్పైసీ ఫుడ్: స్పైసీ ఫుడ్స్ తినడం మీకు ఇష్టమైతే, మీ వంటకాల్లో కారాన్ని తగ్గించాలి. లేదా స్పైసీ ఫుడ్ తీసుకోవడంలో మోతాదును తగ్గించాలి. స్పైసీ ఫుడ్ వల్ల అతి త్వరగా ఎసిడిటి ఏర్పడుతుంది. వేపుడు కూరలు, జిడ్డు కలిగిన వస్తువులు, కొవ్వు కలిగిన పదార్థాలు. ఇవి ఆవ్లూశయంలోని పొరలకు అంటిపెట్టుకొని ఉండి యాసిడ్ ఎక్కువగా తయారయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటి సమస్య తలెత్తుతుంది. మసాలాలు, కారం, పులుపు పదార్థాలు, నారింజ, నిమ్మ, కమలా, ద్రాక్ష, చింత వంటి పుల్లటి ఫలాలు ఎసిడిటిని ఎక్కువ అయ్యేలా చేస్తాయి కనుక మానేయాలి.

చాక్లెట్స్: చాక్లెట్స్ తినడం మానేయాలి. ఇవి ఆవ్లూశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళం లోకి లీక్ అయ్యేలా చేస్తాయి. చాక్లెట్స్ లో ప్యాట్స్, కెఫిన్ మరియు కోకా అధికంగా ఉండటం వల్ల ఎసిడిటి సమస్యను తీవ్రతరం చేస్తాయి.

కార్బోనేటెడ్ డ్రింక్స్: కాఫీ, టీ, కోలా డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, సోడా, తదితరాలను మానేయాలి. ఇవి ఆవ్లూశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళం లోకి లీక్ అయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది. కాబట్టి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం చాలా మంచిది.

పిజ్జా: మీరు రాత్రి భోజనం బయట ఇటాలియన్ ఫుడ్ తినాలనుకొన్నప్పుడు, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే పిజ్జాలో స్పైసీస్, టమోటో సాస్ మరియు చీజ్ వంటివి మీ జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలుగజేస్తాయి. ఇది ఆహారంగా తీసుకోవడం వల్ల కడుపు నిండుగా, భారంగా అనిపిస్తుంటుంది. కాబట్టి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకొని ఎసిడిటికి కారణం అవుతుంది. కాబట్టి పిజ్జా బర్గర్లను నైట్ టైమ్ అవాయిడ్ చేయడమే మంచిది.

మాంసాహారం: రెడ్ మీట్(మాంసాహారం): మాంసాహార ప్రియులు బయట అందంగా అలంకరించిన నాన్ వెజ్ ఐటమ్స్ ను చూసి ఆకర్షింపబడి రాత్రి డిన్నర్ కి కొంచెం ఎక్కువగా లాగించేస్తారు. దాంతో ఏమవుతుంది? మాంసాహారంలో అధిక ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి సమయంలో జీర్ణం అవడానికి కష్టం అవుతుంది. ఎసిడిటికి కారణం అవుతుంది. కాబట్టి రాత్రి సమయంలో అతి తక్కువగా తినడం లేదా పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. ముఖ్యంగా డిన్నర్ బెగ్గర్ లా తినాలి. బ్రేక్ ఫాస్ట్ కింగ్ లా తినాలి. అప్పుడే మీ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది.

పాలు: రాత్రి సమయంలో చల్లగా ఉండే పచ్చిపాలను త్రాగడం వల్ల ఛాతి మంటను తగ్గిస్తుంది. అయితే హెవీ మీల్స్ తీసుకొన్న తర్వాత పాల త్రాగడం వల్ల పరిస్థితి వ్యతిరేకంగా ఉంటుంది.

చీజ్: చీజ్ మరయు బట్టర్ లో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. హై ఫ్యాట్ చీజ్ మరియు బటర్ వంటివి రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల ఎసిడిటికి కారణం అవుతుంది. కాబట్టి వీటిని రాత్రి సమయంలో తీసుకోక పోవడం చాలా మంచిది.

ఆల్కహాల్: బీర్, వైన్, విస్కి, బ్రాంది తదితరాలను మానేయాలి. ఇవి ఆవ్లూశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళంలోకి లీక్ అయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది. కాబట్టి ఆల్కహాల్, బెవరేజస్ ను తీసుకోకపోవడం మంచిది.

స్మోకింగ్: స్మోకింగ్ చేయకూడదు. సిగరెట్ పొగవల్ల అమాశయపు లోపలి పొర రేగటమే కాకుండా, ఒకవేళ అల్సర్లు ఏవన్నా తయారైతే మొండిగా మారతాయి.

కాఫీ: కాఫీ, టీ, మానేయాలి. ఇవి ఆవ్లూశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళం లోకి లీక్ అయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది. కాఫీ తాగడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే ఇందులో ఎక్కువగా కెఫిన్ ఉండటం వల్ల ఎసిడిటికి కారణం అవుతుంది.

సిట్రస్ పండ్లు: పండ్లు ఆరోగ్యానికి మంచిదే. అయితే అవి తినడానికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. పండ్లను రాత్రి సమయంలో ఎందుకు తీసుకోకూడదంటే చాలా రకాల పండ్లలో యాసిడ్స్ మరియు జ్యూస్ లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గాస్ట్రిక్ మొదలవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సిట్రస్ కలిగినటువంటి ద్రాక్ష, ఆరంజ్, పైనాపిల్, బెర్రీస్ పండ్లను అవాయిడ్ చేయాలి. ఇటువంటి పండ్లను తినడానికి మధ్యహాన్నం మంచి సమయం. ఉదయం 11 నుండి సాయంత్రం 4గంటల సమయంలోపల తీసుకొంటే అవి సులభంగా జీర్ణం అవుతాయి.

టమోటో: ఎసిడిటి ఉన్నవారు టమోటోలను పూర్తిగా మానేయమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. సాధారణంగా టమోటో జ్యూసీగా ఉండి ఎసిడిటికి కారణం అవుతుంది. దాంతో ఛాతీలో మంట పుడుతుంది.

మింట్ టీ: గుండెలో మంట, ఎసిడిటికి మింట్ టీ త్రాగడానికి చాలా మంది సలహా ఇస్తుంటారు. అదే విధంగా హార్ట్ బర్న్ ఎక్స్ పర్ట్స్ ఈ మింట్ టీ ఎసిడిటికి కారణం అంవుతుందని వారి నమ్మకం.



Click it and Unblock the Notifications











