Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
గోధుమల్లో మీకు తెలియని కొన్నిఉత్తమ ఆరోగ్యప్రయోజనాలు
గోధుమ (Wheat) ఒక ప్రధానమైన ధాన్యము. గోధుమ భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో ఒకటి. గోధుమ పిండిని ప్రపంచ వ్యాప్తంగా చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఉత్తర భారతదేశం లో ఎక్కువగా పండించడమే కాకుండా, గోధుమ పిండితో చేసిన రొట్టెలు (చపాతీలు) వారి ప్రధాన ఆహరం. గోధుమలను పులియబెట్టడం ద్వారా బీరు, వోడ్కా, ఆల్కహాలు మొదలైన వాటిలో ఉపయోగిస్తున్నారు. మైదా కంటే గోధుమలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గోధుమలు, గోధుమ గండి, గోధుమ రసం, గోధుమ పిండిలోని అనేక ఆరోగ్యప్రయోజనాల గురించి చాలా మంది తెలుసు. కొంత మందికి దానిలోని నిజమైన ప్రయోజనాలు తెలియకపోయినా గోధుమలును వినిగిస్తుంటారు మరియు గోధుమలు ఎందుకు ఆరోగ్యకరం అని నిజమైన కారణాన్ని తెలుసుకోరు. అందువల్ల, గోధుమలతో తయారుచేసే రోటీలు మరియు గోధుమలతో తయారుచేసే ఇతర ఉత్పత్తులను ఎందుకు తీసుకోవాలో బోల్డ్ స్కై ఇక్కడ కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటోంది.
నిపుణుల ఆరోగ్యం ప్రకారం, గోధుమల యొక్క ఆరోగ్యప్రయోజనాలు, మైదాలో కంటే ఎక్కువగా ఉంటాయి. మైదాతో పోల్చినప్పుడు గోధుమలతో తయారుచేసే ఆహారపదార్థాలు చాలా తేలికగా జీర్ణం అవుతాయి. ఇంతకు ముందు గోధుమలతో తయారుచేసే ఆహారపదార్థాలను వయస్సు పైబడేవారు మాత్రమే తీసుకుంటుండేవారు. కానీ, గోధుమలలోని అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకొన్నాక, ఇప్పుడు యవ్వనంలో ఉండే వారు కూడా గోధుమలను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
గోధుమలు, గోధుమలతో తయారుచేసే ఉత్పత్తుల యొక్క ఆరోగ్యప్రయోజనాలను ఇక్కడ క్రింది విధంగా ఇస్తున్నాం. వాటిని పరిశీలించి. ఇప్పటి వరకూ మీరు మైదాతో తయారుచేసిన ఆహారాలను తింటే,వాటిని చెక్ పెట్టి, మైదాకు బదులు గోధుమలకు అధిక ప్రాదాన్యం ఇవ్వండి. దాంతో అధికంగా ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు...
గోధుమలతో పొందే ఆరోగ్యప్రయోజనాలు:

రక్తాన్ని శుధ్ది చేస్తుంది:
రక్తం శుద్ది చేసుకోవడానికి ఒక ఉత్తమ మార్గం, మీ రెగ్యులర్ డైట్ లో గోధుమలను చేర్చుకోవడం. మీ రెగ్యులర్ డైట్లో గోధులతో తయారుచేసి ఆహారపదార్థాలను చేర్చుకోవడం వల్ల రక్తంను శుధ్ది చేస్తుంది. మరియు గోధుమరసం త్రాగడం వల్ల ఎర్ర రక్త కణా లు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, ఫోలిక ఆసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండి ఎర్ర రక్తకణాల పెరుగుదలకు దోహ దం చేస్తాయి.

బరువు తగ్గిస్తుంది :
ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో, వారు మైదాకు చెక్ పెట్టి, గోధుమలకు ఎక్కువ ప్రాధాన్య ఇవ్వండి. గోధుమలతో తయారుచేసిన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాలరీలను తగ్గిస్తుంది మరియు కంట్రోల్ ఉంచి, క్రమంగా బరువు తగ్గడానికి సహాయపబుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
వయస్సు మీద పడే వారు, మైదా కంటే గోధుమలకు ఎందుకంత ప్రాధాన్యత కల్పిస్తారు అంటే, అందుకు ప్రధాన కారణం, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చాలా తేలికగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది.

గుండె సంబధిత వ్యాధులు:
ఎవరైతే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారో, వారు గోధుమలతో తయారుచేసిన రోటిలీలు మరియు ఇతర ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల గుండెను బలోపేతం చేస్తుంది.

క్యాన్సర్ నివారిణి:
గోధుమల్లో ప్రాణాంతకమైన క్యాన్సర్ నివారిణిలుగా సహాయపడే విటమిన్ ఇ, సెలీనియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయన్న విషయం మీకు తెలుసా?

బ్లడ్ ప్రెజర్ కు చాలా మంచిది:
అధిక బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నప్పుడు, మైదా రోటీలకు చెక్ పెట్టి, గోధుమపిండితో తయారుచేసే రోటీలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇది శరీరంలో హైపర్ టెన్షన్ కు కారణం అయ్యే వాటిని మన శరీరంలో తగ్గించి బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

థైరాయిడ్ పేషంట్స్:
ప్రస్తుత కాలంలో చాలా మంది హైపో మరియు హైపర్ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. వారిలో మీరు ఒక్కరైతే మీ రెగ్యులర్ డైట్ లో గోధుమలతో తయారుచేసే ఆహారాలను చేర్చుకోవడం ఒక ఉత్తమ మార్గం.

చెడు శ్వాస:
చెడు శ్వాసకు ఒక ప్రధాన కారణం, మనం తీసుకొనే ఆహారమే. గోధుమలతో తయారుచేసే ఆహారాలను తీసుకోవడం వల్ల చెడు శ్వాసను దూరం చేసే కొన్నిప్రత్యేకమైన విటమిన్స్ ఇది విడుదల చేయడం వల్ల ఫోయల్ బ్రీత్ ను నివారిస్తుంది.

ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది:
బోన్ ఇన్ఫ్లమేషన్ తో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. ఈ సమస్యను నివారించడానికి ఉత్తమమైన మార్గం గోధుమలతో తయారుచేసిన రోటీ లేదా వీట్ బ్రెడ్ లను తీసుకోవాలి . వీటని మీ డైలీ డైట్ లో చేర్చుకొని, ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి, సమస్యను నివారించాలి.

మధుమేహగ్రస్తులకు:
షుగర్ పేషంట్స్ వారు తీసుకొనే ఆహారం మీద జాగ్రత్త వహించాలి. వారిలో ఇన్సులిన్ స్థాయిలను ట్రాక్ చేయడానికి, మరియు ఇన్సులిన్ స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి గోధుమలను వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం.

మలబద్దకాన్ని నివారిస్తుంది:
మీరు మలబద్దక సమస్యతో బాధపడుతున్నట్లైతే, మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన ఆహారాల్లో గోధుమలు ఒక ఉత్తమ ఆహారం. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు ఇది ఉదర సమస్యలకు చాలా మేలు చేస్తుంది.

కిడ్నీ సమస్యలు:
30ఏళ్ళ తర్వాత చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు. ముంగా కిడ్నీలో రాళ్ళు నివారించడానికి గోధుమలు ఒక ఉత్తమైన ఆహార ఎంపిక. ఇది కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది.

రక్తహీనత:
ఎర్రరక్తకణాలను పెంచుకోవడానికి గోధుమలు అద్భుతంగా సహాయపడుతాయి. ఇది శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ పెంచడానికి బాగా సహాయపడతాయి.

ప్రోటీనులు అధికం:
గోధుమలలో ఉన్న ఆరోగ్యకరమైన ప్రోటీలను మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందువల్ల, గోధుమలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఉత్తమంగా భావించండి.



Click it and Unblock the Notifications











