Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
కడుపులో మంటను తగ్గించే బెస్ట్ హోం రెమెడీస్
సాధారణంగా చాలా మంది స్టొమక్ హీట్ తో బాధపడుతుంటారు. ఈ స్టొమక్ హీట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని డీల్ చేయాలంటే కూడా చాలా కష్టం ఉంటుంది. కడుపులో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మీరు భోజనం చేయడానికి కూడా కుదరు. కాబట్టి , స్టొమక్ హీట్ కు కారణం ఏమిటి? కడుపులో మంటకు, హీట్ కలగడానికి ఎక్కువగా కారం తినడం అనేది ప్రధాన కారణం కావచ్చు. ఇంకా స్టొమక్ హీట్ సిగరెట్లు, ఆల్కహాల్, మరియు వేడి పదార్థాలు తినడం వల్ల కూడా జరగుతుంది. స్టొమక్ హీట్ వల్ల కడుపు మంటకు దారితీస్తుంది. స్టొమక్ హీట్ ను తగ్గించుకోకపోతే అప్పుడు స్టొమక్ బర్నకు కారణం అవుతుంది.
చల్లని పానియాలు తీసుకోవడం వల్ల స్టొమక్ హీట్ తగ్గించుకోవడానికి ఒక ఉత్తమ మార్గం మరియు ఇది స్టొమక్ బర్నింగ్ ను తగ్గిస్తుంది. స్టొమక్ హీట్ ను తగ్గించే బెస్ట్ హోం రెమడీ నీళ్లు. కాబట్టి , నీళ్ళు ఎక్కువగా త్రాగడం వల్ల స్టొమక్ హీట్ ను నివారించవచ్చు. అలాగే, చల్లని పాలు మరియు పెరుగు తినడం వల్ల కూడా స్టొమక్ హీట్ ను నివారించవచ్చు మరియు జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. అలాగే తాజాగే ఉండే ఫ్రూట్ జ్యూస్ ను త్రాగడం వల్ల కూడా స్టొమక్ హీట్ ను తగ్గించుకోవచ్చు.
స్టొమక్ హీట్ ను తగ్గించే మరో బెస్ట్ హోం రెమెడీ కొబ్బరి నీళ్ళు. కొబ్బరినీళ్ళు స్టొమక్ హీట్ ను తగ్గించడంతో పాటు కడుపు మంటను చల్లార్చుతుంది మరియు కొంత చల్లదనాన్ని కలిగిస్తుంది . అయితే, కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు, మరియు వేడి పదార్థాలను నివారించండం బెస్ట్ హోం రెమెడీ. ఇవి కడుపు మంటను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఎక్కువ మసాలా దినుసులను తినకండి మరియు కాఫీ మరియు కేఫినేటెడ్ బెవరేజస్ ను తగ్గించాలి .
కాబట్టి స్టొమక్ హీట్ ను తగ్గించి మరియు కడుపు మంటను నివారించే కొన్ని బెస్ట్ హోం రెమెడీస్ కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. అరటి పండ్లు:
కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం కలిగించేది అరటి పండ్లు, ఇది కడుపులో ఆసిడ్స్ ను నివారిస్తుంది మరియు స్మూతింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది.

2. బాదం:
స్టొమక్ హీట్ ను తగ్గించే ఒక ట్రెడిషన్ హోం రెమెడీ ఇది. బాదాములను నీటిలో వేసి, రాత్రంతా నానబెట్టాలి . తర్వాత మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా పచ్చిపాలతో పాటు వీటిని తీసుకోవాలి.

3. పచ్చిపాలు:
స్టొమక్ హీట్ తగ్గించడానికి పచ్చిపాలు అద్భుతంగా సహాయపడుతాయి . కడుపు మంటను చల్లార్చడానికి ఇది స్మూత్ మరియు చల్లగా ఉంచుతుంది.

4. అన్నం :
అన్నం కడుపు మంటను నివారిస్తుంది మరియు శరీరంలో నీటిశాతాన్ని పెంచతుంది. ఎటువంటి మసాలా దీనుసులు జోడించకుండా అన్నం తీసుకొన్నట్లైతే కడుపు మంటను నివారించుకోవచ్చు . ఇంకా మీరు పెరుగు అన్నం తీసుకుంటే మరింత బెస్ట్ గా ఉంటుంది.

5. క్యాబేజ్ జ్యూస్:
క్యాబేజ్ అలాగే క్యాబేజ్ జ్యూస్ కడుపు మంటను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. క్యాబేజ్ రసం బరువుతగ్గించే పదార్థం మాత్రమే కాదు, ఇది స్టొమక్ హీట్ ను కూడా అద్భుతంగా తగ్గిస్తుంది.

6. కీరదోసకాయ:
కీరదోసకాయలో 95శాతం నీటిశాతం అధికంగా ఉండటం వల్ల కీరదోసను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కడుపు మంటను నేచురల్ గా తగ్గిస్తుంది.

7. అవొకాడో:
అవొకాడో చాలా సులభంగా జీర్ణం అవుతుంది మరియు స్టొమక్ బర్న్ ను చాలా తేలికగా తగ్గిస్తుంది . అందుకే పచ్చిఅవొకాడో లేదా జ్యూస్ రూపంలో దీన్ని తీసుకొని, స్టొమక్ హీట్ ను నివారించండి.

8. పెరుగు:
పెరుగు ఒక బెస్ట్ హోం రెమడీ. ఇది స్టొమక్ హీట్ తగ్గిస్తుంది మరియు కడుపు మంటను నివారిస్తుంది. మీరు పెరుగును అలాగే తినవచ్చు లేదా బాగా గిలకొట్టి అందులో పంచదార లేదా నీళ్ళు కలిపి తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications
