Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
ఈ చిట్కాలు మద్యం తీసుకోకూడదను అనుకునే వారికి మాత్రమే...!
మద్యం అధిక మొత్తాల్లో తీసుకునే వారిలో ముందుగా ఎటువంటి వ్యాధి లక్షణాలు బహిర్గతం కాకుండా నెమ్మదిగా కాలేయం దెబ్బ తింటుంది. ఈ స్థితిని లివర్ సిర్రోసిస్ అంటారు. ఈ సమస్యలో అధికశాతం వ్యాధి లక్షణాలు చాలా మెల్లగా మొదలవుతాయి. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆల్కహాల్ ప్రతిరోజూ తీసుకోవడం వలన ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఆకలి లేకపోవడం, పౌష్టికాహార లోపాల వలన మనిషి బరువు తగ్గడం, ముఖ్యంగా కండరాలు క్షీణించడం జరుగుతాయి.
మనిషి ఎక్కువగా నీరసించి అలసిపోవడంతో పాటు చర్మంపై ఎర్రని మచ్చలు వస్తాయి. దానిని ఈజిబ్రుయిజింగ్ అంటారు. క్రమంగా రోగిలోని కాలేయ కణాలు సక్రమంగా పని చేయకపోవడం, పోర్టల్ హైపర్ టెన్షన్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ స్థితిలో జాండిస్ తీవ్రత పెరగడం, ఆహార నాళాలనుంచి పెరిగిన ఇసోఫేజియల్ వారి సెస్‌నుండి రక్తస్రావం కావడం, పొట్టలో నీరు చేరడం, మెదడు మందగించి ఎన్‌సెఫలోపతి అనే పరిస్థితిలోకి రోగిలోనుకావడం జరుగుతుంది.
మీరు ఈ పేజీని చదువుతున్నారా! అంటే మీరు త్రాగుడును వదిలేయాలనుకుంటున్నారని అర్థం. అది చాలా శుభసూచకం. అంతగా శుభసూచకం కాని విషయం ఏమిటంటే దీనిని వదిలించుకోవటం అంత సులభం కాదు. ఇది పచ్చి నిజం. చాలా బాధాకరం మరియు దీనికి ఎవరు కూడా కాదనలేరు. మంచి వార్త ఏమిటంటే దీనిని వదిలివేయాలి అనుకునేవారికి వైద్య సాంకేతిక పరిజ్ఞానం, సమీకృత సంఘాలు మరియు సమర్థవంతమైన మానసిక కౌన్సిలింగ్ దోహదం చేస్తున్నాయి.
మీరు త్రాగుడుకి బానిస అయ్యారనుకుంటే, దానిని నిగ్రహించుకోవడంవలన చాలా లాభాలు ఉన్నాయి; స్ట్రోకులను నివారించడం,బరువు కోల్పోవడం, కాలేయ వ్యాధి వొచ్చే అవకాశం తగ్గించడం వంటివి కొన్నిఆరోగ్యానికి లాభాన్ని చేకూరుస్తాయి. మీరు త్రాగుడు మానేయాలనుకుంటే, ఇక్కడ కొన్ని చిట్కాలు మరియు విధానాలు పొందుపరుస్తున్నాము.
మద్యపానము మానటం ఎలా?

మీరు డాక్టర్ ను సంప్రదించండి: మీరు ఒంటరిగానే దీనినుండి బయటపడే మార్గాన్ని ఎంచుకుంటే, ఒకటి గుర్తుంచుకోండి త్రాగుడు మానటం ప్రాణాపాయమని. మీరు తీవ్రంగా దీని నివారణ గుర్తులతో (విపరీతంగా భయాందోళన ముట్టడులు, తీవ్రమైన ఆందోళన, వణుకు, వేగంగా గుండె కొట్టుకోవటం) బాధపడుతూ ఉంటే, వెంటనే వైద్య సహాయాన్ని తీసుకోండి.

త్రాగుడు మానడం గురించి మీ అభిప్రాయాన్ని మార్చుకోండి: గుర్తుంచుకోండి, మీ ప్రాణస్నేహితుడిని వదిలించుకోమని ఎవరూ మిమ్మలిని బలవంతం చేయటంలేదు. మీ శత్రువునుండి మిమ్మలిని మీరు కాపాడుకోండి. మీరు మీ అభిప్రాయాన్ని సరిచేసుకుంటే త్రాగుడు మానటం సులభం. మీలోని బెటర్ హాఫ్ మిమ్మలిని ఈ అలవాటునుండి బయటపడమంటాడు; మీ స్వార్థపూరిత సగం మిమ్మలిని అదే విధంగా ఉండమంటాడు.

తేదీని ఫిక్స్ చేసుకోండి: ఈ అలవాటునుండి బయటపడేందుకు ఒక ముఖ్యమైన తేదీని ఎంచుకోండి. సహేతుకమైన కోరిక కలిగి ఉండండి. మీరు చాలా తీవ్రంగా త్రాగేవారు అయితే, మీరు మొదట్లో కొద్దికొద్దిగా తగ్గించుకుంటూ వెళ్ళాలి (ఇటువంటి సందర్భాలలో మీరు మీ డాక్టర్ సహాయంతో మీరు ఈ అలవాటు నుండి బయటపడే తేదీని నిర్ణయించుకోవటం మంచిది).

మద్యం బాటిల్స్: అన్నిఆల్కహాల్ బాటిల్స్, కానులను, దీనికి సంబంధించినవి ఏవైనా బయట పడేయండి. ఎవరైనా అతిథులు వొస్తే వారికి మర్యాదపూర్వకంగా బీర్, వైన్ లేదా కాక్టెయిల్ వంటివి మాత్రమే ఇవ్వాలని అనుకోవొద్దు. వారికి టీ, నిమ్మరసం, కోక్ లేదా వేరేది ఏదైనా ఇచ్చి మర్యాద చేయవొచ్చు.

మద్యం తీసుకొనే పరిమానం: ప్రారంభ దశలో, మద్యం తీసుకొనే పరిమాణాన్ని తగ్గించి తీసుకోండి. ఒక్క వారంలో మీ అలవాటును మానేయాలని అనుకోవొద్దు. మీరు తీసుకునే ఆల్కహాల్ పరిమాణాన్ని ప్రతిరోజూ కొద్దికొద్దిగా తగ్గిస్తూ తీసుకోండి. ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోవటంవలన వాంతులు చేసుకోవటం మరియు భయంకరమైన తలనొప్పులు రావటం మొదలైన లక్షణాలను ఊహించుకోండి. ఈ రకంగా ఆల్కహాల్ తీసుకునే ముందు వాటిని గుర్తుచేసుకోవటం వలన ఈ అలవాటును క్రమంగా తగ్గించుకోవొచ్చు.

మీరు త్రాగేముందు ఆహారం తీసుకోండి: ఇలా తినటంవలన మీకు త్రాగాలనే కోరిక తగ్గుతుంది.త్రాగటం కూడా కష్టమవుతుంది. మీరు ఇలా చేసినట్లయితే, మీరు తీసుకునే ఆల్కహాల్ పరిమాణం తగ్గుతుంది. ఇలా చేయటం తెలివిగల పనే అయినా, దీనిని ఒకరకంగా శరీరాన్ని మోసం చేయటం!

రిలేషన్ షిప్: మీరు క్రమంతప్పని త్రాగుబోతు అయినట్లయితే, మీ దినచర్యను మార్చుకోండి. మీరు పని గంటల తరువాత కాని మరియు ఇంటికి వెళ్ళినతరువాత కాని, త్రాగుడు అలవాటు ఉన్నట్లయితే, ఆ సమయంలో మీ తల్లితండ్రులతో గడపడం కాని లేదా స్నేహితులతో గడపటం కాని అలవాటు చేసుకోండి.

విటమిన్ సప్లిమెంట్స్: ఆల్కహాల్ మానేసిన మొదటి వారంలో రోజూ 'బి' విటమిన్ సప్లిమెంట్ తీసుకోండి. ఆల్కహాల్, మీ శరీరం ఈ విటమిన్లు స్వీకరించే సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది. ప్రత్యేకంగా 'తియామిన్ డెఫిషియన్సి', తీవ్రమైన సామర్ధ్య అసమానతకు,వెర్నిస్కే- కోర్సకోఫ్ఫ్ సిండ్రోమ్ లేదా వెట్ బ్రెయిన్ కు కారణం కావొచ్చు.

బహుమతులు: మీకు మీరు బహుమతులను ప్రతి రోజూ లేదా ప్రతి గంట ఇచ్చుకోండి ఎందుకంటే మీరు త్రాగకుండా ఉన్న సమయం కాబట్టి. ఇలా చేయటం ప్రారంభ దశలో అనుకున్నదానికంటే చాలా తేడాగా ఉంటుంది. మీ బహుమతులను చుట్టి, మీ స్నేహితుడికి కాని, మీ కుటుంబ సభ్యుడికి కాని మీకు ఎవరు వాటిని సురక్షితంగా ఉంచుతారని నమ్ముతారో వారికి ఇవ్వండి. మీరు నిగ్రహంగా ఆల్కహాల్ ముట్టుకోకుండా అది గంట కానీ,రోజు కానీ, వారం కానీ మీ స్నేహితుడితో పరిశీలించి మీరు ఇప్పటివరకు ఉన్న స్థితిని సరిదిద్దుకోండి.

మీరు త్రాగడానికి ఇష్టపడే వ్యక్తులతో కాని లేదా అటువంటి పరిస్థితిని కాని కల్పించుకోవొద్దు. ఒక పాత సామెతను 'ప్లే గ్రౌండ్స్ అండ్ ప్లేమేట్స్' గుర్తు చేసుకోండి. పాత త్రాగుబోతు స్నేహితులను వదిలేయాలి. మీరు 5 గ్లాసులు త్రాగితే,మీతో కలిసి త్రాగే స్నేహితులు అప్పుడప్పుడు రెండు గ్లాసుల బీర్ కాని, వైన్ కాని త్రాగేవాళ్ళు అని గుర్తుంచుకోండి.



Click it and Unblock the Notifications











