Latest Updates
-
బంగాళదుంపతో ఇలా దోశ వేస్తే రుచికి ఫిదా అవ్వాల్సిందే.. తయారీ విధానం ఇదే.. -
మీ జీర్ణవ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందనడానికి 10 సంకేతాలివే -
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు
కొన్ని రహస్యాలు డాక్టర్ వద్ద దాచడం అసాధ్యం..!
వైద్యుడితో మీరు పారదర్శకంగా ఉండడం వలన మీకు సరైన చికిత్స చేయడానికి ఖచ్చితంగా సాధ్యపడుతుంది. మీరు వైద్యుడి దగ్గర దాచకుండా ఉంచవలసిన కొన్ని కీలకమైన అంశాలను ఈ వ్యాసం ద్వారా చదివి తెలుసుకోండి.

మితిమీరిన చెడు అలవాట్లు: మీరు మీరు తీసుకునే ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల అలవాట్ల గురించి మీ వైద్యునితో వాస్తవాలను పంచుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి, మీరు మీ గురించిన కొన్ని కఠిన అలవాట్లను వైద్యుడికి తెలియచేయకపోతే అతను మీకు సరైన చికిత్స చేయడం సాధ్య పడదు.

గత శస్త్రచికిత్సలు: గతంలో మీకు జరిగిన శస్త్రచికిత్సల వివరాల గురించి ప్రస్తుత వైద్యునికి తెలియచేయడం అత్యంత ముఖ్యమైన విషయం. ఇటువంటి సమాచారం ఇవ్వడంవల్ల మీరు బాధపడుతున్న సమస్యలకు మరింత మెరుగైన చికిత్స చేయడానికి అవసరమైన నిర్ణయం తీసుకోబడుతుంది.

ఆహారపు అలవాట్లు: ఎవరైతే ఆరోగ్యకరమైన ఆహరం తీసుకొనరో లేదా అదనపు పౌండ్ల ను ఇచ్చే ఆహారానికి దూరంగా ఉండరో వారు ఈ చిన్న సమాచారాన్ని వైద్యునికి తెలియచేయడం ఎంతో అవసరం. అనేక సందర్భాలలో, కొంతమంది తమ ఆహారపు అలవాట్ల వల్ల కూడా రోగంతో బాధపడతారు.

వత్తిడి (స్ట్రెస్): చాలా సార్లు, ఒక వ్యక్తి అంటే అతడు లేదా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే, వారు ఆ భావనను మనసులోనుండి తొలగించాలి లేదా మనసులో దాచుకోవాలి. అయితే, ఒత్తిడి అనేక ఆరోగ్య సమస్యలకు మూలకారణం కావచ్చు, కావున దానిని వెంటనే మీ వైద్యునికి తెలియచేయడం ముఖ్యం.

మందుల వాడకం: మీరు వైద్యుడిని సంప్రదించి ఆయన చికిత్స చేసి ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం అత్యంత ప్రధాన విషయం. అయితే మీ చికిత్సను గుర్తించి ఇచ్చిన వాటి పేర్లు వైద్యునికి తెలుసు కనుక ఇది చాలా సిద్ధాంత పరమైనది.

అలర్జీలు: మీకు కొన్ని మందులు, ఆహరం లేదా వాతావరణంలో అంశాల వల్ల అలర్జీలు రావచ్చు. వైద్యుడు మీ చికిత్సను సూచించే మందులు ఇచ్చే ముందే, మీరు మీ వైద్యునికి ఈ అలర్జీల గురించి చెప్పడం కీలకం, అలా చేయడం వల్ల ముందుముందు వచ్చే సమస్యలను నివారించవచ్చు.

మలంలో రక్తం: మీరు తరచుగా వచ్చే మలబద్ధకం గురించి, మలంలో రక్తం గురించి చెప్పకపోతే మీ పొట్ట దెబ్బతింటుంది. మీరు రక్తాన్ని గుర్తించి మీ డాక్టర్ కి చెప్పడం అవసరం, ఎందుకంటే అది ప్రారంభ దశలో చికిత్స కు యోగ్యమైన కోలోరేక్తర్ కాన్సర్ గా సూచించబడుతుంది. మీరు బాధపడుతున్న ఆరోగ్య సమస్యల ను తెలియచేసినట్లయితే, భవిష్యత్తులో మీకు వచ్చే ఆరోగ్య సమయాల నుండి మిమ్మల్ని మీరు రక్షించు కోవచ్చు. భయపడకండి, మీరు మీ వైద్యునికి పూర్తి సమాచారాన్ని అందించడం ఎల్లవేళలా ఉత్తమం.



Click it and Unblock the Notifications
