Latest Updates
-
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే!
ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే సూపర్ ఫుడ్స్
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. నిద్రలేమి, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, పార్టీ కల్చర్స్, ఒత్తిడి వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. ఈ రోజులలో ఒత్తిడి అనే మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తోంది. ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లను కూడా ఒక దశకు వచ్చే సరికి నియంత్రణ చేయాలి.. చిన్నప్పుడు ఇష్టంగా తిన్నామని... పెద్దయ్యాక కూడా వాటిని అదేలా తింటామంటే కుదరదు. ముఖ్యంగా ఆడవారి విషయంలో సమతుల ఆహారం తీసుకోవాలి. ఎక్కువశాతం ఒత్తిడికి గురయ్యే విషయంలో పురుషుల కన్నా మహిళలే ముందు వరుసలో ఉంటున్నారని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది.
ఇలా మద్యలో వచ్చే అనేక రకాలా అనారోగ్యసమస్యలను ఎదుర్కోవాలంటే , వాటిని ముఖ్య కారణాలు కనుగొని జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. మీరు తీసుకొనే ఆహారం,మీరు అనుకొన్నదాని కంటే చాలా గొప్పగా ప్రభావం చూపెడుతాయి అన్న విషయం మీకు తెలుసా?ఇక్కడ కొన్ని ఆహారాలను లిస్ట్ చేయబడి ఇస్తున్నాం.
ఈ సూపర్ ఫుడ్స్ మీరు తీసుకోవడం వల్ల ప్రశాంతమైన మనస్సు మరియు ఒత్తిడి తగ్గించుకోవడానికి సహాయపడుతాయి.

ఒత్తిడి తగ్గించే సూపర్ ఫుడ్స్
పాలు: ఆశ్యర్యపోయారా మళ్ళీ? ఎందుకంటే, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి అవసరం అయ్యే సెరోటోనిన్ యొక్క ఏర్పటుకు పాలలోని ట్రిప్టోఫాన్ సహాయపడుతుంది. పాలలోని ల్యాక్టోస్ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి. పెరుగులోని విటమిన్ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది.

ఒత్తిడి తగ్గించే సూపర్ ఫుడ్స్
డార్క్ చాక్లెట్: చాక్లెట్స్ అంటానే ఏది పడితే అవి తినేయడం కాదు. చాక్లెట్స్ లో డార్క్ చాక్లెట్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో ఉండే anandamine అనే కంటెంట్ ద్వారా మెదడు విశ్రాంతి మరియు ఒత్తిడి లేకుండా మెదడులోని డోపమైన్ లెవల్స్ ను పెంచుతుంది.విటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్ (పిఇఎ) ఎండార్ఫిన్ స్థాయిల్ని తొలగించి సహజసి ద్దమైన యాంటీ - డిప్రెస్సెంట్‌గా పనిచేస్తుంది.

ఒత్తిడి తగ్గించే సూపర్ ఫుడ్స్
ఆరెంజ్ : వ్యాధి నిరోధక శక్తిని పెంచగలిగే ఫలాలలో కమలాఫలం కూడా ఒకటి. అత్యధికంగా కమలాల్లో లభించే సి విట మిన్ వల్ల ఒత్తిడి ఫలితంగా ప్రభావం చూపే హార్మోన్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది.

ఒత్తిడి తగ్గించే సూపర్ ఫుడ్స్
బాదం: బాదంలో ఉండే అద్బుతమైన జింక్ ఖనిజం మరియు విటమిన్ బి12 వల్ల ఈ స్ట్రెస్ రిలీఫ్ జాబితాలో చేర్చబడింది. ఈ పోషకాలు మీ మనస్సు సమతుల్యస్థితి నిర్వహించడానికి మరియు ఆందోళను దరంగా ఉంచడానికి సహాయడపతుంది.

ఒత్తిడి తగ్గించే సూపర్ ఫుడ్స్
సెరల్ /కార్న్ ఫ్లేక్: సాధారణ బ్రేక్ ఫాస్ట్ సెరల్స్ లో విటమిన్ డి అంత ఎక్కువగా ఉండదు. అయితే, స్పెషల్ సెరల్స్ ఫోర్టిఫైడ్ సెరల్స్ లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇవి ఇంకా విటమిన్ డి తో పాటు అధికంగా ఫైబర్ అధిస్తుంది. లోకొలెస్ట్రాల్ లెవల్స్ ను కలిగి ఉంటుంది. ఇవి అన్నీ ఒత్తిడి తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

ఒత్తిడి తగ్గించే సూపర్ ఫుడ్స్
బ్లూ బెర్రీస్: బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతే కాదు ఇందులో ఉన్న విటమిన్ సి ఒత్తిడితో పోరాడే ఔషధ గుణాలు అధికంగా ఉన్నందు వల్ల, ఒత్తిడిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తంలోని షుగర్ లెవన్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

ఒత్తిడి తగ్గించే సూపర్ ఫుడ్స్
గ్రీన్ లీఫ్స్: ఆకుకరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దాంతో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచే మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. సరైన విటమిన్లు విటమిన్ ఎ మరియు విటమిన్ సి అదే విధంగా విటమిన్ సి కూడాఆరోగ్యకరమై ఆహారం తీసుకొనేలా చేస్తుంది.

ఒత్తిడి తగ్గించే సూపర్ ఫుడ్స్
ఫిష్: చేపల్లో సాల్మన్ మరియు మేకరెల్ రకాల చేపల్లో ఒమేగా 3ఫయాటీఆసిడ్స్ పుష్కలంగా ఉండి , బ్రెయిన్ కు అవసరం అయ్యే సెలీనియం మరియు ట్రిప్టోఫాన్ ను అంధించడం వల్ల బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది .

ఒత్తిడి తగ్గించే సూపర్ ఫుడ్స్
ఒత్తిడిని తగ్గించుకోవడానికి మార్గాలను తెలుసుకోవడం చాలా హెల్ప్ ఫుల్ అవుతుంది. మీరు డైట్ ప్లాన్ ఫాలో అవుతుంటే, మీరు ఇప్పటికే సూపర్ ఫుడ్స్ ను తీసుకుంటుంటే, అప్పుడు మీరు ఒత్తిడి తగ్గించుకోవడంలో బెస్ట్ అని తెలుసుకోవచ్చు. లేదంటే, ఒత్తిడి తగ్గించుకోవడం కోసం ఈరోజు నుండినే సూపర్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications