Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఇటు అనారోగ్యాన్ని... అటు నిద్రాభంగిమను కలిగించే 10 ఆహారాలు..
ప్రస్తుత యాంత్రిక జీవనంలో చాలా మందికి మంచి నిద్ర అన్నదే గగనమైపోతున్నది. తగినంత నిద్రలేకుంటే మానసిక, శారీరక సమస్యలు తప్పవు. నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలు తప్పవు. నిద్రలేమి చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎంత బిజీ జీవితమైన నిద్ర కోసం కొన్ని గంటలు కేటాయించకపోతే మానసిక ప్రశాంతత దూరమవుతుంది. అనేక వ్యాధులు దరిచేరే ప్రమాదం ఉంది.
మానసిక ఒత్తిళ్ళు నిద్రకు శత్రువులు. అనవసర ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు నిద్రాదేవిని దూరం చేస్తాయి. సానుకూల దృక్పథం, సర్దుబాటు తత్వం అలవరచుకుంటే మనలో ప్రశాంతత ఏర్పడుతుంది. నిద్ర సరిగా రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిలో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి గురయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు లేదా భారీకాయం వంటి అంశాల వల్ల సరిగ్గా నిద్రపట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఇటు వంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలి. ఇటువంటి సమస్యలకు విరుగుడు సాయంత్రం వేళలో చేసే వ్యాయామం. నడక లేదా యోగాసనాలు వంటివి వేయటం వల్ల సులభంగా నిద్రపోగలుగుతారు. పడుకునే ముందు దీర్ఘం గా గాలి పీల్చి వదలటం వల్ల శరీరం తేలికపడుతుంది. నిద్రలోకి తీసుకుని వెళ్ళే మార్గాలలో అది ఒకటి మాత్రమే. చక్కని సంగీతం వింటూ నిద్రలోకి జారుకోవటం చాలా సులభం.
మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. కొవ్వు పదార్ధాలు, మసాలా దినుసులు తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది. రాత్రివేళ భోజ నం మితంగా తినాలి. పొద్దున పూట కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు కానీ రాత్రి పూట మాత్రం కడుపులో కొంచెం ఖాళీ ఉండగానే కంచం ముందు నుంచి లేవటం మంచిది. పడుకో బోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగితే నిద్ర హాయిగా పడుతుంది. కాబట్టి ఇటు మంచి నిద్ర కోసం.. అటు ఆరోగ్యానికి... నిద్రించే ముందు తీసుకోకూడని కొన్ని ఆహారాలు మీకోసం...

ఐస్ క్రీమ్: గ్రీసీ ఫుడ్స్, అంటే క్రీమ్(ఐస్ క్రీమ్స్), ఆయిల్, ఫ్యాట్ ఫుడ్స్, రాత్రి సమయంలో తినడం మానేయాలి. వీటిని రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల మిమ్మల్ని అలసటకు గురిచేయడమే కాకుండా మరుసటి రోజు ఉదయానికి బద్దకస్తులుగా మార్చుతుంది. కడుపులో వీటివల్ల వికారం ఏర్పడి, విరేచనాలకు దారితీస్తుంది. బరువు పెరగడానికి దారితీసి ఆ ఫ్యాట్ ఫుడ్ ను నిద్రకు ముందు తీసుకోకపోవడం చాలా మంచిది.

షుగర్ స్వీట్స్/మిఠాయి: షుగర్ స్వీట్స్ లో హైకార్బొహైడ్రేట్స్ కాబడి ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపు ఫుల్ గా అనిపించక చాలా తింటారు. చాక్లెట్స్, కేక్స్ తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దాంతో శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దాంతో నిద్రాభంగిమ కలుగుతుంది. కాబట్టి కేక్, కుక్కీస్, ఇతర డిసర్ట్స్ కు దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం.

వెల్లుల్లి: వెల్లుల్లిలో సల్ఫర్ నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల దీనిలో వాసన కూడా చాలా ఘాటుగా ఉంటుంది. ఇలాంటి ఘాటైన మసాల దినుసులు, వెల్లుల్లి రాత్రి సమయంలో తినడం వల్ల శరీరంలో వేడి పుట్టి రక్తంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ నిదానంగా జరిగి తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకొని గాస్ట్రిక్ కు దారితీస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో వెల్లుల్లికి దూరంగా ఉండటమే మంచిది.

రెడ్ మీట్: రాత్రి సమయంలో మాంసాహారాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. అయితే పూర్తిగా నిలిపివేయడం కంటే ఈ ప్రోటీన్ ఫుడ్ ను తగిన మోతదాలో తీసుకోవడం మంచిది. అది కూడా లేట్ నైట్ కాకుండా త్వరగా తీసుకొంటే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం తీసుకొన్న తర్వాత వేడి నీళ్ళు లేదా వేడి పాలను త్రాగి నిద్రించడం వల్ల అటు జీర్ణశక్తికి ఇటు మీ గాఢ నిద్రకు ఎటువంటి భంగం కలగదు.

మద్యపానం: చాలా మంది రాత్రి సమయంలో మద్యపానం సేవించడం వల్ల మంచి నిద్ర పడుతుందనుకుంటారు కానీ అది తప్పు. మద్యం నిద్రకు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండి, ఎక్కువ సార్లు రెస్ట్ రూమ్ కు పోయేలా చేసి నిద్రకు భంగం కలిగిస్తుంది. అతిగా మద్యపానం, నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి నిద్రించే ముందు మితంగా తీసుకోవడం మంచిది.

కేక్స్: అతి పెద్ద బెల్లీ ఫ్యాట్ ఉన్నా కూడా మీకు అసౌకర్యంగా ఉంటుంది. దాంతో నిద్రపోవడానికి కష్టం అవుతుంది. నిద్ర సమయంలో జీర్ణవ్యవస్థ నిదానంగా జీవక్రియలు జరిగి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నిద్రపోవడానికి ముందు ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉంటు మితంగా తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇటువంటివి తినాలకున్నప్పుడు నిద్రించే నాలుగు గంటల మందు తినడం శ్రేయస్కరం.

స్పైసీ ఫుడ్: స్పైసీఫుడ్స్ అతి కారంగా ఉన్న ఆహారాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు, కారంగా ఉన్న సాస్ ఫుడ్స్, కారంగా ఉన్న పెప్పర్ ఫుడ్ తినడం వల్ల కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. ఈ నిరుపయోగకరమైన ఆహారాలను రాత్రి నిద్రించే ముందు తినకపోవడం వల్ల మీకు మంచి నిద్ర పట్టవచ్చు. కావట్టి ఎక్కువ కారం ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి.

పిజ్జా: నిద్రకు ఉపక్రమించే ముందు ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్ వంటివి తినడం వల్ల జీర్ణవ్యవస్థ మందగించి జీర్ణం కావడం చాలా కష్టంగా మారి నిద్ర సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి నిద్రకు ముందు వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.

పాస్తా: ఫాస్ట్ ఫుడ్ సంబంధించిన పాస్తా పిండితో కూడినటువంటి ఆహారం. ఒక రకమైనటువంటి నిశితమైన ధాన్యంతో తయారు చేయబడిన పాస్తా తినడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకొని, నిద్రకు అంతరాయ్యం కలిగిస్తుంది. కాబట్టి నిద్రించే ముందు వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

అజ్వైన్: అజ్వైన్ ను చాలా రెస్టారెంట్లలో ప్రత్యేకమైన ఆహారాల్లో వినియోగిస్తుంటారు. కాబట్టి విందు, వినోధాల్లో పాల్గొన్నప్పుడు ఇటువంటిం వాటి తినకుండా నివారించండం మంచిది. దీని వల్ల శరీరంలో వేడి పుట్టి ఎక్కువగా నీరు తాగేలా చేస్తుంది. దాంతో నిద్రాభంగిమ కలగవచ్చు. కాబట్టి నిద్రించడానికి ముందు ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.



Click it and Unblock the Notifications











