వేసవి కాలంలో ఈ ఆహారాలను దూరం చేసుకోకండి...!

మనందరికి తెలుసు నీరును ఎందుకు అధికంగా తీసుకొంటాం అని. మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి మరియు ఆరోగ్యంగా ఉంచడానికి ఎక్కువగా నీరు త్రాగుతుంటాం. నీరును అధికంగా తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాదు. ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఇంకా శరీరంలో ఉండే మలినాలను భయటకు నెట్టివేసి శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఇంకా నీళ్ళు శరీరంలోని జీవక్రియలను క్రమబద్దం చేసి, శరీర ఉష్ణోగ్రను బ్యాలెన్స్ చేస్తుంది.

శరీరం డీహైడ్రేషన్ కు గురైతే, ఆరోగ్య పరంగా చాలా సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల మలబద్దకం, పైల్స్, కిడ్నీలో రాళ్ళు మొదలగుని. డీహైడ్రేషన్ ను అధిగంచడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలున్నాయి. కాబట్టి మీ డైలీ డైయట్ లో వాటర్ రిచ్ ఫుడ్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వల్ల ప్రతి రోజూ మీ శరీరానికి అందవల్సిన నీరు అందుతుంది. దాంతో ఇటువంటి అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.

నీరు అధిక శాతంలో ఉన్న పండ్లు, మరియు కూరగాయలు ఉన్నాయి. ఒక్క వాటర్ మాత్రమే కాదు వీటిల్లో వివిధ రకాల విటమిన్స్ మరియు ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి. వాటర్ రిచ్ ఫుడ్స్ అంటే పుచ్చకాయ, కీరదోసకాయ, ముల్లంగి, టమోటోలు, క్యారెట్ మొదలగునవి మీ డైలీ డయట్ లో చేర్చుకోవడం చాలా మంచిది. మరి వాటర్ రిచ్ ఫుడ్ ఏవేవో ఒక సారి ఈ క్రింది లిస్ట్ చూసి మీ ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు కావల్సిన నీరు పొందండి. తగినంత హైడ్రేషన్ పొందండి.

ఈ వేసవిలో ఇవి తనడం మర్చిపోకండి...!

టమోటోలు: వీటిలో విటమిన్ సి మరియు పొటాషియం, మరియు లైకొపిన్ తో పాటు 90% వాటర్ ఉంటుంది. టమోటోలు బరువు తగ్గించడాని బాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చాలా మంచిది.

ఈ వేసవిలో ఇవి తనడం మర్చిపోకండి...!

క్యారెట్: క్యారెట్ లో యాంటీఆక్సిడెంట్స్, మరియు విటమిన్స్ మరియు ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి, కేశాలకు కూడా మంచిది. ఒక గ్లాసు క్యారెట్ జ్యూసు త్రాగడం వల్ల డీహైడ్రేషన్ నుండి బయటపడటమే కాకుండా చర్మ సమస్యలను అధిగమించవచ్చు.

ఈ వేసవిలో ఇవి తనడం మర్చిపోకండి...!

రెడ్ రాడిష్(ఎర్ర ముల్లంగి): ఎర్ర ముల్లంగి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావల్సిన నీటి నింపుతుంది. ఇంకా ఇది సులభంగా జీర్ణం అవుతుంది. కడుపు నిండుగా ఉండేలా చేసి ఆకలిని కలగనివ్వదు.

ఈ వేసవిలో ఇవి తనడం మర్చిపోకండి...!

కీరదోసకాయ: కీరదోసకాయ మరొక వాటర్ రిచ్ ఫుడ్. దీన్ని ప్రతి రోజూ తినడం వల్ల డీహైడ్రేషన్ తొలగిస్తుంది.

ఈ వేసవిలో ఇవి తనడం మర్చిపోకండి...!

పీచెస్: ఇందులో కూడా వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇంకా విటమిన్ ఎ, సి మరియు బీటాకెరోటిన్ వంటి పుష్కలమైన పోశకాలుంటాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

ఈ వేసవిలో ఇవి తనడం మర్చిపోకండి...!

ఆరెంజెస్: సిట్రస్ పండ్లలో కూడా వాటర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరం హైడ్రేషన్ లో ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఈ వేసవిలో ఇవి తనడం మర్చిపోకండి...!

పైనాపిల్: ఇందులో నీటితో కూడిన యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి పైనాపిల్ తరచూ తీసుకోవడం ఉత్తమం.

ఈ వేసవిలో ఇవి తనడం మర్చిపోకండి...!

పుచ్చకాయ: ఇది అత్యధిక నీటిశాతాన్ని కలిగినది. ఇవి వేసవిలో విరివిగా లభ్యం అవుతాయి. కాబట్టి ప్రతి రోజూ మీ డైయట్ లో దీన్ని తీర్చుకోవడం వల్ల శరీరానికి అందవల్సిన వాటర్ తో పాటు, విటమిన్ ఎ, బి, పొటాషియం, మరియు థైమిన్ అందిస్తుంది.

ఈ వేసవిలో ఇవి తనడం మర్చిపోకండి...!

స్టాబెర్రీ: బెర్రీస్ లో ముఖ్యంగా స్ట్రాబెర్రీ మరో వాటర్ రిచ్ ఫుడ్. అంతే కాకుండి ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలం.

ఈ వేసవిలో ఇవి తనడం మర్చిపోకండి...!

ద్రాక్ష: ఈ చిన్నని మరియు జ్యూస్ ఉన్న పండ్లలో వాటర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరం హైడ్రేషన్ పొందడం మాత్రమే కాదు, జీర్ణ సమస్యలను అధిగమిస్తుంది.

Desktop Bottom Promotion