Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి
డొపమైన్(లవ్ హార్మోన్)పెంపొందించే సహజ పద్దతలు..
డొపమైన్(dopamine)సహజంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్. ఈ హార్మోన్లు నిరంతరం మానవ శరీరంలో వివిధ భావోద్వేగాలకు ప్రతిస్పందనగా విడుదలవుతుంటాయి. మనసుకు కావలసిన ఉత్తేజాలను, ఉద్వేగాలను, ఆనందాన్ని శరీరంలో అవే కలిగిస్తాయి. అంతేకాదు, వీటితోపాటు నిరాశ, నిస్పృహలు, బాధ, కోపం, చిరాకు, ఆందోళనలు వంటి ప్రతికూల భావోద్వేగాలకు కూడా అవే కారణమవుతుంటాయి. శరీరంలోని అనేక గ్రంథులు తమ స్రావాలలో శరీరంలోని వివిధ జీవన ప్రక్రియల్లో సమత్యులత దెబ్బతినకుండా కూడా కాపాడుతుంటాయి. గ్రంథులు విడుదల చేసే హార్మోన్లన్నీ రసాయన పదార్థాల మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి, మనుషుల్లో స్త్రీ పురుషుల మీద పరస్పరం ఒకరి మీద ఒకరికి ప్రేమ, కామం వంటి భావనలు ఉత్పన్నమవడానికి ఈ హార్మోన్లు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.
మనుషులలో ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలను పెంచే హార్మోను ఇది. ఇది స్పర్శకు సంబంధించిన హార్మోను. ఎవరైనా ప్రేమతో మనల్ని స్పర్శించినప్పుడు ఈ హార్మోను విడుదలై మనలో అనుకూల భావోద్వేగాలను కలిగించి బంధాన్ని బలపరుస్తుంది. ఆక్సిటోసిన్ వల్ల మరొక మంచి పనీ జరుగుతుంది. మనుషులను ఒత్తిడి, ఆందోళనల నుంచి దూరం చేసి కుటుంబసభ్యుల మధ్య ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దాంపత్య సహజీవన అనుభూతుల్ని ఇదే మెరుగు పరుస్తుంది. లైంగికప్రక్రియలోనూ ఈ డొపమైన్ ప్రముఖపాత్ర వహిస్తుంది. ఈ డొపమైన్ (లవ్ హార్మోన్) తక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల లైంగిక శక్తి తగ్గిపోతుంది. దాంతో శరీరంలో నిరాశ, నిస్పృహలు, బాధ, కోపం, చిరాకు, ఆందోళనలు వంటి ప్రతికూల భావోద్వేగాలకు కూడా అవే కారణమవుతుంటాయి.అయితే, అవాంఛనీయ పరిస్థితుల్లో ఈ హార్మోను స్థాయి కనుక ఎక్కువగా ఉంటే కష్టమే.
అలాంటి సందర్భాలలో (ఉదాహరణకు ముఖ్యంగా ప్రేమికులలో) తీవ్రమైన విరహం, భావోద్వేగాలు జనిస్తాయి. ఈ హార్మోన్ల స్థాయి పెరగడం వల్లే కొందరు ప్రేమికులలో నిస్తేజం ఏర్పడి, వారిని ఒంటరిగా ఉండాలనిపించేలా చేస్తుంది. అలాగే కొన్ని విషయాలు మర్చిపోవడం, గ్రహణ శక్తి తగ్గి ఆలోచన మందగించడం వంటివాటికి దారితీస్తుంది. ప్రేమికులు పరస్పరం కలుసుకోవడానికి వారి ఆనందాలకు సంతోషాలకు ఈ లవ్ హార్మోనులులే కారణం. ఇవి వారిలో లైంగిక శక్తి తగ్గకుండా చేసి వారి మద్య భాందవ్యాన్ని గట్టి పడేలా చేస్తుంది. ఈ డోపమైన్(లవ్ హార్మోన్ )తగ్గిపోతే, వాటిని కొన్ని సహజ పద్దతుల ద్వారా పెంపొదించుకోవచ్చు. ఈ డొపమైన్ (లవ్ హార్మోన్)లను పెంచే కొన్ని ఆహారాలు..

స్ట్రాబెర్రీ
రాత్రి పడుకోయే ముందు ఈ స్ట్రాబెర్రీని తినడం మంచిది. ఇది లవ్ హార్మోనులను ఉత్పత్తి చేయడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే యాంటిఆక్సిడెంట్స్ క్యాన్సర్ తో పోరాడగలిగి శక్తి కలిగి ఉంటుంది.

డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ లవ్ హార్మోన్ పెంచుతుంది. అంతే కాదు డార్క్ చాక్లెట్ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ మొత్తం ఆరోగ్యానికే మంచిది.

సీ ఫుడ్:
సీ ఫుడ్ లో మన శరీరానికి కావల్సినన్ని పోషకాలు, ఖనిజలవణాలు లభ్యం అవుతుతాయి. వీటిలో దొరికే పోషకాంశాలు వేరేయేఇతర ఆహారాల్లో ఉండవు. అందులోనూ సాల్మాన్ వంటి చేపలను తినడం వల్ల డొపమైన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది.

క్యారెట్:
క్యారెట్ తినడం వల్ల పురుషుల్లో లైంగిక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ ‘ఎ'వల్ల కళ్ళకు చాలా ఆరోగ్యకరం.

పైనాపిల్:
పైనాపిల్ లో సిట్రస్ ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని పురుషులు తినడం వల్ల వారిలో పుష హార్మోనుల ఉత్పత్తిని పెంచుతుంది.

బాదం:
బాదాంలో మంచి కొలెస్ట్రాల్ ఉండి, మన శరీరపు బరువును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల మంచి రొమాంటిక్ మూడ్ ను పొందగలుగుతారు.

వైన్:
రెడ్ వైన్ మితంగా తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో శరీరంలో రక్త ప్రసరణకు సహాయపడుతుంది. రెడ్ వైన్ రొమాంటిక్ ఫీలింగ్ ను కలిగిస్తుంది.

అరటి:
అరటిపండులో అధిక పోషకాంశాలలో ఒకటి పొటాషియం ఎక్కువగా ఉండి, డొపమైన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ప్రతి రోజూ ఒక అరటి పండును తినడం వల్ల లైంగిక సమస్యలు ఉండవు.

సన్ ఫ్లవర్ సీడ్స్:
సహజంగా డొపమైన్ ఉత్పత్తిని పెంచుకోవాలనుకొన్నప్పుడు, ప్రతి రోజూ సన్ ఫ్లవర్ సీడ్స్ ను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

కెఫిన్:
కెఫిన్ లో ఉన్న గుణాలు డొపమైన్ ను పెంచడంలో చాలా సహాయపడుతుంది. ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ త్రాగడం వల్ల అతి తక్కువ సమయంలోనే లవ్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది.

వ్యాయామం:
ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల లవ్ హార్మోన్ పెంచుతుంది. దాంతోనే వ్యాయామం చేసిన తర్వాత మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది.

నిద్ర:
సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా డొపమైన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో లైంగిక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి రోజూ కనీసం 7-8గంట నిద్రపోవడం అవసరం.



Click it and Unblock the Notifications











