Latest Updates
-
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి
జింజర్ జ్యూస్(అల్లం రసం)లోని గొప్ప ఆరోగ్యప్రయోజనాలు
అల్లం అంటే తెలియని వారుండరు 5000 సంవత్సరాల నుండి అల్లంను వంటల్లోనే కాదు, అనేక ఔషధాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. అల్లం ఒక దుంప లేదా వేరు లాంటిది. ఇందులో విటమిన్స్ మరియు మాంగనీస్ మరియు కాపర్ వంటి విలువైన పోషకాంశాలున్నాయి. ఇవి మన శరీరంలోని అనేక జీవక్రియలకు అత్యవసరం అయినవి.
ఈ ఆర్టికల్లో అల్లం జ్యూస్ యొక్క ప్రత్యే ప్రయోజనాల గురించి తెలపడం జరిగింది. తాజాగా ఉండే అల్లం తీసుకొని, పైపొట్టు తీసి, శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సర్ గ్రైండర్ లో కొద్దిగా నీళ్ళు పోసి అందులో తాజా అల్లం ముక్కలు వేసి, మెత్తగా జ్యూస్ లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఒక గ్లాసులోకి వడగట్టుకోవాలి. ఈ తాజా జింజర్ జ్యూస్ ను అలాగే ఫ్రెష్ త్రాగడానికి ఇబ్బంది కరంగా ఉంటే అందులో కొద్దిగా షుగర్ వేసి తీసుకోవచ్చు. మరి ఈ జింజర్ జ్యూస్ లో గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒక సారి చూద్దాం...
అల్లం టీ యొక్క 8 ఆరోగ్య ప్రయోజనాలు:క్లిక్ చేయండి

బ్లడ్ ప్రెజర్:
అల్లం రక్తంను పల్చగా మార్చడానికి చాగా గొప్పగా సహాయపడుతుంది మరియు దాంతో శరీరంలో రక్తం ప్రవాహం చురుకుగా ఉండి, బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. జింజర్ జ్యూస్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది.

జలుబు మరియు దగ్గు:
అల్లం పాతకాలపు పద్దతిలో ఒక గొప్ప ఔషదంగా ఉపయోగిస్తున్నారు. పురాతన కాలం నుండి అల్లంను దగ్గు, జలుబు, వికారం నివారించడానికి యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగిన అల్లంను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది కోల్డ్ తగ్గించి, తక్షణ ఉపశమనం కలిగిస్తుంది మరియు కోల్డ్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

నొప్పి నివారిణి:
అల్లం, అన్ని రకాల నొప్పులను నివారిస్తుంది. పంటినప్పి తగ్గిస్తుంది మరియు మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది. అల్లం యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. రక్త కణాలు ఇన్ఫ్లమేషన్ కు గురికాకుండా సహాయపడుతుంది శరీరంలో రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఫలితంగా ఎటువంటి నొప్పినైనా నివారిస్తుంది.

జీర్ణక్రియకు:
అల్లం, జీర్ణక్రియ విషయంలో ఒక యాక్టివ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. జింజర్ జ్యూస్ అనేక జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. పొట్టలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అల్లంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పొట్టసంబంధిత ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

యాంటీఇన్ఫ్లమేటరీ:
జింజర్ జ్యూస్ వల్ల ఒక గ్రేట్ ఎఫెక్టివ్ ప్రయోజనం, ఇది గ్రేట్ గా యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కీళ్ళవాతం, కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం జింజర్ జ్యూస్ త్రాగే వారిలో చాలా తక్కువ కీళ్ళ నొప్పులు మరియు ఇన్ఫ్లమేషన్ వ్యాధులు ఏర్పడవని, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరరీంలో తాజాగా రక్తప్రవాహాన్ని పెంచుతుందని దాంతో శరీరంలో హానికరమైన మలినాలను తొలగిస్తుందని నిరూపించబడ్డాయి.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
అల్లం కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఒక గొప్ప ఏజెంట్ . అలాగే రక్త ప్రవాహంలో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. రక్తంపల్చగా మార్చి, రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఫలితంగా హార్ట్ అటాక్ రాకుండా నివారించవచ్చు.

కాన్సర్ ను నివారిస్తుంది:
జింజర్ జ్యూస్ క్యాన్సర్ నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. మరియు క్యాన్సర్ కు కారణం అయ్యే కణాలను నాశనం చేస్తుంది. మరియు క్యాన్సర్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను జింజర్ జ్యూస్ నివారిస్తుంది.

ఆర్థరైటిస్:
అల్లం, ఆర్థరైటిస్ కీళ్ళవాతం, కీళ్ళనొప్పలు, కీళ్ళ వాపులను నివారిస్తుంది. ఇది యాంటీఇన్ఫ్లమేటరి ఏజెంట్ గా పనిచేస్తుంది. థైరాయిడ్ మరియు ఆర్థరైటిస్ కు సంబంధించిన అన్ని రకాల ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

మొటిమలను నివారిస్తుంది:
జింజర్ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మొటిమలను నివారిస్తుంది మరియు భవిష్యత్తులో మొటిమలు ఏర్పడకుండా పనిచేసే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి, ఇప్పుడు మీకు జింజర్ జ్యూస్ యొక్క ప్రయోజనాలు తెలుసు కాబట్టి, వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా, ఆరోగ్యంతోపాటు, అందాన్ని కూడా పొందవచ్చు.

హెయిర్ కేర్ కు జింజర్ జ్యూస్:
మీరు పొడవాటి, మెరిసేటి జుట్టు ఉండాలని కోరుకుంటున్నట్లైతే మీరు జింజర్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి. మంచి ఫలితంకోసం ఈ జింజర్ జ్యూస్ ను తలకు, కేశాలకు కూడా పట్టించవచ్చు. తలకు పట్టించేటప్పుడు, అందులో నీళ్ళు తక్కువగా ఉండాలి . అల్లం కేశాలకు ఒక మంచి కండీషనర్ గా పనిచేస్తుంది మరియు ఇది చుండ్రును నివారిస్తుంది . మరియు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.



Click it and Unblock the Notifications