For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నుదుటిన బొట్టు:10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

By Super
|

బాల్యంలో నేను,నా తండ్రి నుదుటిబొట్టు ధరించటం అనేది నాకు ఇప్పటికీ గుర్తుకువస్తుంది. నేను ఒక సంప్రదాయ బ్రాహ్మిన ఇంటి నుండి వచ్చాను. అందువల్ల అతని పట్టుదల తప్పు కాదు. కానీ నేను విజ్ఞాన శాస్త్ర వ్యక్తిగా ఉన్నాను. అందువలన నాకు అతని సూచనలను అనుసరించి బలమైన శాస్త్రీయ నిరూపణ మరియు తార్కికం అవసరమైనది. కాలక్రమేణా,అతను నాకు చెప్పడం నిలిపివేయబడింది. అలాగే నేను పాటించడం కూడా ఆగిపోయింది. కానీ సంప్రదాయం ఇప్పటికి కొనసాగుతుంది. కాబట్టి, నేను ఇక్కడ మా పూర్వీకులు పవిత్ర బొట్టు లేదా తిలకధారణ ఎందుకు ఉపయోగిస్తారో కొంచెం లోతుగా తెలుసుకున్నాను.

స్థానంనకు సంబంధించిన విషయాలు

బొట్టును సాంప్రదాయకంగా కనుబొమ్మల మధ్య నుదుటిపై ధరిస్తారు. కొంతమంది కొంచెం ఎక్కువగా బొట్టు ధరించడానికి ఇష్టపడతారు. కానీ ప్రభావాలు అలాగే ఉంటాయి. స్థానం గురించి అడగవలసిన అవసరం ఏముంది? దాని గురించి ఇక్కడ వివరంగా ఉన్నది.

మేల్కొలుపు మరియు ఏకాగ్రత సెంటర్

మేల్కొలుపు మరియు ఏకాగ్రత సెంటర్

మా కనుబొమ్మ మధ్య పాయింట్ నుదుటిపై శరీరం యొక్క ప్రధాన నరాల స్థానం ఉంటుంది. అంతే కాకుండా ఈ పాయింట్ ను ఆరవ స్థానం అని కూడా అంటారు. ఇక్కడ అతి ముఖ్యమైన చక్ర ఉంది.'అజ్ఞ చక్ర' అని పిలవబడే ఈ పాయింట్ మేల్కొలుపు మరియు మూడవ కన్ను స్థానం యొక్క స్థానంను సూచిస్తుంది. ఈ స్పాట్ ఉత్తేజితం అయ్యి ప్రశాంతముగా ఉండటానికి మరియు ఆందోళన తగ్గటానికి రెండు రకాలుగా ఒక వ్యక్తికి సహాయపడుతుందని నమ్మకం. ఈ పాయింట్ ప్రపంచంలో ఒక వ్యక్తికీ మేలుకొల్పటానికి సహాయపడుతుందని నమ్మకం.

అంతేకాకుండా మొత్తం ఆధ్యాత్మిక ప్రయోజనాల నుండి ఈ ఆచారం వలన కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పాయింట్ ఉత్తేజపరచటం వలన క్రింది విధాలుగా సహాయపడుతుంది.

తలనొప్పి నుండి ఉపశమనం

తలనొప్పి నుండి ఉపశమనం

ఆక్యూప్రెజర్ సూత్రాల ప్రకారం,శరీరంలో ఈ పాయింట్ తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుందని కనుగొన్నారు. ఎందుకంటే నరాలు మరియు రక్తనాళాలు ఏకీభవించటం వలన తక్షణమే ఈ పాయింట్ రిలాక్స్ అవమని మెసేజ్ పంపుతుంది.

తలనొప్పి నుండి ఉపశమనానికి సహజ నివారణల గురించి మరింత చదవండి.

నాసికా రంధ్రాలను క్లియర్ చేస్తుంది

నాసికా రంధ్రాలను క్లియర్ చేస్తుంది

ఈ పాయింట్ ను నొక్కినపుడు ట్రిజెమినల్ నరాలు (నరాలు మొత్తం ముఖంనకు సరఫరా చేస్తుంది) ముక్కు మరియు దాని చుట్టూ ప్రాంతాలను(ట్రిజెమినల్ నరాలు ప్రధానంగా కణత టెంపోరల్,బుగ్గలోపల మరియు చేతిని) ప్రేరేపిస్తాయి. ప్రేరేపించబడిన సమయంలో ఈ నరాలు ఉద్దీపన మరియు ముక్కు ద్వారా ప్రయాణించే రక్త ప్రవాహం,ముక్కు మరియు ఎముక రంధ్రాల యొక్క శ్లేష్మ పొరను పెంచేందుకు సహాయం చేస్తాయి. అలాగే ఇది ముక్కు బ్లాక్ ఉపశమనానికి సహాయపడుతుంది. ఎముక రంధ్రాల లోపల వాపు మరియు ముక్కు రొంప మరియు సైనసిటిస్ ను తగ్గిస్తుంది.

సైనసిటిస్ తగ్గించటానికి సహాయం చేసే హోం నివారణల గురించి మరింత చదవండి.

మీ ముఖ కండరాలను శక్తివంతం చేయుట మరియు ముడుతలను తగ్గించుట

మీ ముఖ కండరాలను శక్తివంతం చేయుట మరియు ముడుతలను తగ్గించుట

ఈ పాయింట్ ను ఉత్తేజపరిస్తే వచ్చే అత్యంత అద్భుతమైన ప్రయోజనాలలో ఇది ఒకటి. ఇది ముఖం యొక్క కండరములు ప్రేరేపిస్తుంది. అలాగే అన్ని కండరాలలో(సుప్రత్రొచ్లెఅర్ ధమని మరియు సుప్రత్రొచ్లెఅర్ సిర ఉత్తేజపరిచటం ద్వారా) రక్త ప్రవాహంను పెంచుతుంది. ఈ చర్య కండరాల యొక్క దృఢత్వం పెరగటానికి సహాయపడుతుంది. చర్మంనకు పోషణ అందించి ముడతలు లేకుండా ఉంచుతుంది. ఈ పాయింట్ సుప్రత్రొచ్లెఅర్ నరాలకు( చర్మ పోషణకు ఒక నరాల శాఖ) కేంద్రంగా ఉంది. ఇది చర్మంను మరింత మృదువుగా మరియు ఆరోగ్యకరముగా చేసి ముడతలు ఎక్కువ కాలం లేకుండా సహాయం చేస్తుంది.

మీరు యాంటి ఏజింగ్ గురించి తెలుసుకోవాలంటే కావలసిన ప్రతి దానిని తెలుసుకోండి.

బెల్ యొక్క పక్షవాత లక్షణాల ఉపశమనంనకు సహాయపడుతుంది

బెల్ యొక్క పక్షవాత లక్షణాల ఉపశమనంనకు సహాయపడుతుంది

ఈ పాయింట్ యొక్క మర్దనా వలన బెల్ యొక్క పక్షవాతంతో(ముఖం యొక్క ఒక భాగం పక్షవాతానికి మారిన పరిస్థితిలో) బాధపడుతున్న వ్యక్తులకు అద్భుతమైన ప్రభావాలను చూపిస్తుంది. ఈ పాయింట్ మర్దనాకు సహాయపడుతుంది. ఎందుకంటే కంటిరెప్పలను దించే కండరము కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఇది కండరాల కపాల నాడుల్లో ఐదు కండరాల (CNVII) యొక్క నాడీ తంతువులు కలిగి ఉన్న టెంపోరల్ నరాల యొక్క శాఖల ద్వారా ఉంచుతారు. బెల్ యొక్క పక్షవాతం వచ్చినప్పుడు CNVII కీలకమైనది. ఇది మొత్తం ముఖ కండరాల యొక్క కదలికల బాధ్యతను నిర్వహిస్తుంది.

ఈ పాయింట్ మర్దనాను ఆయుర్వేదంలో పంచకర్మ విభాగంలో 'శిరోధార' అనే చికిత్సా విధానంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చికిత్సలో సాధకుడు 40-60 నిమిషాల పాటు నుదిటి(నుదుటిబొట్టు/తిలకధారణ ధరించే ప్రదేశం)మధ్యలో నిరంతరం వైద్య తైలంను దారగా పోస్తారు.ఇది ముఖ నరాలకు లోతైన ఉద్దీపన అందించడానికి మరియు బెల్ యొక్క పక్షవాతం లక్షణాల నుండి ఉపశమనం కొరకు అని చెప్పబడింది.

కళ్ళ కండరాలు కోసం మంచిది

కళ్ళ కండరాలు కోసం మంచిది

నుదిటి కేంద్రం పాయింట్ నేరుగా సుప్రత్రొచ్లెఅర్ నరాలకు అనుసంధానించబడి ఉంటుంది.(ఈ నరాలు కళ్ళు కండరాలు మరియు చర్మం ఫీడ్ కొరకు ఫైబర్స్ కలిగి ఉంటుంది) ఈ నరాలు మీ కళ్ళు చుట్టూ ఉన్న అన్ని కండరాలకు అనుసంధానించబడి ఉంటాయి. వాటిని సులభంగా వివిధ దిశల్లో తరలించుటకు సహాయం చేస్తుంది. ఈ కండరాలు మీ కళ్ళ యొక్క ఆకారాన్ని మార్చడానికి కూడా ముఖ్యమైనవి. తద్వారా మీరు మరింత స్పష్టంగా వస్తువులను(సమీపంలో మరియు చాలా దూరంలో)చూడవచ్చు.

మీ కళ్ళ ఆరోగ్యం గురించి మరింత సమాచారం చదవండి.

మీ వినికిడి మీద ప్రభావితం

మీ వినికిడి మీద ప్రభావితం

మీ ముఖం యొక్క కండరముల పోషణకు మరియు మీ మధ్య చెవి(వినటానికి లోపలి చెవి యొక్క అతి ముఖ్యమైన భాగం) ఉద్దీపనకు సహాయపడుతుంది. అందువలన ఈ ఉద్దీపన ఆరోగ్యకరమైన మీ చెవులకు సహాయం చేస్తుంది.

మీ కనుబొమ్మలను మధ్య ఫైన్ లైన్లను తగ్గిస్తుంది

మీ కనుబొమ్మలను మధ్య ఫైన్ లైన్లను తగ్గిస్తుంది

చాలా మంది కనుబొమ్మ మధ్య ఫైన్ లైన్లను చూసి ఆందోళన చెందుతారు. మీ కనుబొమ్మల మధ్య స్పాట్ ని ఒకసారి మసాజ్ చేయండి. ఈ పాయింట్ లో కంటిరెప్పల దించు కండరము ఉంటుంది. ఈ మర్దనా కండరాలను బలపరుస్తుంది. అంతే కాకుండా ఆ ప్రాంతంలో చర్మం యొక్క రక్త ప్రవాహం మరియు నాడీ ఉద్దీపన పెంచేందుకు తోడ్పడుతాయి. ఆ ప్రభావంతో బాధించే 'ఆందోళన లైన్ల' రూపాన్ని ఆపవచ్చు.

మీ మనస్సు ప్రశాంతత

మీ మనస్సు ప్రశాంతత

మీ కనుబొమ్మ మధ్య ఆజ్ఞ చక్ర లేదా పాయింట్ కు ఆందోళన మరియు ఒత్తిడి వల్ల నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో మర్దనా చేయుట వలన కండరాలు మరియు నరాలు మీ దేహమంతా ప్రశాంతత ప్రభావంను పంపడం ద్వారా విశ్రాంతికి సహాయపడుతుంది. ఇది సహజంగా నొక్కే అవకాశం ఉన్న ప్రదేశాలలో ఒకటిగా ఉన్నది. కాబట్టి,ఒక ప్రశాంతమైన దృష్టి మరియు మనస్సు కోసం ప్రతి రోజు ఒకసారి ఈ ప్రాంతంలో ఉద్దీపన కలిగించండి. ఆత్రుతగా ఉందా? ఇక్కడ ఆందోళన మరియు ఒత్తిడి పరిష్కరించేందుకు చిట్కాలు ఉన్నాయి.

నిద్రలేమి తగ్గుతుంది

నిద్రలేమి తగ్గుతుంది

మీరు ఒక నుదుటిబొట్టు ధరించే బిందువు నిద్రలేమిని కూడా చాలా సమర్థవంతంగా ఓడిస్తుంది. మీ శరీరం యొక్క ఎగువ భాగం,ముఖం,మెడ కండరాలు,మనస్సు ప్రశాంతత,విశ్రాంతికి సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం నిద్రలేమికి అత్యంత సాధారణ కారణాలుగా మానసిక ఒత్తిడి,అలసట మరియు అతి ఉత్తేజక మనస్సు అని చెప్పుతారు. నిద్రలేమితో ఉపశమనం కొరకు ప్రతి రోజు కొన్ని సెకన్ల పాటు ఆ పాయింట్ దగ్గర నొక్కండి. అలాగే ఇది మీకు సహాయపడకపోతే'శిరోధార'వంటి చికిత్సలు ఉన్నాయి. నిద్రలేమిని ఓడించటానికి సహాయం చేసే యోగా ఆసనాల గురించి మరింత చదవండి


English summary

10 amazing health benefits of wearing a bindi on your forehead

As a child I still remember my father used to insist that I wear a bindi. Considering I came from a traditional Tambrahm home, his insistence was not misplaced. But being the person of science that I am, I needed strong scientific proof and reasoning for following his instructions. Over time, he stopped telli
Desktop Bottom Promotion