Latest Updates
-
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
కొబ్బరి నూనెను ఉపయోగించడానికి ఉత్తమ చిట్కాలు
కొబ్బరి నూనెఉపయోగించి ఉత్తమ చిట్కాలు
మీరు జలుబుతో బాధపడుతున్నారా? తలలో చుండ్రు మరియు జుట్టు రాలే సమస్యలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా?మీ శరీర దుర్వాసనతో మీ స్నేహితులకు దూరం అవుతున్నారా? ఈ సాధారణ సమస్యలన్నింటికి ఒక ఉత్తమ పరిష్కార మార్గం ఒక బాటిల్ కొబ్బరి నూనె!
కొబ్బరినూనె ఖరీదైనది కాదు, కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకే ఈ కొబ్బరినూనెను అనేక సమస్యలను నివారించే చికిత్సల కోసం ఉత్తమ హోం రెమెడీగా ఉపయోగిస్తున్నాము. అది బ్యూటి సమస్య కావచ్చు లేదా ఆరోగ్యస్థితిగతులు కావచ్చు..కొబ్బరి నూనెతో తక్షణ ఉపశమనం పొందవచ్చు.
కొబ్బరి నూనెను ఉపయోగించడానికి 10 ఉత్తమ మార్గాలు:

1. చుండ్రు మరియు జుట్టు రాలడం తగ్గిస్తుంది :
కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టిరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చుండ్రును నివారించడంలో గొప్పగా సహాయపడుతాయి. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. వాతావరణం వల్ల వచ్చే కాలుష్యం మరియు ఒత్తిడి నుండి మనల్ని రక్షిస్తుంది. గోరువెచ్చని కొబ్బరి నూనెను మన తలకు, జుట్టుకు హెయిర్ రూట్స్ కు పట్టించినప్పుడు, ఇది చాలా ఎఫెక్టివ్ మాయిశ్చరైజర్ గా నిరూపించబడినది. కొబ్బరి నూనె వల్ల తలలో దురద తగ్గుతుంది. ఇంకా పొట్టు రాలే సమస్య నివారించబడుతుంది. మరియు తలకు పోషణ అందించి, జుట్టు రాలడం నివారిస్తుంది.

2. చిన్న చిన్న కాలిన గాయలను మాన్పుతుంది :
మీకు ఎప్పుడైనా అనుకోకుండా కాలిన గాయలు ఏర్పడినప్పుడు, వెంటనే ఆ ప్రదేశంలో చల్లగా ఏదైనా అప్లై చేయాలి. దాని తర్వాత కొబ్బరి నూనెను లేపనంగా రాయాలి. ప్రతి ఒక గంటకొకసారి తిరిగి రాస్తుంటే, తక్షణ ఉపశమనంతో పాటు, నొప్పి కూడా తగ్గుతుంది. నిజానికి, చర్మం మీద ఏర్పడ్డ చారలను కుడా కొబ్బరి నూనె నివారిస్తుంది.

3. శరీరం యొక్క దుర్వాసను నివారిస్తుంది:
రెండు మూడు చుక్కల కొబ్బరి నూనెను అరిచేతిలో వేసుకొని బాగా మర్దన చేసి తర్వాత చంకల్లో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెమట వల్ల వచ్చే వాసనను నివారించుకోవచ్చు.

4. జలుబు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది :
మీరు జలుబు మరియు దగ్గుతో బాధపడుతున్నట్లైతే, చమోమెలీ టీని తీసుకోవాలి. తీసుకొనే ముందు అందులో ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను మిక్స్ చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

5. డైపర్ రాషెష్ ను తగ్గిస్తుంది:
మీకు తెలుసా కొబ్బరి నూనె బేబీకి ఏర్పడ్డ డైపర్ రాషెష్ ను కూడా నయం చేస్తుంది.?డైపర్ రాషెష్ ను నయం చేయడంలో కొబ్బరి నూనె సూపర్ గా పనిచేస్తుంది. డైపర్ ను మార్చే ప్రతి సారి, కొబ్బరి నూనెను అప్లై చేయాలి.

6. గాఢనిద్ర పట్టిస్తుంది:
నిద్రలేమి సమస్యతో మారు బాధపడుతున్నట్లైతే, రోజూ మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఇది మీ శరీరంలో జీవక్రియలను క్రమబద్దం చేయడానికి సహాయపడుతుంది. దీని వల్ల గాఢనిద్రను పొందగలుగుతారు.

7. ఇయర్ వాక్స్ ను తొలగిస్తుంది:
మనందరికి కొన్ని సందర్భల్లో ఇయర్ వాక్స్ సమస్య ఉంటుంది. దీన్ని తొలగించడానికి ఒక్కొక్క సారి చాలా మొండిగా మారుతుంది . చెవులను శుభ్రంగా ఉంచుకోవాలంటే, ఈ ఇయర్ వ్యాక్స్ ను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం ఉత్తమ మార్గం. ఒక చుక్క కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి చేవిలో వేసుకోవాలి. ఇయర్ కెనాల్ ద్వారా లోనికి వెళ్లేలా వేయాలి. ఇది ఇయర్ వ్యాక్స్ వదలయ్యేందుకు సహాయపడుతుంది. ఈ క్రమంలో ఇయర్ వ్యాక్స్ ఆటోమాటిక్ గా తొలగిపోతుంది.

8. సన్ బర్న్ నివారిస్తుంది:
సన్ బర్న్(ఎండ వేడిమి వల్ల కమిలిన చర్మం)నివారించడానికి కొబ్బరినూనె గ్రేట్ గా సహాయపడుతుంది. వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే, సమస్య రాకుండా ముందుజాగ్రత్త తీసుకోవడం ఉత్తమం. ఎండలోకి వెళ్ళడానికి ముందు కొబ్బరి నూనెతో మీ శరీరం మొత్తాన్ని మసాజ్ చేసుకండి. ఇది మీ యొక్క స్కిన్ టోలరెన్స్ ను పెంపొందిస్తుంది. దాంతో సన్ బర్న్ కు గురికాకుండా చూస్తుంది. కాబట్టి, తగినంత కొబ్బరి నూనె తీసుకొని, మీ డైలీ డైట్లో కొబ్బరి నూనెను తీసుకోవడానికి ప్రయత్నించాలి.

9. ముడుతలను నివారిస్తుంది:
కొబ్బరి నూనె మీ చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది ఒక నేచురల్ మాయిశ్చరైజర్ ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది . చర్మం మీద చాలా సున్నితమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండం వల్ల వయస్సైన వారిలా కనబడనివ్వదు. కాబట్టి, మీరు బేబీ సాఫ్ట్ స్కిన్ కోరుకుంటున్నట్లైతే, కొబ్బరి నూనెను రోజుకు రెండు సార్లు చర్మానికి అప్లై చేసుకోవాలి. మరియు దీన్ని మీ డైలీ డైట్ లో కూడా చేర్చుకోవాలి.

10. నొప్పిని నివారిస్తుంది:
జాయింట్స్ మరియు కండరాల వద్ద నొప్పులున్నట్లైతే, కొద్దిగా కొబ్బరి నూనెతో మర్ధన చేస్తే నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మీరు కండరాల నొప్పులతో మరియు జాయింట్ పెయిన్స్ త బాధపడుతున్నట్లైతే, గోరువెచ్చని కొబ్బరినూనెతో మర్ధన చేయండి. తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. చూశారుగా కొబ్బరినూనెలో ఎన్ని మేలైను గుణాలున్నాయో. కాబట్టి, కొబ్బరి నూనెను ఉపయోగించే విధానం తెలుసుకొన్నారుగా మరి మీ ఇంట్లో ఈ సౌకర్యవంతమైన ఔషధ నూనెను నిల్వచేసుకొంటే మంచిగా ఉపయోగపడుతుంది.



Click it and Unblock the Notifications











