Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
నిద్రలేమి సమస్యను నివారించే ఉత్తమ మార్గాలు
నిద్రలేమి సమస్య ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సందర్భంలో లేదా ఏదో ఒక వయస్సులో పట్టి పీడించే సమస్య. మనిషి మనుగడకు నీరు, గాలి, ఎండ, ఆహారం ఎంత అవసరమో నిద్రకూడా అంతే ముఖ్యం. సరిగా నిద్రపోకపోతే, ఆరోగ్యం మీద వివిధ రకాలుగా దుష్ప్రభావాలను చూపుతుంది. నిద్రరావడం లేదని నిద్రమాత్రలకు అలవాటు పడితే అది మరో విధంగా శరీరానికి హానికలిగిస్తుంది. ప్రస్తుత రోజుల్లో పెద్ద పెద్ద నగరాల్లో నివసించే వారిలో 40శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
జీవనశైలిలో మార్పులు, నిద్రకు సరైన సౌకర్యాలు ఏర్పరచుకోలేకపోవడి, శబ్ద మరియు కాలుష్యం మరియు ఇతర మరికొన్ని కారణాల వల్ల నిద్రలేమికి గురి అవుతుంటారు. అయితే ఇప్పటికీ మించిపోయినదేమీ లేదు. ఈ సమస్యను నివారించుకోవడానికి ఎంతో కొంత నమ్మకం ఉంది. సరైన సమయానికి సరిగా నిద్రిపోవడానికి కొన్నిసహజ మార్గాలున్నాయి. అందుకు మీరు కొంచె ఓపిగ్గా స్లీప్ ప్యాట్రన్ మార్చుకొన్నట్లైతే చాలు మీరు మంచి గాఢమైన నిద్రను పొందవచ్చు.
మంచి నిద్రపొందడానికి కొన్ని చిట్కాలు

కెఫిన్/టుబాకో/ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి
మీకు కనుక స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నట్లైతే, వాటిని వెంటనే నివారించడం ఉత్తమం. అలాగే నిద్రంచడానికి కొన్ని గంటల ముందు టీ లేదా కాఫీ వంటి బెవరేజస్ ను తీసుకోవడం మానుకోండి. ఇటువంటి అలవాట్ల వల్ల నిద్రలేమికి కారణం అవుతుంది. నిద్రలేమి సమస్య లక్షణాలు కనిపించినప్పుడు, అది ఇతర ఆనారోగ్య సమస్యలకు లక్షణాలుగా గుర్తించాలి.

నిద్రించడానికి ముందు వేడి నీటి స్నానం
నిద్రించడానికి ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఒక మంచి ఐడియా. స్నానానికి ఉపయోగించే వేడినీటిలో కొన్ని ఔషధగుణాలున్న హెర్బ్స్ ను వేయడం వల్ల అది మరింత సహాయపడుతుంది. ఇంకా వామ్ వాటర్ బాత్, మీ శరీరం మరింత విశ్రాంతి పొందడానికి మంచిగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది. నిద్రపొందడానికి మాత్రలు మింగడం కంటే ఇలాంటి నేచురల్ పద్దతులను అనుసరించడం ఉత్తమం.

ప్రతి రోజూ వ్యాయామం
మీరు ప్రతి రోజూ మంచిగా నిద్రపోవడానికి వ్యాయామం ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. నిద్రయొక్కనమూనాలు మీ యాక్టివిటి లెవల్స్ మీద నేరుగా ప్రభావం చూపుతుంది. మీరు ఒక మంచి జీవనశైలిని అలవరుచుకోవాలి.

యోగ
మంచి నిద్రపొందడానికి యోగ ఒక ఉత్తమ మార్గం. నిద్రించడానికి రెండు మూడు గంట ముందు కొన్ని ఆసనాలను ప్రయత్నింపచండి . మీరు యోగా క్లాసులకు చేరి నిపుణుల సలహాలను తీసుకోండి. నిద్రపోవడానికి ఇలాంటి నేచురల్ పద్దతులు చాలా బాగా సహాయపడుతాయి.

మసాజ్ లేదా ఆరోమా థెరఫీ
మసాజ్ థెరఫీ మీ శరీరం రిలాక్స్ అవ్వడానికి చాలా బాగా సహాయపడుతుంది. అయితే ప్రతి రోజూ మసాజ్ చేయించుకోవడం కుదరదు కాబట్టి, కొన్ని సువాసనభరితమైన ఆయిల్స్ ను తెచ్చుకొని స్నానం చేసే నీళ్ళలో వేసి, ఆ నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

రాత్రుల్లో అధికంగా భోజనం, స్పైసీ ఫుడ్స్ తీసుకోకండి
నిద్రలేమి సమస్యతో బాధపడే వారు, మితంగా డిన్నర్ చేయాలి. అలాగే స్పైసీ ఫుడ్ తినడం తగ్గించాలి.

నిద్రించే ముందు బుక్స్ చదవాలి
నిద్రించే ముంది మంచి పుస్తకం మీకు నచ్చిన పుస్తకం చదివితే త్వరగా నిద్రపడుతుంది. ఇది నిద్రపట్టడానికి మరో సులభ పద్దతి.

పడకగది క్లీన్ గా అందంగా మరియు చీకటిగా ఉంచాలి
పడకగదిలో శుభ్రంగా మరియు లైట్ లెవల్స్ ను మీకు నచ్చినవిధంగా అమర్చుకొంటే, బాగా నిద్రపడుతుంది.

మీకు నచ్చిన మ్యూజిక్ ను వినాలి
మీకు నచ్చిన ఒక అందమైన మ్యూజిక్ ను వినడం అలవాటు చేసుకోండి. నిద్రపొందడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.



Click it and Unblock the Notifications
