Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
సీతాఫలంలోని 14గొప్ప ఆరోగ్యప్రయోజనాలు
చలికాలంలో విరివిగా లభించే ఫలాలలో సీతాఫలం ఒకటి, సీతాఫలాన్ని రకరకాలుగా పిలుస్తారు. సీతాఫలం అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్ యాపిల్ అనీ షుగర్ యాపిల్ అనీ పిలుస్తారు. పచ్చి సీతాఫలం తినడానికి పనికిరాదు. ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది. ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. బాగా పండినతర్వాత మాత్రమే తినడానికి వీలవుతుంది. సీతాఫలం చుట్టూ కళ్లులాగా బెరడులాంటి పధార్థం ఉంటుంది. పండిన సీతాఫలంపై ఈ కళ్లను విడదీస్తే లోపల ఒక్కొక్క గింజ చుట్టూ తెల్లటి గుజ్జు మధురంగా ఉంటుంది.
కాలానుగుణంగా ఉత్పత్తి అయ్యే పండ్లలో ఒక్కొక్క పండుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఏ పండు అయినా, శరీరానికి కేలరీలుతోపాటు తగిన మోతాదులో మాంసకృత్తులను సైతం అందించగలవు, అయితే సీతాఫలం మాత్రం ఇందుకు భిన్నమైనదనక తప్పదు. ఆహార పధార్థాంగా ఆకలిని తీర్చడం మాత్రమేగాక, ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలు ఇందులో దాగివున్నాయంటే ఆశ్ఛర్యం కలగక మానదు.
సీతాఫలం ఆకు మొదలుకుని గుజ్జు తిన్న తరువాత పారవేసే గింజల వరకూ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని వైద్యశాస్త్రం నొక్కినొక్కాణిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పండులోని ప్రతి భాగం ఔషధమని చెప్పక తప్పదు. దేహాపుష్టి పెంపు నుంచి కొన్ని రకాల ధీర్ఘకాలిక వ్యాధులను నశింపచేసే శక్తి సీతాఫలాంనికి ఉంది. రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే ఔషధ గుణగణాలు సీతాఫలంలో దాగి ఉన్నాయి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను కూడా అంతమొందించిచడానికి సీతాఫలంలో దాగి ఉన్నాయి. సీతాఫలం ఒక సంజీవని మాదిరిగా పని చేస్తుంది. మరి ఈ సంజీవిని మరెన్ని విధాలుగా ఆరోగ్యానికి ప్రయోజన చేకూరుస్తుందో చూద్దాం...

బరువు పెంచుతుంది:
ఎవరైతే బరువు పెరగాలనుకుంటారో, అటువంటి వారు సీతాఫలం జ్యూస్ లో తేనె మరియు పాలు మిక్స్ చేసి రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇది క్యాలరీలను పెంచుతుంది.

గర్భధారణ సమయంలో:
గర్భిణీ స్త్రీలు సీతాఫలం తినడం వల్ల పొట్టలో పెరిగే శిశువు యొక్క మెదడు, నాడీవ్యవస్థ, వ్యాధినిరోధకత పెరగడానికి సహాయపడుతుంది. మరో ముఖ్యమైన ప్రయోజనం గర్భస్రావాన్ని నివారిస్తుంది.

ఆస్త్మా:
సీతాఫలంలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల బ్రోంకైల్ ఇన్ప్లమేషన్ తగ్గించి ఆస్త్మాటిక్స్ అటాక్ ను తగ్గిస్తుంది.

హార్ట్ అటాక్
హార్ట్ అటాక్ సీతాఫలంలో ఉండే మెగ్నీషీయం అధికంగా ఉంటుంది . దీన్ని వల్ల ఒక గొప్ప ఆరోగ్యప్రయోజనం కార్డియక్ అటాక్స్ నుండి రక్షిస్తుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:
సీతాఫలంలో కాపర్ మరియు డైటర్ ఫైబర్ అధికంగా ఉన్న హెల్తీ ఫ్రూట్. ఈ కాపర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక అడిషన్ గా బౌల్ మూమెంట్ క్రమంగా ఉంటుంది. మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది.

డయాబెటిస్ కు ఉత్తమ పండు:
ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. షుగర్ షోషణను సీతాఫలం తగ్గిస్తుంది .దాని వల్ల టై2 డయాబెటిస్ తగ్గిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:
సీతాఫలం వల్ల మరో గొప్ప ప్రయోజనం పొటాషియం మరియు మెగ్నీషియం ఉండటం వల్ల, ఈ రెండు బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

కొలెస్ట్రాల్ :
సీతా ఫలంలో నియాసిన్ మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

అనీమీయా తగ్గిస్తుంది:
సీతాఫలంలోని ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల అనీమియాను తగ్గిస్తుంది.

ఓరల్ హెల్త్:
దంత ఆరోగ్యానికి చాలా మంచిది. దంతాలనొప్పి మరియు దంతక్షయాన్ని నివారించడానికి సీతాఫలం గ్రేట్ గా సహాయపడుతుంది.

కళ్ళు ఆరోగ్యం:
సీతాఫలంలో రెబోఫ్లెవిన్ మరియు విటమిన్ సి అధికంగా ఉన్నాయి. ఇది కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రీరాడికల్స్ ను నివారించి మంచి కంటిచూపును అందిస్తుంది.

ఆర్థరైటిస్ నివారించవచ్చు:
మరో ముఖ్యమైన ఆరోగ్యప్రయోజనం ఇందులో మెగ్నీషియం వల్ల శరీరంలో వాటర్ ను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది . దాని వల్ల జాయిట్ పెయిన్స్ ను నివారిస్తుంది.

మార్నింగ్ సిక్ నెస్ ను నివారిస్తుంది:
సీతాఫలం చాలా గొప్పగా ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది. డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా మార్నింగ్ సిక్ నెస్ నివారిస్తుంది. ఇది అలసటను మరియు ఆకలి కోరికను నివారిస్తుంది.

క్యాన్సర్ ను దూరం చేస్తుంది:
స్కిన్ అలర్జీని నివారిస్తుంది. మరియు స్కిన్ క్యాన్సర్ రాకుండా ఎదుర్కొంటుంటి.



Click it and Unblock the Notifications