Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
తాటిముంజలు(ఐస్ ఆపిల్)లోని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్
ప్రకృతిలో ఎన్నో విచిత్రాలున్నాయి. దాని కారణంగా వచ్చే ప్రతీ సమస్యకు విరుగుడునూ చూపిస్తుంది. ఓ వైపు ఎరట్రి ఎండలతో చెమటలు కక్కి వడలిపోయేలా చేస్తుంది. వడదెబ్బ ప్రతాపాన్ని రుచిచూపిస్తుంది. సూర్యుడు పైపు వేసుకుని మనిషిలోని నీటిని మెుత్తం తాగినట్లు కొద్దిసేపు ఎండలో తిరిగితే నీరసం ఆవహిస్తుంది. అయితే దీని నుంచి బయటపడడానికి ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాలు ఎన్నో ఉన్నారుు. వీటిలో మనకు వేసవిలో గుర్తుకు వచ్చేవి మూడు. పుచ్చకాయలు, తాటి ముంజలు, కొబ్బరి నీళ్లు. ఇవి నీరసపడిన మనిషికి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. వడదెబ్బ నుంచి రక్షిస్తారుు. వీటిలో కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయ గురించి ఇంతక ముందే మనం తెలుసుకున్నా. ఇప్పుడు తాటి ముంజలు గురించి తెలుసుకుందాం...
సమ్మర్ లో మాత్రమే దొరికే కూలింగ్ ప్రూట్స్ లో తాటిముంజలు కూడా ఒకటి. తాటి ముంజల్లో వుండే కొబ్బరి నీళ్ళ లాంటి తియ్యటి నీళ్ళు మీదపడకుండా తినటం ఒక సరదా...వేసవిలో ప్రత్యేకంగా లభించే తాటిముంజలు, పుచ్చకాయలు ప్రజలు బానుడి తాపన్ని తట్టుకునేందుకు అత్యంత ప్రియంగా విటిని తింటారు. అదేవిధంగా శీతాల పాని యాలపై కూడా ఎక్కువ మోజు చూపుతా రు.అందులో భాగంగానే వేసవి కాలంలో వచ్చే తాటిముంజలకు బలే గిరాకి పెరిగింది.
వేసవిలో విరివిగా లభించే వీటివల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. దాహార్తిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాదు ... అందానికి ఎంతో మేలుచేస్తాయివి. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని ఐస్ ఆపిల్ అంటారు. ఈ ఐస్ ఆపిల్ లో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇందులో విటమిన్ బి, ఐరన్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. తాజాగా ఉండే ఈ తాటిముంజ జ్యూసీ లిచీ ఫ్రూట్ లా ఉంటుంది మరియు రుచి తాజా లేలేత కొబ్బరి బోండాం టేస్ట్ కలిగి ఉంటుంది. కాలిన గాయాలకు,మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించేందుకు తాటిముంజల్నీ తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకొని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచు చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వీటితో పాటు మరికొన్ని ఆరోగ్యప్రయోజనాలు ఈ క్రింది విధంగా

బరువు తగ్గిస్తాయి:
వేసవిలో మీరు బరువు తగ్గాలనుకుంటే, కొన్ని పౌండ్ల బరువు తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం తాటిముంజలు గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి. వీటిలో ఉండే అధిక నీటిశాతం, మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగించి ఆకలి కానివ్వవు. దాంతో చాలా తేలికగా బరువు తగ్గవచ్చు.

వికారం:
వికారం, వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంటే, ఐస్ యాపిల్ ఒక గ్రేట్ ట్రిక్. ఇది ఒక గ్రేట్ హెల్త్ ట్రిక్. తాటి ముంజలు తినడం వల్ల ఆ ఫీలింగ్ తగ్గుతుంది.

చికెన్ పాక్స్(ఆటలమ్మ):
తాటిముంజలతో వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో చికెన్ పాక్స్ నివారించడంలో ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్. ఇందిలో చల్లదనం వల్ల శరీరానికి కావల్సినంత చల్లదన్నా అందిస్తుంది. వేసవిలో చికెన్ పాక్ వస్తే, తాటిముంజలు రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వడదెబ్బ:
వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. తాటి ముంజ మనిషికి ఎంతో మేలు చేస్తుంది. మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఎండాకాలం ఈ తాటి ముంజల్లో నీళ్లు చాలా చలువ చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి ముసలి వాళ్లకి చాలా మంచిది.

గర్భిణీ స్త్రీలకు:
గర్భిణీలు తాటి ముంజలు తినడం వల్ల వారిలో మలబద్దక సమస్య నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా ఎసిడిటి సమస్యను కూడా నివారిస్తుంది.

హైడ్రేషన్:
తాటి ముంజల్లో అధిక నీటిశాతం ఉండటం వల్ల దీని వల్ల శరీరానికి తగినంత తేమ అందించి, చర్మంను, శరీరాన్ని చల్లగా ఉంచేందుకు గొప్పగా సహాయపడుతుంది.

స్టొమక్ ఎలిమెంట్స్:
తాటిముంజల వల్ల బెస్ట్ హెల్త్ బెనిఫిట్ పొట్ట సమస్యలను నివారించండంలో నేచురల్ ట్రీట్మెంట్ గా సమాయపడుతుంది.

అలసట:
వేసవికాలంలో, ఇతర సీజన్ల కంటే ఈ సీజన్ లో ఎక్కువ అలసటకు గురి అవుతుంటారు. అందుకు ప్రధాన కారణం, శరీరం నుండి నీటిని కోల్పోవడం వల్ల వచ్చే నీరసం, అలసటను తాటి ముంజలు నివారించి, తక్షణ శక్తిని అందిస్తుంది.

జీర్ణ సమస్యలను నివారిస్తుంది:
అన్ని రకాల జీర్ణ సమస్యలను నివారించడంలో తాటి ముంజలు గ్రేట్ గా సహాయపడుతాయి. వేసవికాలంలో పొట్ట సమస్యలను నివారించడంలో ఏన్షెంట్రల్ థెరఫీగా వీటిని ఉపయోగిస్తారు.

మలబద్దకం:
సమ్మర్ సీజన్ లో చాలా మందిలో ఎదుర్యే మలబద్దక సమస్యను నివారిస్తుంది. తాటి ముంజలు మెత్తగా లేకున్నప్పుడు, వాటిని జ్యూస్ లా తయారుచేసి ఉదయం పరగడుపున త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

లివర్ సమస్యలు:
తాటిముంజలు యొక్క బెస్ట్ హెల్త్ బెనిఫిట్, వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నిధానంగా లివర్ సమస్యలను తగ్గించుకోవచ్చు . వీటిలో ఉండే అధిక పొటాషియం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి అద్భుతంగా సహాయపడతుంది.

శరీరానికి తగినంత చల్లదాన్ని అందిస్తుంది:
వేసవిలో విరివిగా మనకు అందుబాటులో ఉండే ఈ పండ్లు చాలా తక్కువ క్యాలరీలు కలిగిఉంటుంది. కానీ, ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది. శరీరానికి తగినంత కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది.

ప్రిక్లీ హీట్:
వేసవి కాలంలో ప్రిక్లీ హీట్ ను తగ్గిస్తుంది మరియు చెమటకాయలను నివారిస్తుంది. తాటి ముంజల పొట్టను తీసి చర్మానికి మర్ధన చేయడం వల్ల, చెమటకాయలు తగ్గించడంతో పాటు, చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది.

హీట్ బాయిల్స్:
వేసవిలో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ చర్మమీద ఏర్పడే ఒక రకమైనటువంటి చర్మరంధ్రాలను, తాటిముంజలు రెగ్యులర్ గా తీసుకుంటే నివారిస్తుంది .

బ్రెస్ట్ క్యాన్సర్:
తాటిముంజల్లో ఉండే ఫైటో కెమికల్స్, ఆంతోసినిన్ శరీరంలో ట్యూమర్స్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను పెరగకుండా నిరోధిస్తుంది ఇది. ఒక ఉత్తమ మరియు గ్రేట్ హెల్త్ బెనిఫిట్.



Click it and Unblock the Notifications