Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిర్లక్ష్యం చేయకూడని 6 లివర్ డ్యామేజ్ లక్షణాలు
శరీరంలో అతి కీలకమైన అవయవం కాలేయం. ఆహారం అరగాలన్నా, తిన్నది ఒంటబట్టాలన్నా కాలేయం పనితీరు బాగుండాలి. అలాంటి కీలకావయవంలో కొవ్వు అధికంగా చేరిపోతే ఫ్యాటీలివర్ సమస్య మొదలవుతుంది. ఆ సమస్యను అలాగే నిర్లక్ష్యంగా వదిలేస్తే లివర్ సిర్రోసిస్‌గా మారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే కాలేయ సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని అంటున్నారు వైద్యులు.
లివర్(కాలేయాన్ని)శుభ్రం చేసి, ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్:క్లిక్ చేయండి
కారణాలు: కలుషితమైన నీరు తాగడం, రోజూ తినే ఆహార పదార్థాలలో మార్పు, ఆల్కాహాల్, స్మోకింగ్ తదితర దురలవాట్ల వల్ల మనలో చాలా మంది వారికి తెలియకుండానే లివర్ సంబంధిత వ్యాధులకు చేరువవుతున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య చేజేతులా కొనితెచ్చుకుంటున్నదే. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో ఫ్యాటీలివర్ సమస్య కనిపిస్తోంది. నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, చిప్స్, బర్గర్స్ వంటి జంక్‌ఫుడ్స్ తినడం, ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం, సమయపాలనలేని భోజనం, ఆహారపు అలవాట్లలో మార్పులు కాలేయవాపుకు కారణమవుతున్నాయి. డయాబెటిస్ మూలంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం కూడా ఉంది. మరి లివర్ డ్యామేజ్ అయిందని తెలిపే కొన్ని సాధారణ లక్షణాలు:
లివర్ డ్యామేజ్ కు మరికొన్ని ప్రధాన లక్షణాలు తెలుసుకోవాలంటే: క్లిక్ చేయండి

వికారం మరియు వాంతులు
అజీర్ణం, కాలేయం దెబ్బతినడంతో ఆమ్ల ప్రభావంతో తలతిరిగేటట్టు ఉండడం వంటి జీర్ణ సమస్యలు కూడా వాంతులకు దారితీస్తాయి.

ఉదరం కుడివైపున నొప్పి
కొన్ని సార్లు, కాలేయం ఇన్ఫెక్షన్ వల్ల లేదా ఎన్ లార్డ్ కావడం వల్ల పొట్ట ఉదర భాగం ఉబ్బి ఉంటుంది. ఈ పరిస్థితిని వెంటనే గమనించకపోయినట్లైతే మీ బొడ్డు చుట్టూ పొట్ట మరింత విస్తరించే అవకాశం ఉంది. పొత్తికడుపు, ప్రత్యేకంగా పొత్తికడుపు పైన కుడివైపు మూలన లేదా పక్కటేముకకు కింద కుడి భాగంలో నొప్పి ఉంటే అది కాలేయం దెబ్బతిన్న లక్షణాన్ని సూచిస్తుంది.

అజీర్ణం
మీ కాలేయం దాని పై కొవ్వు పేరుకుపోయినా లేదా కాలేయం విస్తరించినా, నీరు కూడా జీర్ణం కాలేవు. అయితే చాలా కాలం నుండి చిన్న జీర్ణ సమస్యలు ఉన్నా, తగ్గకుండా తరచూ బాధిస్తుంటే లివర్ డ్యామేజ్ లక్షణంగా గుర్తించాలి.

బలహీనత మరియు అలసట
కాలేయం వల్ల మన శరీరంలో అనే విటమిన్స్ మరియు మినిరల్స్ మన శరీర భాగాలకు అందజేస్తాయి. అలాకాకుండా జీవక్రియలు సరిగా పనిచేయకుండా పోవడం వంటి లక్షణాలు మీరు గుర్తించినట్లైతే అలసట మరియు బలహీనంగా కనబడుతారు. అటువంటప్పుడు లివర్ డ్యామేజ్ లక్షణాల్లో ఒకటిగా గుర్తించాలి.

అకస్మాత్తుగా బరువు తగ్గడం
లివర్ డ్యామేజ్ లక్షణాలు వివిధ రకాలుగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఆకలి తగ్గిపోతుంది. మీరు తీసుకొన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. కాలేయ సమస్యలు కూడా జీవక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. అటువంటప్పుడు, సడెన్ గా బరువు తగ్గడం జరగుతుంది. ఇది కూడా కాలేయ సమస్యల లక్షణాల్లో ఒకటిగా గుర్తించాలి.

చర్మం పసుపు రంగులోనికి మారడం
ఆకలి లేకపోవడం లేదా లివర్ క్యాన్సర్ వల్ల కామెర్లు కారణంగా కళ్ళు మరియు చర్మం డిస్ కలర్ ఎల్లోగా మారుతుంది. లివర్ డ్యామేజ్ వల్ల మరిన్ని ఇతర అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ వ్యాధి ముదరక ముండే మీరు సరైన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.



Click it and Unblock the Notifications