Latest Updates
-
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.?
సాఫ్ట్ డ్రింక్స్ త్రాగుతున్నారా? హెల్త్ ఎఫెక్ట్స్ గురించి తెలసుకోండి
చాలా మందికి ఒక రోజులో ఎన్ని నీళ్ళు త్రాగలనే విషయం కూడా తెలియదు. అంతే కాదు, ఏదో భోజనం చేసినప్పుడు, లేదా దాహం వేసినప్పుడు కొద్దో గొప్పో నీళ్ళు త్రాగేసి దాహం తీర్చుకుంటుంటారు. అది సరైన పద్దతి కాదు. ప్రతి మనిషి ప్రతి రోజూ కనీసం 8-12గ్లాసుల నీళ్ళు త్రాగినప్పుడే ఆరోగ్యం ఉంటారు. ప్లెయిన్ వాటర్ త్రాగాలంటే పిల్లలకే కాదు కొంత పెద్దలకు కూడా ఇష్టం ఉండదు. అదే ఏ సోడానో లేదా సాఫ్ట్ డ్రింకో త్రాగమని చెప్పండి, పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తూ త్రాగేస్తారు. సాఫ్ట్ డ్రింక్స్ అయితే ఒక గ్లాస్ ఏం కర్మ, ఎన్ని గ్లాసులు పెట్టినా చటుక్కున త్రాగేస్తారు. చాలా మంది డ్రింక్ ‘డైట్' అనుసరించే వారు సాఫ్ట్ డ్రింక్స్ లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయని అనుకుంటారు. కానీ అది నార్మల్ సోడా కంటే మరింత ఎఫెక్టివ్ అని మీకు తెలుసా?
సోడా లేదా సాఫ్ట్ డ్రింక్ ఏదైనా సరే మీ బౌల్ మూమెంట్ ను వేగవంతం చేస్తుంది. అంతే కాదు, యూరిన్ కూడా ఎల్లో కలర్ గా మార్చేస్తుంది. టాయిలెంట్ బౌల్ షైన్ కూడా మార్చేంతగా ప్రభావాన్ని చూపుతాయి. అక్కడే అంత ఉంటే, మరి పొట్ట సంగతేంటి. ఎటువంటి దుష్ప్రభావాలను చూపుతుంది?సాఫ్ట్ డ్రింక్స్ యొక్క ప్రభావాలు ఆరోగ్యానికి అసంఖ్యాకంగా ఉంటాయి. శీతలపానియాలు రెగ్యులర్ గాఎక్కువ గా సేవిస్తే మరిన్ని సమస్యలను జోడిస్తుంది.
సాఫ్ట్ డ్రింక్స్ త్రాగడం వల్ల ఆరోగ్యానికి కొన్ని హానికర ప్రభావాలు కూడా ఉన్నాయి. ఈ దుష్ప్రభావాల గురించి మీరు తెలుసుకొన్నట్లైతే ఆటోమ్యాటిక్ గా మీరు ఈ పానీయాల మీద మీకున్న మక్కువ తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన ఎంపికను మీరు ఎన్నుకోవడానకి ఇది బాగా సహాయపడుతుంది. మరి సాఫ్ట్ డ్రింక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ను ఈ క్రింది విధంగా ఉన్నాయి తెలుసుకోండి...

క్యాలరీలను పెంచుతుంది
సోడా లేదా సాఫ్ట్ డ్రింక్ లోని క్యాలరీలు మిమ్మల్ని మరింత బరువు పెరిగేలా చేస్తుంది. కాబట్టి, మీరు సోడాకు వ్యసనపరులుగా మారుంటే, మీరు వాటర్ డైట్ కు మారడానికి ఇదే మంచి సమయం.

దంతాలకు చాలా హాని చేస్తుంది
సాఫ్ట్ డ్రింక్ వల్ల మరో వరెస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే దంతక్షయం. ఎక్కువ షుగర్స్ లేదా ఎక్కువ యాసిడ్స్ ఉన్న పానీయాలు మీ దంతాలను నాశం చేస్తాయి. దంతక్షయానికి గురిచేస్తాయి. దంతాల్లో క్యాల్షియం తగ్గిపోవడం, దంతాలు పెళుసుబారడం జరుగుతుంది.

డయాబెటిస్ రిస్క్
కోక్ ను రెగ్యులర్ గా త్రాగితే అది మధుమేహానికి దారితీస్తుంది. కాబట్టి, ఇంట్లో ఎవరికి ఈ అలవాటు ఉన్నా వెంటనే మానిపించడానికి ప్రయత్నించండి.

కిడ్నీ స్టోన్స్
ఇది చివరకు క్యాల్షియం లోపంనకు దారితీసి కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది ఎసిడిక్ మరియు మినిరల్ రాడికల్ సంతులనం వల్ల ఇలా జరగుతుంది.

జీర్ణవ్యవస్థను నాశనం చేస్తుంది
కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ లో ఫాస్పోరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది . ఈ యాసిడ్ కాంపోనెంట్ హైడ్రోలిక్ యాసిడ్ ఇది పొట్టలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు మిక్స్ అవుతాయో, అది జీవక్రియల మీద ప్రభావం చూపుతుంది. దాంతో జీర్ణవ్యవస్థ అస్థవ్యస్థం అవుతుంది.

డీహైడ్రేషన్ కు కారణం
మీకు తెలసుసా? సాఫ్ట్ డ్రింక్స్ డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. సాఫ్ట్ డ్రింక్స్ లో ఉండే కెఫిన్ మరయిు షుగర్స్ డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.

ఎముకలను బలహీనంగా మార్చుతుంది
సాఫ్ట్ డ్రింక్స్ ను తరచూ తీసుకొన్నట్లైతే ఎముకలను బలహీనంగా మార్చుతుంది మరియు ఓస్ట్రియోప్రోసిస్ కు దారితీస్తుంది . పిల్లల్లో కూడా ఎముకలను బలహీనం చేస్తుంది.

కెఫిన్
కెఫిన్ అధికంగా ఉండే సాఫ్ట్ డ్రింక్స్ ను తీసుకోవడం వల్ల చిరాకు, విశ్రాంతి లేకపోవటం, ఉద్రిక్తత, అధిక రక్తపోటు, అధిక మూత్ర విసర్జన మరియు ఇతర దుష్ప్రభావలను కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications
