Latest Updates
-
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026 -
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా?
మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ ను ఎదుర్కొనే ఎక్సలెంట్ ఫుడ్స్
మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో ఒవేరియన్ క్యాన్సర్ భయంకరమైనది .ఈ రకమైన క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ కణాలు ఓవేరియన్ లో అభివృద్ది చెందుతాయి. వాటిని కనుగొనడానికి ముందుగా ఇది అడ్వస్డ్ స్టేజ్ లో ఉంటుంది. అయితే ఈ ఓవేరియన్ క్యాన్సర్ వల్ల ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ కు కష్టం అవుతుంది. ఈ క్యాన్సర్ ను సైలెంట్ కిల్లర్ గా నిపుణులు నిర్ధారిస్తున్నారు . ఒవేరియన్ క్యాన్సర్ తో బాధపడే వారి వయస్సు బట్టి, ముందుగానే కనుగొన్నట్లైతే చికిత్స అందివ్వడానికి కొన్ని టెక్నిక్స్ ను ఉపయోగిస్తున్నారు. ఈ ఒవేరియన్ క్యాన్సర్ ను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకోకుంటా దాని ప్రభావం భయంకరంగా ప్రమాధకరంగా మారుతుంది. ఈ ఆర్టికల్లో క్యాన్సర్ ను నివారించే కొన్ని ఆహారాలను పరిచయం చేస్తున్నాము. ఈ ఆహారాలు ఒవేరియన్ క్యాన్సర్ మాత్రమే కాదు, మహిళ్లల్లో వచ్చే మరే ఇతర క్యాన్సర్ అయినా, క్యాన్సర్ కణాలనైనా ఎదుర్కోవడానికి ఉత్తమ ఆహారాలుగా ఆహార నిపునులు నిర్ధారిస్తున్నారు. ఈ ఆహ్యార పదార్థాల్లో ఉండే న్యూట్రీషియన్స్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడంలో గొప్పగా సహాయపడుతున్నాయి..
ఈ మద్యన జరిపిన ఒక పరిశోధనలో రెండు కప్పులు టీ ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ ను కొంత శాతం వరకూ తగ్గిస్తుందని కనుగొన్నారు . మహిళల్లో ఒవెరియన్ క్యాన్సర్ ను నివారించడంలో టీ ఒక సింగిల్ మోస్ట్ పవర్ఫుల్ ఫుడ్ గా మరియు బెబరేజ్ గా గుర్తించారు. మరి దీనితో పాటు మరికొన్ని ఆహారపదార్థాల గురించి తెలుసుకొని మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని, క్యాన్సర్ ను దూరం చేద్దాం. ఈ క్రింది ఉదహరించిన ఆహారాలు ఒవేరియన్ క్యాన్సర్ నివారించడానికి ప్రత్యేకంగా విభజించడం జరిగినది. ఇవి క్యాన్సర్ ను నివారించే ఆహారాలుగా మరియు క్యాన్సర్ నివారించే బెస్ట్ ఫుడ్ గా విభజించి మీ కోసం తెలియపరుస్తున్నాము...
ఒవేరియన్ క్యాన్సర్ ను నివారించే బెస్ట్ ఫుడ్స్

అల్లం:
అల్లంను ఒక ఔషద మూలికగా పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇది క్యాన్సర్ నివారించే ఆహారాల్లో అత్యంత ముఖ్యమైనది. అల్లం ఒక నేచురల్ పవర్ఫుల్ రెమెడీ. ఇది క్యాన్సర్ సెల్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది . ఒవేరియన్ క్యాన్సర్ ను రాకుండా చేస్తుంది.

టీ:
ఏ రకం టీ అయినా సరే ఒవేరియన్ క్యాన్సర్ ను రాకుండా అడ్డుకొంటుందని కొన్ని పరిశోధనల ద్వారా నిరూపించబడినది. టీ త్రాగడం వల్ల 50 శాతం వరకూ క్యాన్సర్ సోకకుండా దూరం చేస్తుంది. రోజుకు రెండు కప్పుల టీ త్రాగడం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ ను దూరం చేస్తుంది.

ఆకు కూరలు:
ఆకుకూరల్లో జింక్, మెగ్నీషియ మరియు పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరం యొక్క వ్యాధినిరోధకతను పెంచుతాయి మరియు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి . క్యాన్సర్ ను నివారించడంలో ఆకు కూరలు కూడా ఒక బెస్ట్ ఫుడ్.

బ్రొకోలీ:
టాప్ హెల్తీ పుడ్స్ లో బ్రొకోలీ 3వది. బ్రొకోలీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల, ఇందులో ఉండే బ్రిలియంట్ లక్షణాలు ఒవేరియన్ క్యాన్సర్ ను రాకుండా అడ్డుపడుతుంది.

కేల:
కాలేలో శ్యాచురేటెడ్ ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో థైయమిన్, ఫొల్లెట్, పొటాషియం మరియు ఐరన్ అధికంగా ఉండటం వల్ల, ఒవేరియన్ క్యాన్సర్ ను దూరం చేయడంలో ఇది ఒక బ్రిలియంట్ ఫుడ్ అని చెప్పవచ్చు.

గుడ్లు:
ఒవేరియన్ క్యాన్సర్ ను ఎదుర్కొనడంలో విటమిన్ డి గొప్పగా సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ డి తగ్గితే, ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది . గుడ్డులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

కీరదోసకాయ:
శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడానికి ఇది ఒక ఎక్సలెంట్ ఫుడ్. ఇందులో ఉండే ప్యాంటోథెనిక్ యాసిడ్స్ క్యాన్సర్ తో పోరాడే శక్తిసామర్థ్యాలను కలిగి ఉన్నది.కీరదోసకాయలో ఇంకా మ్యాంగనీస్, పొటాషియం, విటమిన్ ఎ, మరియు విటమిన్ కెలు అధికంగా ఉన్నాయి.

క్యారెట్స్:
క్యారెట్స్ లో విటమిన్ ఎ కాకుండా విటిమన్ కె, బి6, పొటాషియం మరియు డైటరీ ఫైబర్స్ అధికంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒవేరియన్ క్యాన్సర్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

స్వీట్ పొటాటో:
స్వీట్ పొటాటోలో కెరోటినాయిడ్స్ అధింగా ఉన్నాయి. వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ గా పిలుస్తుంటారు. ఇవి ఒవేరియన్ క్యాన్సర్ ను ఎదుర్కోవడంలో అత్యంత ప్రభావంతమైనవిగా సూచిస్తున్నారు . ఇంకా స్వీట్ పొటాటోలో మెగ్నీషియం మరియు పొటాషియం మరియు మినిరల్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఇవి ఒవేరియన్ క్యాన్సర్ ను చికిత్సకు సహాయపడి క్యాన్సర్ ను నిరోధిస్తాయి.

నట్స్:
నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది క్యాన్సర్ నిరోధించే అద్భుతమైన ఆహారంగా పేర్కొంటున్నారు.



Click it and Unblock the Notifications