Latest Updates
-
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి
పొట్ట సమస్యలన్నింటిని నివారించే బెస్ట్ గ్రీన్ టీ
మార్కెట్లో ‘టీ' లలో ఒక ఉత్తమమైన ‘టీ', ‘గ్రీన్ టీ'. ప్రతి రోజూ టీని తీసుకొనే వారు కొన్ని వేలలో ఉంటారు. గ్రీన్ టీ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత బ్లాక్ టీ మరియు మిల్క్ టీ కొంచెం వెనుకబడిపోయాయి. ఎవరైతే గ్రీన్ టీను రెగ్యులర్ గా రొటీన్ గా తీసుకుంటారో వారు, గ్రీన్ టీ త్రాగని వారి కంటే ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు.
కొన్ని పరిశోధన ద్వారా, బరువు తగ్గడానికి, క్యాన్సర్ నివారించడానికి మరియు శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా పనిచేయడానికి గ్రీన్ టీ చాలా సహాయపడుతుందని కనుగొనబడింది. వీటన్నిటితో పాటు, గ్రీన్ టీ, ప్రత్యేకంగా పొట్ట సమస్యలను ఎలా నివారిస్తుందని తెలుసుకోవడానికి బోల్డ్ స్కై మీకు ఈరోజు ఈ వ్యాసంను అంధిస్తోంది. కాబట్టి, మీరు ఎవైనా పొట్ట సంబంధిత ఇన్ఫెక్షన్స్ కు గురియైనప్పుడు లేదా పొట్ట సమస్యలున్నప్పుడు, గ్రీన్ టీ తప్పకుండా సహాయపడుతుంది.
గ్రీన్ టీలోని టాప్ 10 హెల్త్ & బ్యూటీ బెనిఫిట్స్:క్లిక్ చేయండి
పొట్టలోని పెద్ద ప్రేగులోని చెడు బ్యాక్టీరియాను ఎదుర్కొనే మంచి బ్యాక్టీరియా గ్రీన్ టీలో ఉన్నాయి. ఇవి పొట్టలో ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా నివారిస్తుంది. కాబట్టి, ప్రతి రోజూ రెగ్యులర్ గా మీరు రెండు కప్పుల గ్రీన్ టీని త్రాగాలి . ప్రతి రోజూ ఉదయం పరగడపున గోరువెచ్చని గ్రీన్ టీకి, కొద్దిగా తేనె మిక్స్ చేసుకొని గ్రీన్ టీ త్రాగడం మరియు మరో కప్పు సాయంత్రం కూడా గ్రీన్ టీ త్రాగడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది.
గ్రీన్ టీ తప్పనిసరిగా తాగడానికి గల 10 ఖచ్ఛితమైన కారణాలు..!
గ్రీన్ టీ త్రాగడం వల్ల పొట్ట సమస్యలను ఎలా నివారించుకోవచ్చు విషయంను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

కడుపు నొప్పిని నివారించే గ్రీన్ టీ
కడుపు నొప్పిగా ఉన్నప్పుడు, మిల్క్ టీకి బదులుగా గ్రీన్ టీని తీసుకోవడం వల్ల ఇది కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. గ్రీన్ టీలో చిటికెడు అల్లంను చేర్చుకుంటే, ఇది చాలా ఉత్తమంగా పనిచేస్తుంది.

కడుపు అల్సర్ నివారణకు గ్రీన్ టీ
స్టొమక్ అల్సర్ తో బాధపడుతున్నప్పుుడు చాలా మంది గ్రీన్ టీని దూరంగా పెడుతుంటారు. అయితే, స్టొమక్ అల్సర్ ఉన్నప్పుడు, వేడిగా ఉన్న గ్రీన్ టీ తెలుసుకోవడానికి బదులుగా, చల్లని గ్రీట్ టీ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్టొమక్ అల్సర్ ను తగ్గిస్తుంది.

స్టొమక్ అప్ సెట్
స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు, సమస్యను నివారించుకోవడానికి ఒక కప్పు వేడిగా ఉండే గ్రీన్ టీలో కొద్దిగా నిమ్మరసం లేదా దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసుకొని తీసుకోవడం మంచిది. ఈ కాంబినేషన్ లో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల స్టొమక్ అప్ సెట్ ను నివారిస్తుంది.

స్టొమక్ ఫ్లూ
ఇతర టీలతో పోల్చితే గ్రీన్ టీలో సహజ ప్రోబయోటిక్స్ కలిగి ఉంది. అందువలన, స్టొమక్ ఫ్లూ తో బాధపడుతుంటే, స్టొమక్ ఫ్లూకు కారణం అయ్యే చెడు బ్యాక్టీరియాతో పోరాడటానికి ఒక కప్పు వేడి వేడి గ్రీన్ టీని తీసుకోవడం ఉత్తమం.

స్టొమక్ ఇన్ఫ్లమేషన్
గ్రీన్ టీని ఒక ఉత్తమ నేచురల్ టీగా నిర్ధారించారు. స్టొమక్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఇది ఉత్తమంగా పనిచేస్తుందని నిర్ధారించారు. స్టొమక్ ఇన్ఫ్లమేషన్ తో బాధపడే వారు ఒక కప్పు గ్రీన్ టీలో రెండు చెంచాలా పుదీనా ఆకులను వేసి తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

స్టొమక్ క్రాంమ్స్
పొట్టలో తిమ్మిర్లుగా ఉండటం, పీరియడ్స్ సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో గ్రీన్ టీ కొంత రిలీఫ్ ను అంధిస్తుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పీరియడ్స్ సమయంలో కోలన్ ను శుభ్రం చేస్తుంది.

కడుపు ఉబ్బరం
కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, ఒకకప్పు గ్రీన్ టీలో కొద్దిగా పుదీనా వేసుకొని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంను తగ్గిస్తుంది. పొట్టలో గ్యాస్ ను తగ్గించుకోవడానికి ప్రతి రోజూ ఉదయం, పరకడుపున ఒక కప్పు గ్రీన్ టీ తీసుకొని పొట్ట సంబంధిత సమస్యలను నివారించుకోండి.



Click it and Unblock the Notifications











