ఎండవేడిమి, వడదెబ్బ తట్టకోవడానికి టాప్ 12 సమ్మర్ డ్రింక్స్

వేసవి కాలం అంటే అందరికీ భయమే ఎందుకంటే చర్మడీహైడ్రేషన్ కు గురియై, చర్మంలో నీరంత ఇంకిపోయి, చర్మం నిర్జీవంగా మారడమే కాదు, శరీరం కూడా శక్తిలేకుండా నీరసంగా కనిపించడం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వేసవి వస్తోందంటే.. నీరసం కమ్ముకు వస్తోందన్న మాటే! తొందరగా అలసిపోవడం దగ్గరి నుంచి ప్రాణాంతకమైన డయేరియా వంటి వ్యాధుల వరకు వేసవి కాలంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అనేకమందిని మనం నిత్యం చూస్తుంటాం.

READ MORE: ఎండవేడిమి, వడదెబ్బ తట్టకోవడానికి టాప్ 12 సమ్మర్ డ్రింక్స్

వేసవికాలంలో సహజంగానే మనకు చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. చెమట రూపంలో శరీరంలోని నీరు మొత్తం బయటకు పోతుంటుంది. ఈ నీటితో పాటూ మన శరీరంలో ఉం డే ఎలక్ట్రొలైట్స్‌, సోడియం, పొటాషియం లాంటి లవణాలు అన్నీ వెలుపలికి వెళ్లిపోతాయి. శరీరంలో ఆరోగ్య పరంగా సమతుల్యత పాటించాలంటే మనం వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం ఒక్కటే మార్గం. అయితే వీటన్నిటినీ భర్తీ చేయడానికి శరీరానికి తగినన్ని మంచినీళ్లు వీటితో పాటు కొన్ని పళ్ళ రసాలు తీసుకోవడం ఒక్కటే ప్రత్యామ్నాయం. వేసవి రాగానే చల్లని పానీయాల వైపు మనసు మళ్ళుతుంది. శీతల పానీయాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఈ క్రింది సహజ పోషకాలు ఇచ్చే పానీయాలను సేవిద్దాము.

కొబ్బరినీరు:

కొబ్బరినీరు:

రకృతి ప్రసాధించిన శీతల పానీయం. ఎండ వల్ల నల్లగా మారి కమిలిన చర్మానికి కొబ్బరి, కొబ్బరి నీళ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి. కుదుళ్లను బలంగా మార్చడంలో కొబ్బరి పాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దప్పిక తీరిపోతుంది. అలసట గాలికెగిరిపోతుంది. జీర్ణశక్తిని పెంచడం మొదలుకొని మూత్రపిండాల్ని శుభ్రం చేయడం దాకా..బోలెడన్ని ఆరోగ్య సేవలు అందిస్తుంది. కొబ్బరి నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే డీహైడ్రేషన్ సమస్య ఉండదు. బయటినుంచి వచ్చాక ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొబ్బరినీటితో ముఖం కడుక్కుంటే.. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తాజాదనాన్ని పొందుతుంది. కొబ్బరి నీటిలో దూదిని ముంచి రాసుకున్నా తేడా కనిపిస్తుంది. ఇందులో 5 కీలక electrolights పొటాషియం,మెగ్నీషియం,ఫాస్పరస్,సోడియం,కాల్షియంలను కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచును.

మజ్జిగ:

మజ్జిగ:

ఇందులో ఆరోగ్యకరమైన బాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. పోషక విలువలు, విటమిన్ల తయారీలో ఇది ఉపయోగపడుతుంది. మజ్జిగ జీర్ణశక్తిని ఇస్తుంది. జావ, కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, జీలకర్ర నీళ్ళు వంటివి కూడా శరీరంలోని వేడిని తగ్గించే దివ్వమైనటువంటి పానియం. దీనిలోని ల్యాక్టోబాసిల్లస్ అనే మిత్ర కారక బ్యాక్టీరియా వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగును.ఇందులోని ల్యాక్టి కామ్లం పదార్థాలను త్వరగా జీర్ణం చేయును.ఇందులో పొటాషియం,క్యాల్షియం,రైబోఫెవిన్ ,విటమిన్ B-12 లభిస్తాయి.

సబ్జా నీరు:

సబ్జా నీరు:

మహిళలకు అవసర మయ్యె పాలేట్,నియాసిన్,చర్మాన్నిఅందంగా ఉంచే విటమిన్ ఇ అధికంగా కలిగి ఉండటం వలన శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ది చేస్తుంది.మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

పుచ్చకాయ :

పుచ్చకాయ :

గుండెజబ్బులు రాకుండా చేసే పొటాషియం సమృద్ధిగా ఉంటుంది.విటమిన్ A ఎక్కువగా ఉంటుంది.ఇందులో ఉండే LYKOPIN సూర్యరశ్మి లోని U.V కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. పుచ్చకాయ రసంతో అల్లం మిళితం : పది కప్పుల పుచ్చకాయ గుజ్జు, కప్పు చెక్కు తీసిన అల్లం ముక్కలు మిక్సర్‌లో లేదా జ్యూస్‌ ఎక్స్‌ట్రాక్టర్‌లో వేసి రసం తీయాలి. చల్లదనం కోసం కొన్ని నిమిషాలు ఫ్రిజ్‌లో వుంచి త్రాగాలి. ఈ రసం వల్ల, జీర్ణక్రియ ఉత్తేజం అవతుంది. రక్తవృద్ధితో, హెమోగ్లోబిన్‌ పెరుగుతుంది. కిడ్నీ, గుండెలకు మంచిది, తగిన నీటి శాతాన్ని కల్పిస్తుంది. అల్లం రసం వల్ల జీర్ణక్రియ సజావుగా ఉంటుంది. శ్వాససంబంధసమస్యలుండవు.

తాటి ముంజలు :

తాటి ముంజలు :

6 అరటి పండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది బి.పి ని అదుపులో ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఎముకలను బలంగా ఉంచుతుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తాటి ముంజను తొలవగానే మధ్యలో కొంత నీరు ఉంటుంది. ఆ నీరు మాత్రం నోరూరించే రుచిగా ఉంటుంది. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. తాటి ముంజ మనిషికి ఎంతో మేలు చేస్తుంది. మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఎండాకాలం ఈ తాటి ముంజల్లో నీళ్లు చాలా చలువ చేస్తాయి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మలో విటమిన్ సి అపారం. నిమ్మ ఆరోగ్య ప్రదాయని. 100 గ్రాముల నిమ్మపండు నుంచి 40 కేలరీల శక్తి లభిస్తుంది. నిమ్మలోని పోషక విలువలు మెదడు చురుకుగా పనిచేయడానికి, దంతాలు ఎముకలు పటిష్టంగా పని చేయడానికి ఎంతగానో సహకరిస్తాయి. రోజూ నాలుగుసార్లు నిమ్మరసం తాగితే పచ్చ కామెర్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది. వేడి నీటిలో నిమ్మరసం పిండి తాగినట్టయితే ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తిని ఇస్తుంది. ఎండ వేడిమి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఆకలిని పెంచుతుంది. జీర్ణశక్తిని పెంచతుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. పానీయంగానూ ఆస్వాదిస్తుంది.సిట్రిక్ ఆసిడ్ మూత్ర పిండాలలోని రాళ్ళను కరగదీస్తుంది.

చెరుకు రసం:

చెరుకు రసం:

ఇందులో ఐరన్ ,ఫాస్పరస్ క్యాల్షియం ,మెగ్నీషియం పొటాషియం మూలకాలుంటాయి .ఇవి రొమ్ము ,ప్రోస్టేట్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.మూత్ర పిండాలు గుండె,మెదడుల పనితీరుని మెరుగు పరుస్తాయి.

రాగి జావ/రాగి మాల్ట్:

రాగి జావ/రాగి మాల్ట్:

ఇది acidity ని తగ్గిస్తుంది. రాగులపొడి జావలో పాలుకానీ, ఉప్పు, మజ్జిగకానీ కలిపి ఫ్రిజ్లో భద్రపరచుకోవాలి. ఎండ సమయంలో దాన్ని తాగితే వేడి చేయకుండా వుంటుంది. పౌష్టికాహారంగా కూడా పనిచేస్తుంది. రాగి మాల్డ్‌ మార్కెట్లో రాగి పిండి చౌకగా లభిస్తుంది. లేకుంటే రాగులను పిండి పట్టించి వుంచుకుని ప్రతి రోజూ మాల్ట్ (జావ) గా కాచి, వినియోగించుకోవచ్చు. కప్పు రాగి పిండి రెండు, మూడు కప్పుల నీరు కలిపి వేడి చేసి, దానిలో రెండు స్పూన్‌ల పంచదార, ఒక ఏలక్కాయ పొడి కలిపి, చల్లగాను, కొంచెం వేడిగానూ సేవించవచ్చు. రాగి మాల్ట్ ను ప్రతి రోజూ సేవించడం వల్ల, శరీరానికి ధాతుపుష్టి కలగడమే కాక, శరీరంలోని అదనపు వేడిని హరిస్తుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా హుషారుగా వుంచుతుంది.

నీళ్ళు:

నీళ్ళు:

వేసవికి మందు మంచినీళ్లే. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. జీవనశైలిని బట్టి ఆ మోతాదును పెంచుకోవచ్చు. నీరు, చర్మం లోని తేమను కాపాడుతుంది. కాలుష్యాన్ని బయటికి పంపుతుంది. రక్తాన్ని శుద్దిచేస్తుంది. బయటికివెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నీళ్లుతీసుకెళ్లడం మంచిది. వేసవిలో దాహంగా అనిపించేదాకా ఆగక్కర్లేదు. తీరికి దొరికినప్పుడుల్లా గొంతు తడుపుకోవడమే మంచిది.

మ్యాంగో జ్యూస్:

మ్యాంగో జ్యూస్:

మామిడి ఫలాల్లో రారాజు. వేసవిలో విరివిగా లభించే మామిడి పండుతో రుచిలో కానీ వైవిధ్యంలో కాని సాగి వచ్చే పండు మరోటి లేదు. ఒక గ్లాసు మామిడి పండు రసంలో కొంచెం తేనె కలిపి తగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మామిడి పండు తినడం వల్ల చూపు కూడా బాగుంటుంది. చర్మానికి మెరుపు కూడా వస్తుంది. మామిడి జీర్ణశక్తికీ ఎంతో సహకరిస్తుంది.

ఈ పానీయాలను సేవించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు .

క్యారెట్ జ్యూస్:

క్యారెట్ జ్యూస్:

వేసవికాలంలో క్యారెట్ తినడానికి కొంతమంది పిల్లలు ఇష్టపపడరు. అటువంటప్పుడు క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలు చేసి మెత్తగా గ్రైండ్ చేసి పాలు, చక్కర వేసి జూస్ లా తయారు చేసుకోవచ్చు. దాంట్లో రెండు యాలకుల పొడివేస్తే పిల్లలు మారాం చేయకుండా ఇష్టంగా తాగుతారు.

ఆరెంజ్ లేదా బత్తాయి జ్యూస్:

ఆరెంజ్ లేదా బత్తాయి జ్యూస్:

నారింజలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. నారింజ జ్యూస్‌ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.

Desktop Bottom Promotion