Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
మీ సెక్స్ జీవితాన్ని నాశనం చేసే 6 ఆరోగ్యం సమస్యలు
మీరు ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు సెక్స్ అనేది మీ మనస్సులో మొదటి విషయంగా ఉండకపోవచ్చు. కానీ సుదీర్ఘ కాలం మీ చుట్టూ ఆరోగ్య సమస్యలు ఉంటే,మీ సెక్స్ జీవితం మీద పడే వాటి ప్రభావాల గురించి తెలుసుకోవాలి. కొన్ని దీర్ఘకాల పరిస్థితులు మీ సెక్స్ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ అత్యంత సాధారణ జాబితా ఉంది.

డయాబెటిస్
రక్తంలో నియంత్రణ లేని చక్కెర స్థాయిలు చాలా సమస్యలకు దారితీస్తాయి. దానిలో లైంగిక అసమర్థత అనేది ఒకటి. గణాంకాల ప్రకారం మధుమేహం కలిగిన పురుషులలో 60-70% మంది అంగస్తంభన సమస్యలను కలిగి ఉంటున్నారు. మధుమేహం అనేది పురుషాంగం యొక్క రక్త ప్రవాహం మీద ప్రభావితం చేస్తుంది. అదనంగా, మధుమేహం నరాల సంబంధిత సమస్యలకు కూడా కారణమవుతుంది. ఫలితంగా, అంగస్తంభనను నియంత్రించడంలో నరములు తగిన సంకేతాలను అందుకోవు.

డిప్రెషన్
ఒక ఆరోగ్యకరమైన సెక్స్ జీవితంను ఆనందించటానికి,మీరు లైంగిక కోరిక కలిగి ఉండాలి. అన్ని కోరికలు మెదడు నుండి పుడతాయి. లైంగిక కోరికను నియంత్రించే మెదడు సిగ్నలింగ్ విధానంలో ఏదైనా తప్పు జరిగితే,అప్పుడు మీరు లైంగిక అసమర్థతను ఎదుర్కొనవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి మరియు క్లినికల్ మాంద్యం ఎదుర్కొనే వ్యక్తులలో ఈ విధంగా జరుగుతుంది. దీనిని అదికమించటానికి డిప్రెషన్ కి సూచించిన కొన్ని యాంటిడిప్రెసెంట్స్ కూడా లైంగిక కోరికలు మరియు ఉద్రేకం ను తగ్గిస్తాయి.

వాస్కులర్ వ్యాధులు
జననేంద్రియ ప్రాంతంలో రక్త ప్రవాహం సంకర్షణ మరియు ఒక ఆరోగ్యకరమైన సెక్స్ జీవితంలో సంకర్షణకు సంబంధించి రుగ్మత అనేవి లైంగిక అసమర్థతకు దారితీస్తాయి. అందువలన, రక్తపోటు వంటి రక్త నాళాలు సంబంధించిన వ్యాధులు మరియు ధమనుల యొక్క గట్టిపడి రక్త ప్రవాహం మీద ప్రభావితం చేయవచ్చు. వీటి వలన పురుషుల్లో అంగస్తంభన మరియు మహిళల్లో తగినంత సరళత లేకపోవటం జరుగుతుంది.

వెన్నునొప్పి
వెన్నునొప్పి నేరుగా మీ లైంగిక చర్య మీద ప్రభావితం చేయదు. కానీ పరోక్షంగా సెక్స్ ని తగ్గించే ఫ్రీక్వెన్సీ కి తోడ్పడే ప్రధాన సమస్యలలో ఒకటి. హీర్నితేడ్ డిస్క్ మరియు స్పైనల్ స్టెనోసిస్ వంటి వెన్నెముక సమస్యలు నిజంగా బాధాకరముగా ఉంటాయి. సెక్స్ లో మీ సామర్థ్యాన్ని గొప్పగా అడ్డుకొంటాయి. ఒక సర్వే ప్రకారం ఈ నొప్పితో బాధపడేవారు 61% మంది లైంగిక వాంఛ తగ్గిందని వెల్లడించారు. కాబట్టి, మీ వెన్నునొప్పి ప్రారంభ దశలో ఉన్నప్పుడు పెద్ద సమస్యను సూచించదు. మీ వెన్నుముక మంచి చురుకుగా మరియు అనువుగా ఉండటానికి యోగా లేదా వ్యాయామం చేయాలి.

రక్తహీనత
రక్తహీనత మీ శృంగార జీవితంలో పెద్ద సమస్యగా ఉండకపోవచ్చు. కానీ అది బలహీనతకు కారణం మరియు మీ లైంగిక భావాలను తగ్గిస్తుంది. పురుషుల్లో రక్తహీనత వలన లైంగిక కోరిక తగ్గుతుంది. అలాగే అంగస్తంభన సమస్యలకు దారితీస్తుంది. ఇతర సమస్యలు పోలిస్తే,దీనిని జీవనశైలిలో చిన్న మార్పులు చేయటం ద్వారా సులభంగా సరి చేయవచ్చు.

మెనోపాజ్
మహిళలలో లైంగిక కోరిక నిర్వహించడానికి హార్మోన్ల మార్పులు మరియు నియంత్రణ అనేవి ముఖ్యమైనవి. మెనోపాజ్ సమయంలో హార్మోన్ల స్థాయిలలో మార్పులు వలన లైంగిక కోరికలు లేకపోవటం వంటి సమస్యలు నాటకీయంగా ప్రారంభం అవుతాయి. లైంగిక కార్యకలాపాలలో చురుకుదనం తగ్గుతుంది. అలాగే సెక్స్ సమయంలో నొప్పి పెరుగుతుంది. అయితే ఈ సమస్యలను సరైన కౌన్సిలింగ్ మరియు చికిత్సతో పరిష్కరించవచ్చు.



Click it and Unblock the Notifications
