స్వైన్ ఫ్లూ నివారించడానికి 10 అత్యుత్తమ హోం రెమెడీస్

By Super

సాదారణంగా స్వైన్ ఇన్ఫ్లుఎంజా(దీనిని స్వైన్ ఫ్లూ అని కూడా పిలుస్తారు) పందుల శ్వాశకోశ నాళము మీద ఇంఫెక్ట్ చేసే ఇన్ఫ్లుఎంజా వైరస్లు వలన వచ్చే శ్వాసకోశ వ్యాధి. ఈ వైరస్లు పరివర్తనం చెందే సామర్థ్యం కలిగి ఉండి, సులభంగా మానవులు మధ్య వ్యాపి చెందుతాయి. ఆవి మానవులలో దగ్గు,ఆయాసం,వికారం, వాంతులు,జ్వరం,డయేరియా,శరీరం నొప్పులు వంటి లక్షణాలకు కారణమవతాయి.

ఆయుర్వేద వైద్య పద్ధతిలో, స్వైన్ ఫ్లూ ను వాత కఫా జ్వరంగా సూచిస్తారు. దీనిలో వాత(గాలి)మరియు కఫా (నీరు) ఉధృతం కలుగుతుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థ మీద దాడి చేసి,గాలి మార్గం చానెల్స్ అడ్డుకోవటం వలన దగ్గు,వికారం,శరీరం నొప్పులు వంటి సంబంధం లక్షణాలకు దారితీస్తుంది.

ఇక్కడ మీరు స్వైన్ ఫ్లూతో సహా ఏ రకమైన ఫ్లూ వైరస్ లను అధిగమించేందుకు కొన్ని సులభ దశలు ఉన్నాయి. అన్ని దశలను ఒకేసారి అనుసరించవలసిన అవసరం లేదు. మీకు సరిపోయే విధంగా ఉత్తమమైన వాటిని ఎంచుకొని నివారణల కలయికలను పాటించవచ్చు. అయినప్పటికీ, మీరు ఇప్పటికే ఫ్లూతో బాధపడుతూ ఉంటే, ఈ చర్యలు ఒక మేరకు మాత్రమే సహాయపడతాయి. మీరు H1N1 సోకి ఉంటే, ఆసుపత్రికి వెళ్ళటం మరియు ఏకాంత నిర్బంధంలో ఉండటం తప్పనిసరి.

తులసి ఆకులు

తులసి ఆకులు

ప్రతి రోజు ఉదయం ఐదు తులసి ఆకులను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తులసి అధిక సంఖ్యలో చికిత్సా లక్షణాలను కలిగి ఉంది. ఇది గొంతు మరియు ఊపిరితిత్తులను క్లియర్ గా ఉంచుతుంది. అలాగే మీ రోగనిరోధక శక్తిని బలపరచి అంటువ్యాధులు రాకుండా సహాయపడుతుంది.

గిలొఐ

గిలొఐ

దీనిని వైద్యపరంగా టినోస్పోర కార్డిఫోలియా అని అంటారు. సాధారణంగా ఈ మొక్క అనేక ప్రాంతాలలో అందుబాటులో ఉంటుంది. ఒక అడుగు పొడవు గల గిలొఐ కొమ్మ మరియు 5-6 తులసి ఆకులను తీసుకొని 15-20 నిమిషాలు నీటిలో మరిగిస్తే, అప్పుడు దాని మొత్తం లక్షణాలు సేకరించవచ్చు. రుచి కోసం దానిలో నల్ల మిరియాలు,సైంధవ లవణం(ఉప్పు),మిస్రి కలపండి. ఎక్కువ చల్లగా కాకుండా ఎక్కువ వేడిగా కాకుండా తాగాలి. ఇది మీ రోగనిరోధక శక్తి కొరకు అద్భుతంగా పనిచేస్తుంది.ఈ మొక్క అందుబాటులో లేకపోతే, హందార్ద్ లేదా ప్రోసెస్ చేసిన గిలొఐ పొడిని పొందవచ్చు. ఈ కషాయంను రోజుకి ఒకసారి త్రాగాలి.

కర్పూరం

కర్పూరం

ఒక టాబ్లెట్ అంత పరిమాణం కలిగి ఉన్న కర్పూరంను నెలలో ఒక్క సారి కాని రెండు సార్లు కాని తీసుకోవాలి. దీనిని పెద్ద వాళ్ళు నీటితో పాటు మింగవచ్చు. పిల్లలు మాత్రం బంగాళదుంపల గుజ్జుతో లేదా అరటితో పాటు తీసుకోవాలి ఎందుకంటే పిల్లలు దీనిని తీసుకోవటానికి కష్టపడతారు. మీరు గుర్తుంచుకోవలసి విషయం ఏమిటంటే కర్పూరాన్ని ప్రతిరోజు తీసుకోకూడదు. కానీ ప్రతి సీజన్లో ఒకసారి లేదా నెలకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి.

 వెల్లుల్లి

వెల్లుల్లి

ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను గోరు వెచ్చని నీటితో పాటు మింగాలి. వెల్లుల్లి కుడా మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

 గోరు వెచ్చని పాలు

గోరు వెచ్చని పాలు

పాల అలెర్జీ లేని వారు, ప్రతి రోజు రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో పసుపును కలుపుకొని త్రాగాలి.

కలబంద

కలబంద

సాధారణంగా కలబంద అనేది అందరికి అందుబాటులో ఉండే వృక్షం. ఇది దట్టంగా మరియు పొడవుగా ఉంటుంది. కాక్టస్ వంటి ఆకులను కలిగి, వాసన లేని జెల్ ఉంటుంది. ప్రతిరోజూ ఒక టీ స్పూన్ జెల్ నీటిలో కలుపుకొని త్రాగితే మన చర్మం మరియు కీళ్ళ నొప్పుల మీద అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాక రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
వేప

వేప

వేపలో ప్రత్యేకమైన గాలి శుద్ధి లక్షణాలు ఉంటాయి. అన్ని రకాల ఫ్లూ లతో సహా, గాలి ద్వారా వచ్చే అన్ని రకాల వ్యాధుల ఉపశమనంనకు సహాయం చేస్తుంది. ప్రతి రోజు 3-5 తాజా వేప ఆకులను నమిలితే రక్తం శుద్ది అవుతుంది.

 ప్రతి రోజు ప్రాణాయామం చేయండి

ప్రతి రోజు ప్రాణాయామం చేయండి

ప్రతి రోజు ప్రాణాయామం చేయండి. ప్రతి రోజు ఉదయం రెగ్యులర్ గా జాగింగ్ లేదా వాకింగ్ చేస్తే గొంతు మరియు ఊపిరితిత్తులను మంచి స్థితిలో ఉంచటానికి సహాయం చేస్తుంది. ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తుల మీద దాడి చేయకుండా మరియు అన్ని వ్యాధులకు వ్యతిరేకంగా మీ శరీరం యొక్క ప్రతిఘటన అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాక మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది.

 విటమిన్ సి

విటమిన్ సి

సిట్రస్ పండ్లు,ముఖ్యంగా విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆమ్లా (భారత ఉన్నత జాతి పండు రకము) రసంను తీసుకోవాలి.తాజా ఆమ్లా(మరో మూడు,నాలుగు నెలలు) మార్కెట్ లో ఇంకా అందుబాటులో ఉంటుంది. సాదారణంగా ఈ రోజుల్లో అందుబాటులో ఉండే ప్యాక్ ఆమ్లా రసం కొనుగోలు చేయటం ఒక చెడు ఆలోచన కాదు.

పరిశుభ్రత

పరిశుభ్రత

ప్రతి రోజు మీ చేతులను 15-20 సెకన్ల పాటు సబ్బు మరియు వేడి నీటితో తరచుగా కడగాలి. ముఖ్యంగా భోజనం ముందు, ఒక తలుపు హ్యాండిల్ లేదా ఒక నాబ్ వంటి ఫ్లూ వైరస్ తో కలుషితమైనదని అనుమానం ఉన్న ఉపరితలంను తాకిన ప్రతిసారీ కడుక్కోవాలి. ముఖ్యంగా మీరు ఒక బహిరంగ ప్రదేశం నుండి వచ్చిన తర్వాత లేదా ప్రజా రవాణా ఉపయోగించిన తర్వాత శుభ్రంగా చేతులను కడుక్కోవాలి.

Story first published: Thursday, February 5, 2015, 19:01 [IST]
Desktop Bottom Promotion