Latest Updates
-
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
పొట్టలో క్యాన్సర్(కొలరెక్టల్ క్యాన్సర్) లక్షణాలు గుర్తించడం ఎలా...?
కాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉన్నది. అయినా గర్భాశయం, రొమ్ము, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. పెద్ద పేగు భాగంలో కణితులు ఏర్పడితే కొలెరెక్టల్ క్యాన్సర్‌గా చెబుతారు. క్రమంగా లేని ఆహారపు అలవాట్లు, అనారోగ్య జీవన శైలితో ఇటువంటి క్యాన్సర్ వస్తుందని చెబుతారు. ఎక్కువ వయస్సు వారికి ఇది వచ్చే చాన్సు ఎక్కువ. అధికంగా మాంసం తినటం, అధికంగా ఆల్కహాల్ తీసుకోవటం వంటివి దీనికి దారి తీయవచ్చు.
పురీషనాళ, పెద్దపేగు (కొలెరెక్టల్) క్యాన్సర్. దీనిని చాలావరకు నివారించే అవకాశం ఉన్నప్పటికీ ఎంతోమంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటం విషాదం. మొత్తం క్యాన్సర్ల మరణాల్లో కొలరెక్టల్ క్యాన్సర్ మూడో ప్రధాన కారణంగా నిలుస్తుందంటే దీనిపై అవగాహన లేమి ఏమేరకు ఉందో అర్థమవుతుంది. కొలరెక్టల్ క్యాన్సర్ ను ప్రారంభంలోనే గుర్తించినట్లైతే వెంటనే ట్రీట్మెంట్ తీసుకొన్నట్లైతే క్యాన్సర్ బారీ నుండి బయట పడవచ్చు.
read more: సూపర్ ఫుడ్స్ : క్యాన్సర్ తో పోరాడుతాయి మరియు నివారిస్తాయి
కొలరెక్టల్ క్యాన్సర్ గురించి ముందుగానే అవగాహన కల్పించుకోవడం వల్ల సాధ్యమైనంత వరకూ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు . కొలరెక్టల్ క్యాన్సర్ ను గల లక్షణాలును గుర్తించి, తగిన జాగ్రత్తలు, మందులను వాడటం ద్వారా క్యాన్సర్ ముప్పు నుండి బయటపడవచ్చు . ఎంత ప్రమాదకరమైనదైనా.. ఈ క్యాన్సర్‌ను చిన్నపాటి జీవనశైలి మార్పులతోనే సమర్థంగా నివారించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు . దానికి ముందుగా కొలరెక్టల్ క్యాన్సర్ కు గల కొన్ని సహజ లక్షణాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం....

బౌల్ మూమెంట్లో మార్పులు:
కొలరెక్టల్ క్యాన్సర్ కు ముఖ్య కారణం బౌల్ మూమెంట్ యొక్క నార్మల్ ప్యాట్రన్ లో మార్పులు వస్తాయి . అది తరచూ విసర్జనకు కారణం కాడం లేదా డయోరియా వంటి లక్షణాలు కనబడుతాయి. మరియు మలం పూర్తిగా విసర్జించనట్లుగా అనిపిస్తుంటుంది.

రెక్టల్ బ్లీడింగ్ :
బౌల్ ఫంక్షనింగ్ లో చికాకు కలిగించడంలో మరియు రెక్టల్ క్రాంపింగ్ మరియు రెక్టమ్ నుండి బ్లీడింగ్ అవ్వడం వంటి లక్షణాలు బయటపడుతాయి . ఇది స్టూల్(మల)విసర్జన ప్రారంభదశలో కనబడుతుంది. ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. పైల్ ఏమో అన్న అపోహతో సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోకూడదు.

పెన్సిల్ స్టూల్:
కొలరెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు సాధారణంగా కంటే న్యారో మార్గంగా స్టూల్ విసర్జించడం జరగుతుంది .పెద్దప్రేగు యొక్క డయామీటర్ న్యారోలాగా తయారవుతుంది. అది న్యారో స్టూల్ కు కారణం అవుతుంది . కొలరెక్టల్ క్యాన్సర్ కు ఇది చాలా సహజమైన లక్షణంగా గుర్తిస్తారు.

పొట్టనొప్పి:
సహజంగా పొట్ట ఉదరభాగంలో చాలా సహజమైన నొప్పిని, క్రాంప్ ను లక్షణాలు కలిగి ఉంటాయి. పొట్టఉదరంలో వచ్చే నొప్పి, వ్యాధులను గుర్తించడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి, ఒకసారి టెస్ట్ చేయించుకొని కొలరెక్టల్ క్యాన్సర్ పరీక్షను చేయించి నిర్ధారించుకోవాలి.

చాలా త్వరగా బరువు తగ్గడం:
కొలరెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు సెడన్ గా తిన్న ఆహారం గ్రహించడం కష్టం అవుతుంది. దాంతో సెడన్ గా బరుతు తగ్గడం జరుగుతుంది . దాంతో పాటు, అలసటకు గురిఅవుతుంటారు.

రక్తహీనత:
కొలరెక్టల్ క్యాన్సర్ కు మరో లక్షణం రక్తహీనతకు గురి అవ్వడం . ఇది ఒక సాధారణ లక్షణం. కాబట్టి, వ్యాధిని నిర్ధారించిన తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ ను అందిస్తారు.

జలోదరం:
పొట్ట ఉదరంలో నీరు చేరడం లేదా వ్రుద్ది చెందడం జరుగుతుంది . కొలరెక్టల్ క్యాన్సర్ కు ఇది ఒక వార్నింగ్ సిమ్టమ్ గా గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవాలి.

కణతులు:
చేతితో తడిమి చూసినప్పుడు కణాతులు తగలవచ్చు. నీరసం, నిస్ర్తాణ పెరిగిపోతాయి ఈ లక్షణాలతో పాటు కొన్ని సార్లు కామెర్లు, కాలేయవాహిక ఇన్‌ఫెక్షన్ వంటివి కలిసి కనిపిస్తుంటాయి.

వాంతులు:
అప్పుడప్పుడు వాంతులు అవుతాయి. ఇందులో రక్తం పడవచ్చు. బరువు తగ్గిపోవటాన్ని ప్రధానంగా చెబుతారు.

గొంతులో ఇబ్బందులు:
ఆహారం మింగటంలో ఇబ్బంది, ఏమీ తినకుండానే కడుపు నిండుగా ఉంటుంది, కొద్ది పాటి ఆహారం తిన్నా కానీ నొప్పి వస్తుంటుంది. అజీర్తిగా ఉండటం గమనించవచ్చు. గుండెల్లో మంటగా ఉండవచ్చు.



Click it and Unblock the Notifications











