Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఈస్ట్ ఇన్ఫెక్షన్(క్యాండిడియాసిస్) నివారించే ఉత్తమ హోం రెమెడీస్ ...
క్యాండిడియాసిస్ అల్బికన్స్ అనేది ఈస్ట్. ఇది చాలా తక్కువగా జీర్ణవాహిక మరియు వైజిన యొక్క చర్మం యొక్క క్రింది బాగంలో ఉంటుంది. మహిళల్లో యోని నాళంలో, సెర్విక్స్ చుట్టూ విపరీతమైన ఫంగస్ పెరిగిపోతుంది. తీవ్రమైన దురదతో, మంటతో పాటు పెరుగులాంటి తెల్లని స్రావాలు విడుదల అవుతాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నారు. నిజానికి పురుషుల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే వారిలో చాలా తక్కువగా ఉంటుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు గురియైనవారిలో యోని వద్ద దురద మరియు వాపుతో చీకాకు కలిగించే లక్షణాలుంటాయి.ఇంకా సంభోగ సమయంలో మరియు మూత్రవిసర్జన అప్పుడు మంటగా అనిపిస్తుంది. మరియు యోని వద్ద నొప్పిగా, పుండ్లు పడడం వంటి లక్షనాలు కూడా కనిపిస్తాయి.
మన శరీరంలో వ్యాధినిరోధకత మరియు బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఈస్ట్ పెరుగుదలను నివారిస్తుంది. శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియా, యాంటీబయోటిక్స్ ను నాశనం చేస్తుంది లేదా మన వ్యాధినిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. క్యాండిడియాసిస్ కు కారణం అయ్యేవాటిని తెలుసుకోగలిగితే క్యాండిడియాసిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈస్ట్ ఇన్ఫెక్షన్ నేచురల్ గా నివారించడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. క్యాండిడా అనేది జీర్ణవ్యవస్తను మరియు న్యూట్రీషియన్ల షోషణకు సహాయపడుతుంది. అయితే ప్రేగుల్లో క్యాండిడియాసిస్ పెరుగుదల ప్రారంభం అయినప్పుడు, అది ప్రేగుగోడల యొక్క చర్మంను పాడు చేస్తుంది మరియు టాక్సిన్ ను విడుదల చేసే రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. ఇదే ఎక్కువగా క్యాండిడియాసిస్ ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. ఇది నివారించడానికి లేదా చికిత్స చేయడానికి కష్టం అవుతుంది.
క్యాండిడియాసిస్ చర్మం, నోరు, జననేంద్రియా ప్రాంతం మీద ప్రభావం చూపుతుంది. లక్షణాలు శరీరంలోని ప్రదేశాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి . చర్మం మరియు గోళ్ళలో క్రోనిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎక్జిమా, రాషెస్, మరియు సోరియాసిస్. గొంతు నిప్పి మరియు మింగడంలో ఇబ్బంది, నాలుక మీద తెల్ల మచ్చలు, దీర్ఘకాలికఅలసట, ఎనర్జీ లోపం, కడుపు ఉబ్బరం, మలబద్దకం లేదా డయోరియా, తరచూ మనస్సు మారుతుండటం, డిప్రెషన్, ఆందోళన, చిరాకు, వైజినల్ ఇన్ఫెక్షన్, దురద, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఈ వ్యాధి యొక్క లక్షణాలు. ఈ ఇన్ఫెక్షన్ కు కారణం తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది . తరచూ డైట్ విషయంలో మార్పులు మరియు మంచి బ్యాక్టీరియారి రీస్టోర్ చేయడం మరియు వ్యాధినిరోధకతను బలోపేతం చేయడం వల్ల ఇన్ఫెక్షన్ తో పోరాడవచ్చు . అయితే ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇంటి వద్దే కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించి నివారించుకోవచ్చు. క్యాండిడియాసిస్ ఇన్ఫెక్షన్ ను నివారించకుండా అలాగే వదిలివేకకూడదు. ఇన్ఫెక్షన్ కు గురికావడం, కంట్రో అవ్వకుండా ఎక్కువ కాడం వల్ల ప్రేగు యొక్క గోడల్లో మరియు రక్తప్రవాహంలో ప్రేవేశించగలవు. ఈ పరిస్థి తీవ్రంగా ఉన్నప్పుడు లేదా తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
క్యాండిడియాసిస్ (ఈస్ట్ ఇన్ఫెక్షన్ )నివారించే క్రీములు మరియు పిల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ లక్షణాలను నివారిస్తాయి. అయితే ఇన్ఫెక్షన్ కు గల కారణాలు తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. కాబట్టి, తరచూ డైట్ లో మార్పులు చేసుకోవడం మరియు మంచి బ్యాక్టీరియాను రిస్టోర్ చేయడం మరియు వ్యాధినిరోధకతను పెంచడం వల్ల ఇన్ఫెక్షన్ తో పోరాడటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా, ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను ఇంటివద్దే నివారించడానికి చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. మరి ఇంటి వద్దే తీసుకోగల నేచురల్ ట్రీట్మెంట్ ఎంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం..

1. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు క్యారెట్ మరియు బీట్ రూట్ ను తీసుకోకూడదు:
ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బీట్ రూట్ మరియు క్యారెట్ వంటి వాటిని నివారించాలి . ఎక్కువగా నీళ్ళు త్రాగాలి. హెర్బల్ టీ మరియు బార్లీ గ్రాస్ వంటివి తీసుకోవడం వల్ల క్యాండిడాకు కారణం అయ్యే టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది.

2. ప్రోబయోటిక్స్:
ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను నివారించడానికి ప్రోబయోటిక్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తాయి. క్యాండిడాను కంట్రోల్లో ఉంచుతాయి. కాబట్టి ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పెరుగు తరచూ తీసుకోవాలి. మరియు ప్రోబయోటిక్ సప్లిమెంట్ ను తీసుకోవాలి.

3. మీ డైట్ ను పరిశీలించాలి:
క్యాండిడాకు కార్బోహైడ్రేట్స్ మరియు షురగ్స్ ఫుడ్స్ కూడా కారణం అవుతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండటం వల్ల క్యాండిడి పెరుగుదలను మరియు ఉత్పత్తిని నివారిస్తుంది.

4. యాపిల్ సైడర్ వెనిగర్:
ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను యాపిల్ సైడర్ వెనిగర్ నివారిస్తుంది.ఇది శరీరంలో బాడీ పిహె లెవల్స్ ను బ్యాలెన్స్ చేసి క్యాండిడా పెరుగుదలను నివారిస్తుంది.. కాబట్టి, రెండు మూడు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీళ్ళలో మిక్స్ చేసి రోజులో రెండు మూడు సార్లు తీసుకోవాలి . ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలను నివారిస్తుంది.

5. కోడ్ లివర్ ఆయిల్ :
హెల్తీ ఫ్యాట్ కలిగిన కోడ్ లివర్ ఆయిల్, ఫిష్ ఆయిల్, కోకోనట్ లేదా ఆలివ్ ఆయిల్ వంటి వాటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాండిడియాసిస్ ను నేచురల్ గా తగ్గించుకోవచ్చు . కార్బోహైడ్రేట్స్ మరియు షుగర్స్ ను నివారించాలి .

6. క్యాప్రిలిక్ యాసిడ్ సప్లిమెంట్ లేదా స్వచ్చమైన కొబ్బరి నూనె:
క్యాప్రిలిక్ యాసిడ్ కొబ్బరి నూనె నుండి వస్తుంది మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సలో చాలా గొప్ప ఫలితాలను అందిస్తుంది . కాబట్టి, ప్రతి రోజూ ఆర్గానిక్ , ఎక్సట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ను ప్రతి రోజూ తీసుకోవాలి. ఇంకా మీరు క్యాప్రిలిక్ యాసిడ్ సప్లిమెంట్ ను కూడా తీసుకోవాలి . ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించడానికి ఒక నేచురల్ పద్దతి.

7. ఓరిగానో ఆయిల్ :
ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించడంలో ఓరిగానో ఆయిల్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అనుకోకుండా శరీరంలోని మంచి బ్యాక్టీరియాను కూడా నశింప చేస్తుంది. కాబట్టి, ఆరిగానో ఆయిల్ ట్రీట్మెంట్ కు ప్రోబయోటిక్స్ ను చేర్చాలి. అందుకు మీకు చేయాల్సిందల్ల కొన్ని చుక్కల నూనె గ్లాసునీళ్ళలో పోయాలి . ఎక్కువగా వేయడం వల్ జీర్ణవాహికకు చిరాకు కలిగిస్తుంది.

8. బర్త్ కంట్రోల్ పిల్స్ ను నివారించాలి:
యాంటీబయోటిక్స్, బర్త్ కంట్రోల్ పిల్స్ మరియు స్టెరాయిడ్స్ వంటివి నివారించాలి . డాక్టర్ ను సంప్రదించాకుండా ఎటువంటి మెడికేషన్స్ ను తీసుకోకూడదు.

9. పచ్చి వెల్లుల్లి లేదా గార్లిక్ క్యాప్స్యూల్స్:
ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించడంలో పచ్చివెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, పచ్చిగా తీసుకోవచ్చు. నురుగా తినలేని వారు గార్లిక్ క్యాప్స్యూల్స్ తీసుకోవచ్చు.

10. కోలోయిడల్ సిల్వర్:
ఈస్ట్ ఆఫ్ ఆక్సిజన్ కు ఎంజైమ్స్ బాధ్యత వహిస్తాయి. ఆక్సిజన్ లేకుండా క్యాండిడా పెరగదు.

11.బెంటోనైట్ క్లే లేదా మోంట్మొర్రిలోనైట్:
ఇలాంటి మట్టి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరియు శరీరంలో చాలా త్వరగా శోషింపబడుతుంది.దాంతో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను నార్మల్ గా నివారించుకోవచ్చు.

12. సెంట్ సోప్స్ నివారించాలి:
టాంపాన్స్, లోషన్స్, ఫెమినైన్ హైజినిక్ స్ప్రే మొదలగు వాడకాన్ని నివారించాలి . ఇవి నేచురల్ బ్యాలెన్స్ ను అంతరాయం కలిగిస్తాయి. ఇవి క్యాండిడా పెరుగుదలకు కారణం అవుతాయి.

13.ఒత్తిడిని తగ్గిస్తాయి:
ఒత్తిడికి గురైతే వ్యాధినిరోధక లోపిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఒత్తిడి తగ్గించుకోవాలి . మెడిటేషన్, యోగా లేదా సింపుల్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి.

14. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి:
జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. క్లీన్ గా పొడిగా ఉంచుకోవాలి. సింథటిక్ అండర్ వేర్ కు బదులు కాటన్ వి ధరించాలి. హాట్ బాత్, హాట్ టబ్స్ లేదా వర్ఫూల్స్ ను నివారించాలి.



Click it and Unblock the Notifications











