Latest Updates
-
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి!
వింటర్లో వెచ్చగా...బాడిని స్లిమ్ గా మార్చే వింటర్ ఫుడ్స్
శీతాకాలంలో బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన అంశం ఎందుకంటే మిగిలన సీజన్లలో కంటే ఈ సీజన్ లో చలికి చాలా మంది అవుట్ డోర్ వ్యాయామాలకు వెళ్ళరు. చలికి బద్దకించి వెచ్చగా పడుకొంటారు. దాంతో ఇతర సీజన్లలో కంటే ఈ సీజన్లో మరికొంత బరువు పెరుగుతారు. కాబట్టి అవుట్ డోర్ వర్కౌట్ మరియు డైట్ ప్లానింగ్ శీతాకాలంలో బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఉదాహరణకు, అవుట్ డోర్స్లో వ్యాయామాలు చేయడానికి, బయట చలి, మంచు మిమ్మల్నిబయట అడుగుపెట్టడానికి నిరుత్సాహపరుచవచ్చు మరియు అసౌకర్యానికి గురిచేయవచ్చు.
శీతాకాలంలో బరువు తగ్గించడానికి మరో మార్గం సూపర్ ఫుడ్స్ ను నిల్వ చేసుకోవడమే. అంటే మీరు శీతాకాలంలో మీ శరీరానికి ఉపయోగకరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని అర్థం. స్వీట్ పొటాటోలో అధిక ఫైబర్ ఉండి, అవి మీ పొట్టను కడుపు నిండుగా ఉండేట్లు చేస్తుంది మరియు ఎక్కువ సమయం ఆకలి కానివ్వదు మరియు ఇది ఆరోగ్యకరమైనది కూడా. మెకరోనీ మరియు చీజ్ వంటివి చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతారు, కానీ, శీతాకాలంలో క్యాలరీలను తగ్గించాలన్నా మరియు బరువు తగ్గాలన్నా, ఆరోగ్యకరమైన ఆహారాలు అంటే, ఎక్కువ వెజిటేబుల్స్ అందులో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.
ఇలాంటి ఆహారాలను చేర్చుకోవడం వల్ల శరీరంలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. వింటర్ సీజన్లో వివిధ రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ చుట్టుముట్టకుండా ఉండాలంటే వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉండే ఇమ్యూన్ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఈ ఆర్టికల్లో కొన్ని వింటర్ బెస్ట్ ఫుడ్స్ ను లిస్ట్ అవుట్ చేయబడి ఉన్నాయి. ఇవి వింటర్లో ఎనర్జీని అందివ్వడం మాత్రమే కాదు, చలికి మిమ్మల్ని వెచ్చగా సౌకర్యవంతంగా ఉంచుతాయి. దాంతో హెల్తీగా బరువు తగ్గించుకోవచ్చు. మరి ఈ ఆర్టికల్ చదివి వింటర్ లో బరువు తగ్గించుకొనే వింటర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం....

1. చికెన్ సూప్ :
ఆప్టైజర్స్ మరియు స్టార్టర్స్ మీ కడుపు ను సులభంగా నింపుతాయి మరియు అధికంగా తినడాన్ని నివారిస్తుంది . మీరు బయట డిన్నర్ కు వెళ్ళే టప్పుడు ఒక కఠినమైన వెయిట్ లాస్ డైట్ ను అనుసరించండి. అందుకు మీరు కొన్ని హాట్ ఫ్యాట్ బర్నింగ్ లో క్యాలరీ సూపులను ఎంపిక చేసుకోండి. అలాంటి వింటర్ సూప్ చికెన్ సూప్. ఇది మెటబాలిజంను పెంచుతుంది . హాట్ చికెన్ సూప్ ఈ చల్లని వాతావరణంలో ఫర్ ఫెక్ట్ సూప్ వింటర్ సూప్.

2. స్వీట్ పొటాటో:
పొటాటోలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని, స్వీట్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇది డయాబెటిస్ వారికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . ఇందులో ఉండే లో గ్లిజమిక్ ఇండెక్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచకుండా సహాయపడుతుంది. లేదా బేక్ చేసిన స్వీట్ పొటాటోను తీసుకొని వింటర్లో వెచ్చగా ఉండటంతో పాటు బరువును కూడా తగ్గించుకోవచ్చు.

3. ఓట్ మీల్:
బరువు తగ్గడానికి ఇది ఒక బెస్ట్ వింటర్ డైట్ ఫుడ్. . వింటర్ సీజన్లో ఓట్ మీల్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలి. వీటిని తినడం వల్ల వింటర్ సీజన్లో వెచ్చగా ఉంచడంతో పాటు మంచి బ్యాక్టీరియాను శరీరంలో నింపుతుంది. దాంతో హెల్తీ మార్గంలో బరువును తగ్గించుకోవచ్చు.

4. సిట్రస్ ఫ్రూట్స్:
పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్ మొదలగు సిట్రస్ పండ్లు శరీరంలో వ్యాధినిరోధకతను పెంచుతుంది. మరియు వింటర్లో వచ్చే వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ ను కలిగిస్తుంది. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

5. తేనె:
బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ వింటర్ ఫుడ్. అంతే కాదు, ఇది మిమ్మల్ని వార్మ్ గా ఉంచుతుంది . ఇందులో అధికంగా న్యూట్రీషియన్స్ మరియు నేచురల్ షుగర్స్ ఉంటాయి . వేగంగా ఎనర్జీని అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే అనేక ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది, ఇందులో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల నివారిస్తుంది.

7. గుడ్లు:
వింటర్లో గుడ్లు తినడం వల్ల శరీరంను వెచ్చగా ఉంటుంది. అంతే కాదు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు కూడా తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications