రాత్రి నిద్రించడానికి ముందు ఆ ప్రదేశంలో ఎందుకు మసాజ్ చేయాలి..?

రోజంతా మన కాళ్లతో పాటు, పాదాలు ఎన్నో పనులు చేస్తాయి. కానీ వాటినే మనం అశ్రద్ద చేస్తుంటాము. చిన్న చిన్న వేళ్ళను నిర్లక్ష్యం చేస్తుంటాము.

మన శరీరంలో అతి చివరలో ఉండే భాగము కాళ్ల పాదాలు మరియు వేళ్ళు - ఈ విషయం మీరు కూడా అంగీకరిస్తారు కదా? ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం ప్రతి రోజూ మనం నిద్రించడానికి ఒక గంట ముందు మన పాదాలను మసాజ్ చేయాలని సూచిస్తున్నారు. ఈ చిన్న చిట్కాల వల్లే మన పాదాలు స్ట్రాంగ్ గా ఫ్లెక్సిబుల్ గా ఉండటంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

READ MORE:బాడీ మసాజ్ వల్ల పొందే ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పాదాలు మసాజ్ చేయడం అనేది కొత్త విషయమేమి కాదు. కొన్ని వేల సంవత్సరాల నుండే పాదాల మసాజ్ చేయడం అలవాటులో ఉంది. మన సాంప్రదాయంలో కూడా పాదాలను మసాజ్ చేసుకోవడం ఒక ముఖ్య విషయంగా భావిస్తారు. కానీ ప్రస్తుత రోజుల్లో వేగవంతమైన జీవన విధానంలో పాదాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు పాదాల మసాజ్ వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చన్న విషయం తెలియకపోవడం వల్ల కూడా పాదాల మసాజ్ ను చేసుకోవడం లేదు.

READ MORE: పొట్ట ఉదర భాగంలో మసాజ్ చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్య నిపుణులు సూచన ప్రకారం బెడ్ టైమ్ కు ఒక గంట ముందుగా పాదాలను మసాజ్ చేసుకోవడం చాలా ఆరోగ్యకరం. మరియు పాదాల మసాజ్ కు కొబ్బరి నూనెను ఉపయోగించడం మరింత ఆరోగ్యధాయకం . కొబ్బరి నూనెలో ఉండే గుణాలు పాదాల యొక్క కండరాలకు రిలాక్స్ ను కలిగిస్తుంది. శరీరంలో స్ట్రెస్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ముఖ్యంగా శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పాదాలను రెగ్యులర్ గా మసాజ్ చేసుకోవడం వల్ల నిద్ర మరియు మెటబాలిజం రేటును పెంచుతుంది మరియు తరచూ వచ్చే తలనొప్పిని కూడా నివారిస్తుంది.

ఫేషియల్ మసాజ్ తో సర్ఫ్రైజింగ్ బ్యూటి బెనిఫిట్స్

మరి రెగ్యులర్ గా పాదాలను మసాజ్ చేసుకోవడం వల్ల పొందే అదనపు ప్రయోజనాలేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:

రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:

మోడ్రన్ లైఫ్ స్టైల్లో రక్తప్రసరణ కూడా ఒక సమస్యగా ఏర్పడుతున్నది. ప్రతి రోజూ నిద్రించే ముందు రెగ్యులర్ ఫూట్ మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుచుకోవచ్చు. దాంతో హార్ట్ డిసీజ్ ను దూరం చేసుకోవచ్చు . ఫూట్ మసాజ్ వల్ల కాళ్లలో వీరికోస్ వీన్స్ (రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే)సమస్యలను తగ్గిస్తుంది.

 కాళ్ళ సమస్యలను నివారిస్తుంది:

కాళ్ళ సమస్యలను నివారిస్తుంది:

ప్రతి రోజూ రాత్రి పడుకొనే ముందు గోరువెచ్చని నూనెతో పాదాలను మసాజ్ చేసుకోవడం వల్ల నరాలకు విశ్రాంతి కలిగిస్తుంది . దాంతో రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ ను నివారించుకోవచ్చు. ఒక నెల పాటు క్రమం తప్పకుండా ఫూట్ మసాజ్ చేసుకోవడం వల్ల సమస్యను నివారించుకోవచ్చు.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

నిద్రించే ముందు 10నిముషాలు పాదాలను మసాజ్ చేయడం వల్ల మూడ్ ను మెరుగుపరుస్తుంది. ఆందోళ తగ్గిస్తుంది. అదే క్రమంలో హైబ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

శరీరంలో అసిడిక్ ను నివారిస్తుంది:

శరీరంలో అసిడిక్ ను నివారిస్తుంది:

ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు 20నిముషాలు పాదాలకు మసాజ్ చేయడం వల్ల మజిల్ టిష్యులో లాక్టిక్ యాసిడ్స్ (ఎక్కువ వ్యాయామాలు చేయడం వల్ల ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను)ను నివారిస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్స్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల పాదాల్లో ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

జాయింట్ పెయిన్ నివారిస్తుంది:

జాయింట్ పెయిన్ నివారిస్తుంది:

పాదాలను రెగ్యులర్ గా మసాజ్ చేసుకోవడం వల్ల శరీరంలోని అన్ని రకాల జాయింట్ పెయిన్స్ ను నివారిస్తుంది . ప్రెజర్ పాయింట్స్ మీద ఏకాగ్రత పెట్టి మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులను నివారించుకోవచ్చు.

తలనొప్పి నివారిస్తుంది:

తలనొప్పి నివారిస్తుంది:

ఎలాంటి తలనొప్పినైనా నివారించడంలో మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ది బెస్ట్ హోం రెమెడీ. పాదాలను 15నిముషాలు మసాజ్ చేయడం వల్ల ఎలాంటి తలనొప్పి అయినా నివారించుకోవచ్చు . బ్రెయిన్ కు సంబంధించిన నాడీకణాలను రిలాక్స్ అయ్యేలా చేస్తుంది . దాంతో తలనొప్పిని నివారించుకోవచ్చు.

 గర్భిణీ స్త్రీలకు తప్పనిసరి

గర్భిణీ స్త్రీలకు తప్పనిసరి

గర్భిణీ స్త్రీలకు చివరి త్రైమాసికంలో ఫూట్ మసాజ్ చాలా సహాయపడుతుంది. పాదాలో చేరిన నీరును తగ్గించడానికి ఫూట్ మసాజ్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ నీటిని తిరిగి కిడ్నీలకు సరఫరా అయ్యేలా సహాయపడుతుంది.

పీరియడ్స్ మరియు మోనోపాజ్ లో వచ్చే సమస్యలను అరికడుతుంది

పీరియడ్స్ మరియు మోనోపాజ్ లో వచ్చే సమస్యలను అరికడుతుంది

పీరియడ్స్ లేదా పియంఎస్ ప్రిమెన్యుష్ట్రువల్ సిండ్రోమ్ సమయంలో బాధగా ఉండటం, చిరాకు, ఆందోళను, టెన్షన్, నిద్రలేమి, అలసట, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి అన్ని రకాల సమస్యలకు ఒక ఉత్తమ మార్గం ఫూట్ మసాజ్ . ఇలాంటి సమయంలో ఫూట్ మసాజ్ చాలా బాగా సహాయపడుతుంది.

డిప్రెషన్ తగ్గిస్తుంది:

డిప్రెషన్ తగ్గిస్తుంది:

రోజంతా అలసటకు గురైనప్పుడు ఏర్పడే డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది . పాదాల్లో కొన్ని ప్రెజర్ పాయింట్ మీద మాసాజ్ చేయడంవల్ల ఎక్కువ ఉపయోగకరం. స్ట్రెస్ మరియు డిప్రెషన్ తగ్గించుకోవచ్చు .

Story first published: Wednesday, December 2, 2015, 19:02 [IST]
Desktop Bottom Promotion