Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
ముప్పు తీసుకొచ్చే ఉప్పుతో బీ కేర్ ఫుల్
ప్రతి కూరకి, ప్రతి స్నాక్ కి, కారంగా చేసే ప్రతి ఆహారపదార్థాలకు ఉప్పు తగించకపోతే.. రుచిగా ఉండదు. ఏ వంటకమైనా.. ఉప్పు లేని పస ఉండదు. చిప్స్ నుంచి ఊరగాయల వరకు ప్రతి వంటకం మేడ్ విత్ సాల్ట్. కాస్త ఉప్పు తక్కువైనా.. వంటకం బాగోలేనట్టే. వంటల్లో ప్రధానపాత్ర పోషిస్తున్న ఉప్పు రుచిని ఇస్తున్నా.. ఆరోగ్యానికీ తీసుకొచ్చే ముప్పు చాలా ఎక్కువే.
READ MORE: ఉప్పు ఉపయోగించి ఆరోగ్య సమస్యలు నయం చేయటానికి 13 మార్గాలు
అన్ని వంటలూ ఉప్పు మీద ఆధారపడినట్టు.. మన శరీరంలో ప్రతి అవయవమూ ఉప్పు మీద ఆధారపడిందంటే అతిశయోక్తి కాదు. శరీరంలో జరిగే రసాయనిక చర్యలన్నీ ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి. కండరాలు సంకోచించడంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాక శరీరంలో జీర్ణవ్యవస్థకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి. శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్ కలుగుతుంది. కానీ సోడియం ఎక్కువ ఉండే ఉప్పు పదార్థాలు తీసుకుంటే అధిక రక్తపోటుకు ప్రమాదముంది. కాబట్టి శరీరానికి ఉప్పు ఎంత అవసరమో అంతే మోతాదులో తీసుకోవాలి.

ఉప్పుతో కలిగే ముప్పెంత ?
ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. కానీ ప్రతి వ్యక్తీ రోజుకి 8 నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. కాబట్టి సాధ్యమైనంతవరకు ఉప్పును తగ్గించుకోవడం మంచిది.

ఉప్పుతో కలిగే ముప్పెంత ?
శరీరంలో నీటి కంటే ఉప్పు ఎక్కువైతే నీళ్లు ఎక్కువగా తాగాల్సి వస్తుంది. అయితే ఉప్పు శాతం అధికంగా వాడితే మూత్రపిండాలు అధికంగా ఉన్న నీటి మొత్తాన్ని విసర్జింప చేయలేక పోతాయి. దీనివల్ల ఒత్తిడి పెరిగి బీపీ పెరుగుతుంది.

ఉప్పుతో కలిగే ముప్పెంత ?
ఆడవాళ్ళు తక్కువ ఉప్పు తీసుకోవాలి. లేకపోతే నెలసరి సమయంలో ఇబ్బందిగా మారుతుంది. నీటిశాతం పెరిగి పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది.

ఉప్పుతో కలిగే ముప్పెంత ?
నిల్వ ఉన్న, బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్ పూర్తిగా మానేయాలి. ఇవి పాడవకుండా ఉండటానికి ఎక్కువ ఉప్పు వాడుతారు కాబట్టి అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

ఉప్పుతో కలిగే ముప్పెంత ?
ఆహారం తినే సమయంలో ఉప్పు డబ్బాకు దూరంగా ఉండాలి. కూరల్లో తక్కువైందని.. అదేపనిగా చల్లుకుని తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

ఉప్పుతో కలిగే ముప్పెంత ?
ఆహారం తీసుకునేటప్పుడు ఉప్పు తక్కువైంది అనిపిస్తే.. నిమ్మరసం, వెనిగర్, మిరియాలపొడి, ఉల్లిపాయలు వాడటం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.

ఉప్పుతో కలిగే ముప్పెంత ?
చిప్స్ వంటి పదార్థాలకు బదులు డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. స్నాక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండటం మంచిది.

ఉప్పుతో కలిగే ముప్పెంత ?
పెరుగన్నంలో ఉప్పు కలుపుకోకుండా తీసుకోవడం మంచిది. మజ్జిగ తాగాలనుకున్నా ఉప్పు లేకుండా.. ప్లెయిన్ గా తాగడం అలవాటు చేసుకోవాలి.

ఉప్పుతో కలిగే ముప్పెంత ?
పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపళ్లను అధికంగా తీసుకుంటూ ఉండాలి. ఇవి శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేయడానికి సహకరిస్తాయి.



Click it and Unblock the Notifications
