విహారయాత్రల్లో వచ్చే వ్యాధులు: నివారణ మరియు చికిత్స మార్గాలు

By Super

మీరు మీ విహారయాత్ర గురించి ఎన్నో కలలు కంటారు. కష్టపడి ప్లాన్ చేసి ఆ రోజు గురించి ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు.మొత్తానికి ఆ రోజు రానే వస్తుంది. ఇంత ఉత్సాహం గా ఎదురు చూసిన మీరు విహారయాత్రలో ఉండగా ఆ యాత్ర ఆరోగ్య కారణాలవల్ల పాడవ్వకూడదని కోరుకుంటారు కదా.

శెలవుల్లో విహారయాత్రల్లో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని వంద శాతం మన స్వాధీనం లో ఉంచుకోలేము కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే యాత్రలో అనారోగ్యం బారిన పడకుండా కొంతవరకూ అరికట్టవచ్చు.అలాగే విహారయాత్రల్లో తలెత్తే చిన్న చిన్న సమస్యలకి విరుగుళ్ళు తెలుసుకుని ఉండటం మంచిది.

1. స్టమక్ ఫ్లూ:

1. స్టమక్ ఫ్లూ:

చాలా మంది యాత్రికులు ఢిల్లీ బెల్లీ లేదా మాంటెజూమా రెవెంజ్ అని పిలవబడే స్టమక్ ఫ్లూ బారిన పడుతుంటారు.పొత్తి కడుపులో నెప్పి,వాంతులు,డయేరియా దీని ముఖ్య లక్షణాలు. బాగా కారం గా ఉండే ఆహారం తీసుకోవడం,మనకి అలవాటు లేని దినుసులు ఆహారం లో తీసుకోవడం లేదా ఆహారం తయారు చేసేటప్పుడు శుభ్రత పాటించకపోవడం ఈ వ్యాధికి ముఖ్య కారణాలు.ఒక్కోసారి మీకు కొత్త ప్రాంతంలో నీరు కూడా పడకపోవచ్చు.అది త్రాగటానికి అనువైన నీరయినా సరే మీ ఒంటికి ఆ నీరు సరిపడక నోరావైరస్ బారిన పడచ్చు.

2. స్టమక్ ఫ్లూ:

2. స్టమక్ ఫ్లూ:

స్టమక్ ఫ్లూ బారిన పడకూడదంటే శుభ్రత పాటించాలి.అన్నం తినేముందు, మూత్రం లేదా మల విసర్జన తరువాత చేతులు తప్పకుండా కడుక్కోవాలి.హ్యాండ్ సానిటైజర్ మీతో కూడా తీసుకెళ్ళడం ఒక మంచి ఆలోచనే.సబ్బు,నీళ్ళు అందుబాటులో నేప్పుడు దీనిని ఉపయోగించవచ్చు.కొత్త పదార్ధాలని ఒక్కసారే తినకుండా క్రమక్రమం గా తింటుంటే మీ శరీరం కూడా వాటికి మెల్లిగా అలవాటు పడుతుంది.ఏదైనా పండు తినేముందు తప్పక దానిని బాటిల్డ్ వాటర్ తో కడగాలి.

3. స్టమక్ ఫ్లూ:

3. స్టమక్ ఫ్లూ:

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న కానీ మీరు స్టమక్ ఫ్లూ బారిన పడితే మీ శరీరానికి తగినంత ద్రవపదార్ధాలు అందిస్తూ ఉండండి.రీహైడ్రెషన్ ప్యాకెట్లు దగ్గర పెట్టుకుని వాటిని నీటితో కలిపి సేవించాలి. ఇవి అందుబాటులో లేకపోతే పంచదార,ఉప్పు ఒక్కోస్పూను చొప్పున తీసుకుని నీళ్ళల్లో కలిపితే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తయారు. దీనిని కొద్దికొద్దిగా తాగుతుండాలి.మందుల షాపుల్లో దొరికే డయేరియా మందులు కూడా ప్రయత్నించవచ్చు.కాస్త కోలుకున్నట్లనిపిస్తే ఆహారాన్ని కొంచెం కొంచెం తీసుకోవడం మొదలెట్టవచ్చు.

4. మలబద్ధకం:

4. మలబద్ధకం:

మీరు రోజూ తీసుకునే ఆహారంలో మార్పు వస్తే మలబద్ధకం వస్తుంది.ఒకవేళ వాతావరణం వేడీగా ఉండి మీరు తగినంత నీరు తాగకపోతే ఇది మరింత విజృంభించవచ్చు.పీచు అధికం గా ఉండే పదార్ధాలతోపాటు తాజా పళ్ళూ,కూరగాయలూ తీసుకోవాలి.బాగా యాక్టివ్ గా ఉండటం వల్ల కూడా మీ జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది.ఈ చిట్కాలు పనిచెయ్యకపోతే విరేచనకారి మందులను(లాక్సేటివ్స్)వాడవచ్చు.మలబద్ధకం వచ్చింది అనిపించిన వెంటనే మేల్కొనండి.అది మరింత ముదిరితే పైల్స్ బారిన పడవచ్చు. ఈ పైల్స్ మరింత బాధాకరం.

5. సన్ బర్న్

5. సన్ బర్న్

మీరు జాగ్రత్తగా లేకపోతే సున్ బర్న్ వల్ల మీరు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఈ చిన్న విషయాన్ని మనం మర్చిపోతుంటాము.ఎండలో అతిగా తిరగడం వల్ల చర్మం బాగా ఎర్రబడి,పొక్కులు, బొబ్బలు ఏర్పడచ్చు.ఇవన్నీ చాలా బాధ కలిగిస్తాయి.తగినంత మంచి నీరు తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్ వచ్చి తద్వారా తలనెప్పి, వాంతులు,జ్వరం, కంటి చూపు సమస్యలు తలెత్తవచ్చు.

6. సన్ బర్న్

6. సన్ బర్న్

ఎండలో అతిగా తిరగడం వల్ల చర్మ క్యాన్సర్ వస్తుందని మర్చిపోవద్దు.జాగ్రత్త తీసుకోవడమే దీనిని ఎదుర్కునే సాధనం.ఎల్లప్పుడూ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. ఎస్పీఎఫ్ ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ వాడాలని నిపుణుల సలహా.ముఖ్యంగా పిల్లలకి.కానీ ఈ సన్ స్క్రీన్ కూడా కొంతవరకే మీకు రక్షణ కల్పిస్తుంది.

7. సన్ బర్న్

7. సన్ బర్న్

ఎండలో ఎక్కువసేపు ఉండాల్సివస్తే మధ్య మధ్యలో నీడలో సేదతీరాలి. ఈత కొట్టిన తరువాత సన్ స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు.మిట్ట మధ్యాహ్నం ఎండలో అస్సలు తిరగద్దు,అప్పుడే సూర్య తాపం బాగా ఎక్కువగా ఉంటుంది.మబ్బుగా ఉన్నరోజు లేదా బాగా గాలివీస్తున్న రోజుల్లో కూడా మీరు సన్ బర్న్ కి గురికావచ్చని గుర్తు పెట్టుకోండి.మనకి వేడిగా ఉంది అనిపించేంతవరకూ ఎండలో ఉండచ్చు అనుకోవడం తప్పు.

8. మూత్రనాళ ఇన్ ఫెక్షన్

8. మూత్రనాళ ఇన్ ఫెక్షన్

తగినన్ని ద్రవ పదార్ధాలు తీసుకోకపోవడం వల్ల యాత్రల్లో ఈ వ్యాధి రావడం సర్వసాధారణం.మూత్ర విసర్జన సమయం లో గుచ్చినట్లుండడం,పొత్తి కడుపులో నెప్పి,మూత్ర విసర్జనకి పదే పదే వెళ్ళాలనిపిచడం,తీరా వెళ్ళాకా అతి తక్కువ పరిమాణం లో మూత్రం రావడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు.కొంతమందిలో ఈ ఇన్ ఫెక్షన్ వల్ల జ్వరం కూడా రావచ్చు. తగినన్ని మంచి నీళ్ళు తాగడం ద్వారా ఈ ఇన్ ఫెక్షన్ ని ఆమడ దూరం లో ఉంచవచ్చు.క్రాన్ బెర్రీ జ్యూస్ మూత్ర నాళ ఇన్ ఫెక్షన్ కి హోం రెమెడీ.ఈ ఇఫెక్షన్ ఉన్నప్పుడు మీరు స్నానం చేసేటప్పుడు సువాసన ఉన్న సబ్బులు,షాంపూల లాంటి వాటి వాడకం మానెయ్యండి.24 గంటలు గడచినా పరిస్థితిలో మారు లేకపోతే వైద్యుడిని సంప్రదించాలి.

9. క్రిమి/పురుగు కుట్టడం

9. క్రిమి/పురుగు కుట్టడం

ఏదైనా క్రిమి లేదా పురుగు కుడితే వచ్చే దురద చాలా విసుగు తెప్పిస్తుంది.మీరు ఉష్ణమండలంలో ఉంటే కనుక ఆ క్రిములు మల్రేరియా ని కూడా కలగచేయవచ్చు. మీకు కనుక పురుగు లేదా ఏదైనా క్రిమి కుడితే ఎలర్జీ వస్తుందా?? అయితే అవి అసలు కుట్టకుండా చూసుకోవడం మేలు.క్రిమి వికర్షకాలు(ఇన్సెక్ట్ రెపెల్లెంట్స్) బాగా పనిచేస్తాయి పైగా ఇవి అనేక రకాల "స్ట్రెంగ్త్" లలో లభ్యమవుతాయి. (ఎంత ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటే పురుగులని అంత ఎక్కువ వికర్షిస్తుంది).

10. క్రిమి/పురుగు కుట్టడం

10. క్రిమి/పురుగు కుట్టడం

వీటి బదులు సిట్రొనేల్లా వంటి సుగంధ నూనెలతో తయారయిన రిస్ట్ బ్యాండ్లు ఉపయోగించవచ్చు.దోమతెర వాడకం ద్వారా కూడా పురుగులు కుట్టకుండా నివారించవచ్చు. అవసరమయితే యాంటీ మలేరియా మందులు కూడా తీసుకోవచ్చు.ఇంత జాగ్రత్త తీసుకున్న ఏదైనా పురుగు కుడితే కనుక కుట్టిన చోట గీరకూడదు.గీరడం వల్ల అక్కడ ఇన్ ఫెక్షన్ రావచ్చు.గోరువెచ్చటి నీటితో కుట్టిన భాగాన్ని కడిగి దురద,వాపు తగ్గడానికి యాంటీ హిస్టమైన్ క్రీం రాయాలి.

Story first published: Saturday, October 24, 2015, 14:03 [IST]
Desktop Bottom Promotion