Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీరు చేసే ఈ పనుల వల్ల ప్రాణానికే ప్రమాదం!
మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఒత్తిడికి గురికాక తప్పదు. స్ట్రెస్ (ఒత్తిడి)అనేది సైలెంట్ కిల్లర్. ఇది జీవితంలో మనకు తెలియకుండానే మన శరీరంలో ప్రవేశిస్తుంది, అంతే కాదు ఇది మనలో అలజడి సృష్టిస్తుంది. స్ట్రెస్ కు గురైన వ్యక్తి, బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు, ఏదోఒకటి చేసేసి స్ట్రెస్ తగ్గించుకోవాలని చూస్తుంటారు. ఆ ఆవేశంలో కొన్ని చెడు వ్యసనాలకు అలవాటు పడుతారు. ఇది ఆరోగ్యానికి ఖచ్చితంగా మంచిది కాదు. బాగా స్ట్రెస్ గా ఫీలవుతున్నప్పుడు కెఫిన్ అధికంగా ఉన్నకాఫీని ఓవర్ డోస్ లో తాగేయడం ఒక బ్యాడ్ హ్యాబిట్.
ఇక రెండో బ్యాడ్ హ్యాబిట్ స్మోకింగ్, ఇలా చెప్పకుంటూ పోతే చాలనే ఉన్నాయి. స్ట్రెస్ లో ఉన్నప్పుడు, ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి అలవాట్లుకు భానిసలవ్వడం కంటే, యోగతో స్ట్రెస్ ను తగ్గించుకోవచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం మంచిది. స్ట్రెస్ తగ్గించుకోవడానికి, మనస్సు ప్రశాంతపరచుకోవడానికి యోగ బెస్ట్ రెమెడీ. ఇది మెంటల్ గానే కాదు ఫిజిలకల్ గా కూడా ఫిట్ గా ఉంచుతుంది.
బాగా స్ట్రెస్ ఫీలయ్యే వారిలో ఇటువంటి అన్ హెల్తీ హ్యాబిట్స్ స్ట్రెస్ ను ఏమాత్రం తగ్గించవు. ఈ అలవాట్లను మానుకోకపోవడం వల్ల జీవితంలో క్రమంగా కలిగే మార్పులు జరగుతుతాయి. స్ట్రెస్ లో ఉన్న వారు, ఫాలో అయ్యే కొన్ని అన్ హెల్తీ హ్యాబిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..వీటి గురించి తెలుసుకున్న తర్వాత, ఈ అలవాట్లను దూరం చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

స్మోకింగ్:
కొద్దిగా స్ట్రెస్ గా ఫీలయితే చాలు ఒక దమ్ముకొడితే స్ట్రెస్ తగ్గుతుందని ఫీలయ్యే వారు చాలా మందే ఉన్నారు. వాస్తవానికి, ఒక సమస్యను తగ్గించుకోవడానికి మరిన్ని అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లౌతుంది. స్మోకింగ్ ప్రస్తుతానికి ఉల్లాసంగా అనిపించినా, తర్వాత స్టేజ్ లో జీవితాన్నే నాశనం చేస్తుంది. కాబట్టి, సిగరెట్ కు చెక్ పెట్టి, చిన్న వాక్ చేయండి, స్ట్రెస్ అదే తగ్గుతుంది.

కాఫీ అడిక్షన్:
కాఫీలో ఉండే కెఫిన్ డ్రగ్ (మత్తుమందు)లా పనిచేస్తుంది. ఇది మైండ్ ను ప్రశాంతపరుస్తుంది. అయితే కెఫిన్ ఓవర్ డోస్ తీసుకుంటే అది ప్రాణానికే ముప్పు తెస్తుంది. కాఫీలో ఉండే కొన్ని గుణాలు హార్ట్ బీట్ ను పెంచుతుంది. దాంతో హార్ట్ ఫ్లక్చ్యువేషన్ లేదా పల్పిటేసన్ కు గురిచేస్తుంది.

వ్యాయామలోపం:
స్ట్రెస్ లో ఉన్నప్పుడు, వ్యాయామం చేయకపోవడం, లేదా జిమ్,యోగ కు వెళ్లకపోవడం వల్ల స్ట్రెస్ మరింత పెరుగుతుంది. వ్యాయామం చేయకపోవడం వల్ల స్ట్రెస్ లో మరింత ఎక్కువ బరువు పెరగడానికి కారణమవుతుంది. లేజిగా ఉండటం వల్ల శరీరంలో జీవక్రియలు చురుకుగా జరగవు, దాంతో ఓబేసిటికి కారణమవుతుంది.

ఓవర్ గా తినడం:
స్ట్రెస్ లో ఉన్నప్పుడు, మంచి ఆహారంను ఎంపిక చేసుకోకపోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఓవర్ గా తినడం వల్ల స్ట్రెస్ తగ్గించుకోవడానికి బదులు, ఓవర్ వెయిట్ పెరుగుతారు. మనస్సుతో కాకుండా హార్ట్ తో తినడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

ఎక్కువ ఖర్చుచేయడం:
స్ట్రెస్ లో ఉన్నప్పుడు అనారోగ్యకరమైన ఆహారాలు, డ్రింక్స్, ఇతర విషయాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం వల్ల అది ఒక బ్యాడ్ హ్యాబిట్ గా మారుతుంది.

అల్కహాల్:
స్మోకింగ్ తో పాటు ఆల్కహాల్ తీసుకోవడం స్ట్రెస్ బూస్టర్ గా ఫీలవుతారు. స్ట్రెస్ లో ఉన్నప్పుడు చేసే మరో అన్ హెల్తీ హ్యాబిట్ ఇది. ఆలస్యంగా వీటికి బానిసలవ్వడంతో ప్రాణానికి ప్రమాదం.

మంచి విషయాలను కూడా చెడుగా చూస్తారు:
స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనస్సు నిండా నెగటివిటితో నిండి ఉంటుంది. ఇందు నుండి బయటపడుటకు పాజిటివ్ గా ఆలోచించడం, పాజిటివ్ విషయాలను స్వీకరించడం చేయాలి. ఈవిషయంలో ఆత్మీయుల సహాయం తీసుకోవచ్చు.

తక్కువ నిద్రపోవడం:
సరిగా నిద్రపోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు టన్నులో వచ్చి పడుతాయి. నిద్రలేమి వల్ల భ్రమపడటం, ప్రవర్థనలో మార్పులు, నిరాశచెండానికి కారణమవుతుంది.

ఎక్కువ నిద్రపోవడం:
బాగా స్రెస్ లో ఉన్నప్పుడు ఎక్కువగా నిద్రపోవడం ఒక అలవాటు. ఈ అలవాటు ఎక్కువైతే మరింత నీరసంగా, సోమరిగా మార్చేస్తుంది.

నిర్లక్ష్యం చేయడం:
మీ బాడీ అండర్ స్ట్రెస్ లో ఉందని ఫీలవుతున్నట్లైతే , నిర్లక్ష్యం చేయకండి! స్ట్రెస్ తగ్గించుకోవడానికి హెల్తీ మార్గాలను ఎంపిక చేసుకోండి..



Click it and Unblock the Notifications
