Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
మనం ఊహించని లివర్ డ్యామేజ్ లక్షణాలు ..
శరీరంలో అతి కీలకమైన అవవం కాలేయం. ఆహారం అరగాలన్నా, తిన్నది ఒంటబట్టాలన్నా కాలేయం పనితీరు బాగుండాలి. అలాంటి కీలకావయవంలో కొవ్వు అధికంగా చేరిపోతే ఫ్యాటీలివర్ సమస్య మొదలవుతుంది. ఆ సమస్యను అలాగే నిర్లక్ష్యంగా వదిలేస్తే లివర్ సిర్రోసిస్‌గా మారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే కాలేయ సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని అంటున్నారు వైద్యులు.

కారణాలు: కలుషితమైన నీరు తాగడం, రోజూ తినే ఆహార పదార్థాలలో మార్పు, ఆల్కాహాల్, స్మోకింగ్ తదితర దురలవాట్ల వల్ల మనలో చాలా మంది వారికి తెలియకుండానే లివర్ సంబంధిత వ్యాధులకు చేరువవుతున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య చేజేతులా కొనితెచ్చుకుంటున్నదే. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో ఫ్యాటీలివర్ సమస్య కనిపిస్తోంది. నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, చిప్స్, బర్గర్స్ వంటి జంక్‌ఫుడ్స్ తినడం, ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం, సమయపాలనలేని భోజనం, ఆహారపు అలవాట్లలో మార్పులు కాలేయవాపుకు కారణమవుతున్నాయి. డయాబెటిస్ మూలంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం కూడా ఉంది. మరి లివర్ డ్యామేజ్ అయిందని తెలిపే కొన్ని సాధారణ లక్షణాలు:

ఉదరం కుడివైపున నొప్పి కొన్ని సార్లు, కాలేయం ఇన్ఫెక్షన్ వల్ల లేదా ఎన్ లార్డ్ కావడం వల్ల పొట్ట ఉదర భాగం ఉబ్బి ఉంటుంది. ఈ పరిస్థితిని వెంటనే గమనించకపోయినట్లైతే మీ బొడ్డు చుట్టూ పొట్ట మరింత విస్తరించే అవకాశం ఉంది. పొత్తికడుపు, ప్రత్యేకంగా పొత్తికడుపు పైన కుడివైపు మూలన లేదా పక్కటేముకకు కింద కుడి భాగంలో నొప్పి ఉంటే అది కాలేయం దెబ్బతిన్న లక్షణాన్ని సూచిస్తుంది.

అజీర్ణం : కాలేయం దాని పై కొవ్వు పేరుకుపోయినా లేదా కాలేయం విస్తరించినా, నీరు కూడా జీర్ణం కాలేవు. అయితే చాలా కాలం నుండి చిన్న జీర్ణ సమస్యలు ఉన్నా, తగ్గకుండా తరచూ బాధిస్తుంటే లివర్ డ్యామేజ్ లక్షణంగా గుర్తించాలి.

యూరిన్ లో మార్పులు శరీరంలోని రక్తప్రవాహంలో బిలిరుబిన్ స్థాయిలు పెరగడం వల్ల యూరిన్ పచ్చగా మారుతుంది, దెబ్బతిన్న కాలేయం వల్ల కిడ్నీల ద్వారా మలవిసర్జనను తొలగించడానికి సాధ్యపడదు.

బలహీనత మరియు అలసట కాలేయం వల్ల మన శరీరంలో అనే విటమిన్స్ మరియు మినిరల్స్ మన శరీర భాగాలకు అందజేస్తాయి. అలాకాకుండా జీవక్రియలు సరిగా పనిచేయకుండా పోవడం వంటి లక్షణాలు మీరు గుర్తించినట్లైతే అలసట మరియు బలహీనంగా కనబడుతారు. అటువంటప్పుడు లివర్ డ్యామేజ్ లక్షణాల్లో ఒకటిగా గుర్తించాలి.

అలసిన కళ్ళు మరియు కళ్ళ చుట్టు నల్లటి వలయాలు: కాలేయం మోసపూరితంగా చర్మాన్ని నాశనం చేయడం మరియు అలసటకు గురిచేయడం వంటి లక్షణాలకు గురిచేస్తుంది. కళ్ళ క్రింది చర్మ చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి ఏమాత్రం అలసనట్లు కనబడ్డి అది మీ అనారోగ్యానికి చిహ్నంగా గుర్తించాలి. తెల్లగా ఉండే కళ్ళు పసుపు పచ్చగా మరియు గోళ్ళు పసుపుగా మారినప్పుడు కామెర్లు ఏమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవాలి. అంటే కాలేయం దెబ్బతినింది దానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications