Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పొట్ట ఉబ్బరాన్ని తేలికగా తగ్గించే ఎఫెక్టివ్ టిప్స్..!!
పొట్ట ఉబ్బరాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారా ? ఇంతకు ముందు ఉన్న ఫ్లాట్ బెల్లీని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారా ? కొన్ని అలవాట్లు, డైట్ ప్లాన్ తో.. పొట్ట ఉబ్బరం తగ్గించుకోవచ్చు.
పొట్ట ఉబ్బరాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారా ? ఇంతకు ముందు ఉన్న ఫ్లాట్ బెల్లీని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారా ? కొన్ని అలవాట్లు, లైఫ్ స్టైల్ లో మార్పులు, డైట్ ప్లాన్ తో.. పొట్ట ఉబ్బరం తగ్గించడం తేలికైన పనే.

పొట్ట ఉబ్బరానికి చాలా రకాల కారణాలుంటాయి. పేగులలో గ్యాస్, కాన్ట్సిపేషన్, తినేటప్పుడు గాలి లోపలికి వెళ్లడం, కొన్ని రకాల ఆహారాల, బోవెల్ సిండ్రోమ్ వల్ల కూడా.. పొట్ట ఉబ్బరం సమస్య వస్తుంది. బ్లోటింగ్, గ్యాస్, డయేరియా, కాన్ట్సిపేషన్, పొట్టలో సమస్యలు, పొట్ట నొప్పి వంటి అనారోగ్య సమస్యల వల్ల పొట్ట ఉబ్బరం ఎదురవుతుంది.
పొట్ట ఉబ్బరాన్ని తేలికగా, త్వరగా తగ్గించే సింపుల్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. అది కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. కొన్ని అలవాట్ల ద్వారా కూడా.. పొట్ట ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు. మరి అవేంటో చూద్దాం..

ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి
కాన్ట్సిపేషన్ తగ్గించుకోవడానికి ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ధాన్యాలు, నట్స్ ని డైలీ డైట్ లో చేర్చుకుంటే.. కాన్ట్సిపేషన్ తగ్గి.. పొట్ట ఉబ్బరం తగ్గుతుంది.

పొట్ట ఉబ్బరానికి కారణమయ్యేవి
బ్రొకోలి, క్యాలిఫ్లవర్ పొట్ట ఉబ్బరానికి కారణమవుతాయి. వీటిని పూర్తీగా తినడం మానేయకుండా.. కొద్ది కొద్దిగా మీ డైట్ లో చేర్చుకుంటూ ఉండాలి. గ్యాప్ ఇస్తూ తీసుకోవాలి. అప్పుడు గ్యాస్ కి కారణమవకుండా ఉంటాయి.

ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా
తక్కువ ఉప్పు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రాసెస్డ్, క్యాన్డ్ ఫుడ్స్ లో ఎక్కువ ఉప్పు ఉంటుంది. కాబట్టి.. అలాంటి వాటిని, హై సోడియం ఫుడ్స్ ని తినకూడదు.

ఉప్పు
ఆహారాల్లో ఎంత మోతాదులో ఉప్పు వాడుతున్నారు అనేదానిపై అలర్ట్ గా ఉండాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. కాబట్టి.. వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోండి.

నెమ్మదిగా తినడం
నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవడం మంచిది. ఫాస్ట్ తినే అలవాటు ఉంటే.. ఆహారంతోపాటు గాలి పొట్టలోపలికి వెళ్లి ఉబ్బరానికి కారణమవుతుంది. అలాగే ఆహారాన్ని పూర్తీగా నమిలి మింగాలి.

తక్కువ మోతాదులో
ఎక్కువ మోతాదులో మూడు సార్లు తినడం కంటే.. ఐదు లేదా ఆరుసార్లు కొద్ది కొద్దిగా తినడం వల్ల బ్లోటింగ్ ని అరికట్టవచ్చు.

సోడా
ఆర్టిఫియల్ స్వీట్ నెస్ ఉండే డ్రింక్స్, సోడా, ఫుడ్, కార్బోనేటెడ్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. వీటిని తీసుకునే అలవాటును పూర్తీగా మానేస్తే.. బ్లోటింగ్ ని నివారించవచ్చు.

ఫ్రక్టోజ్ వద్దు
హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ పొట్ట ఉబ్బరానికి కారణమవుతుంది. కాబట్టి.. వీటికి దూరంగా ఉండటం వల్ల పొట్ట ఉబ్బరాన్ని అడ్డుకోవచ్చు.



Click it and Unblock the Notifications