Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
వార్నింగ్: హై బ్లడ్ షుగర్ ఉందని తెలిపే లక్షణాలు..!!
ఒకవేళ తరచుగా మీరు ఆకలిగా లేదా బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. క్యాలరీలు కరిగించాలని భావిస్తారు. కానీ.. దాని వెనక కారణాలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇలా ఆకలి పెరగడం, బరువు పెరగడం వంటి లక్షణాలు.. హై బ్లడ్ షుగర్ కి వార్నింగ్ సంకేతాలు అయి ఉండవచ్చు.
హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్నాయంటే.. ఖచ్చితంగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఏం తింటున్నారో గమనించాలి. అది మరింత ఎక్కువ కాకూడదంటే.. తీసుకునే ఆహారం విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.
సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, సరిపడా నిద్రపోకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల.. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగుతాయి. అయితే హై బ్లడ్ షుగర్ లెవెల్స్ తెలిపే సంకేతాలపై కాస్త అవగాహన అవసరం. అప్పుడే బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోవడం వీలవుతుంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మొదట్లోనే గుర్తించి.. సరైన కేర్ తీసుకోకపోతే.. డయాబెటిస్ వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి.. హై బ్లడ్ షుగర్ సూచించే సంకేతాలేంటో తెలుసుకుందాం. .

ఎక్కువ దప్పిక
బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే.. అదనపు షుగర్ ని ఫిల్టర్ చేయడానికి కిడ్నీలు ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. షుగర్ యూరిన్ రూపంలో తొలగించబడుతుంది. దీనివల్ల శరీరంలో డీహైడ్రేట్ కి గురై.. దప్పిక ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది.

తరచుగా ఆకలి
యూరినేషన్ లెవెల్స్ పెరిగేకొద్దీ.. క్యాలరీలు కోల్పోతారు. అలాగే హై బ్లడ్ షుగర్ లెవెల్ వల్ల..ఆకలి ఎక్కువగా ఉంటుంది. చాలా తరచుగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది.

తరచుగా యూరినేషన్
శరీరంలో అదనపు షుగర్ లెవెల్స్ ని యూరిన్ రూపంలో తొలగించడం వల్ల.. డీహైడ్రేట్ గా, దప్పికగా ఫీలవుతారు. దప్పిక తీరడం కోసం ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటారు. దీనివల్ల.. ఎక్కువ యూరినేషన్ కి పోతుంటారు.

బరువు తగ్గడం
తరచుగా యూరినేషన్ కి వెళ్తూ ఉంటే.. క్యాలరీలు కోల్పోతుంటారు. దీనివల్ల చాలా ఎక్కువగా బరువు తగ్గుతారు.

స్పర్శ కోల్పోవడం
బ్లడ్ లో అదనపు షుగర్ లెవెల్స్ ఉంటే.. నరాలు డ్యామేజ్ అవుతాయి. దీనివల్ల చేతులు, పాదాల్లో స్పర్శ కోల్పోతారు.

చూపులో సమస్యలు
బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు.. తరచుగా యూరినేషన్ కి వెళ్లడం వల్ల.. కళ్లు డ్రైగా మారతాయి. దీనివల్ల చూపులో సమస్యలు మొదలవుతాయి. బ్లర్ గా కనిపిస్తూ ఉంటుంది.

అలసట
బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. శరీరంలోని గ్లూకోజ్ సరిగా ఉపయోగించబడదు. కణాలు అవసరమైన ఎనర్జీని పొందడంలో విఫలమవుతాయి. దీనివల్ల తరచుగా అలసిపోతుంటారు.

స్కిన్ ఇన్ఫెక్షన్స్
పొడిబారిన, దురదతో కూడిన చర్మ సమస్యలు.. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కామన్. తరచుగా యూరిన్ కి వెళ్లడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కి గురై.. స్కిన్ టిష్యూస్ డ్రైగా మారతాయి. దీనివల్ల చర్మం దురదగా, ఇన్ఫెక్షన్ కి గురవుతాయి.



Click it and Unblock the Notifications