Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
రాత్రి తాగిన మత్తు దిగలేదా..హ్యాంగోవర్ చిక్కులా..ఐతే ఇలా చేయండి..
మద్యం, ఇతర మత్తు పానీయాలను మితిమీరి సేవించినప్పుడు కలిగే తీవ్ర శారీరక అసౌకర్యమే హ్యాంగోవర్ (pronounced /ˈhæŋoʊvər/). తలనొప్పి, వికారం, వెలుగును, శబ్దాలను భరించలేకపోవడం, బద్ధకం, తీవ్ర అలసట, అతిసారం, విపరీతమైన దాహం వంటివి దీని తాలూకు అతి సాధారణ లక్షణాలు. తాగిన మత్తు దిగగానే ఇవన్నీ ఒకటకటిగా వేధిస్తాయి. హ్యాంగోవర్ ఏ సమయంలోనైనా రావచ్చు. కాకపోతే రాత్రి పూట అతిగా మద్యం సేవిస్తే ఉదయం లేచినప్పుడు ఉండే పరిస్థితిని సూచించేందుకు ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. శారీరక ఇబ్బందులతో పాటు విపీతరమైన డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలకు కూడా హ్యాంగోవర్ కారణమవుతుంది.
సాధారణంగా, హ్యాంగోవర్ లక్షణాలు 24 గంటలు మాత్రమే ఉంటాయి. వివిధ రకాల ఆల్కహాల్ రకాలను కలిపి తాగటం వలన హ్యాంగోవర్ కలుగుతుంది. హ్యాంగోవర్ కు ముఖ్య కారణం- డీ హైడ్రేషన్, ఎక్కువగా నీటిని తాగటం వలన ఈ పరిస్థితి నుండి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి అనేది డీ హైడ్రేషన్ వలన కలుగుతుంది, అధికంగా నీటిని తాగటం వలన దీని నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

అల్లం టీ :
హ్యాంగోవర్ సమయం లో కలిగే తల నొప్పులకి అల్లం టీ చాలా మంచి ఔషదం. ఇది తీవ్ర తల నొప్పి నుండి ఉపశమనం కలిగించడమే కాక, కడుపు నొప్పి లేకుండా ఆల్కహాల్ జీర్ణం అవడం లో కూడా సహకరిస్తుంది.

అరటిపళ్ళు :
ఇది చికిత్స గానే కాక నివారణ గా కూడా పనిచేస్తుంది. బార్ కి వెళ్లబోయే ముందు అరటిపళ్ళను తిని వెళ్తే హ్యాంగోవర్ ప్రభావం కనిపించదు. అరటిపండులో ఉన్న పొటాసియం మరియు కార్బోహైడ్రేట్స్ వల్ల హ్యాంగోవర్ ప్రభావం కనిపించదు.

అధిక ప్రోటీన్ లు గల ఆహార పదార్థాలను తీసుకోండి.
రాత్రి తాగిన ఆల్కహాల్ వలన జరిగిన ప్రమాదాలను బదిలీ చేయిటకు, ఉదయాన తినే అల్పాహారంలో అధిక ప్రోటీన్ లు గల ఆహార పదార్థాలను తీసుకోండి.

ఉదయాన ఆల్కహాల్ ఆధారిత ద్రావణాలను తాగకూడదు.
హ్యాంగోవర్ నుండి ఉపశమనం పొందాలంటే, ఉదయాన ఆల్కహాల్ ఆధారిత ద్రావణాలను తాగకూడదు. ఉదయాన ఆల్కహాల్ తాగటం వలన హ్యాంగోవర్ నుండి తగ్గుతుందని కొందరి అభిప్రాయం. కానీ, దీని వలన హ్యాంగోవర్ స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉంది.

తాజా పండ్ల రసాలను వీలైతే టమోటా రసాలను తాగటానికి ప్రయత్నించండి.
ఆల్కహాల్ వలన శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది, కావున, అధికంగా నీటిని తాగండి లేదా ఓరల్ రీహైడ్రేషన్ ద్రవాలను తాగండి. తాజా పండ్ల రసాలను వీలైతే టమోటా రసాలను తాగటానికి ప్రయత్నించండి.

కాఫీ మరియు కెఫిన్ ఆధారిత ద్రావణాలను తాగకూడదు
కాఫీ మరియు కెఫిన్ ఆధారిత ద్రావణాలను తాగకూడదు ఎందుకంటే వీటి వలన శరీరం మరింతగా డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఒక కప్పు కాఫీ తాగటం హ్యాంగోవర్ నుండి విముక్తి కలుగుతుందని కొందరి అభిప్రాయం. కానీ ఇది నిజం కాదు.

విటమిన్ 'C' ఎక్కువగా తీసుకోవటం
విటమిన్ 'C' ఎక్కువగా తీసుకోవటం వలన శరీరంలో ఆల్కహాల్ అధికంగా విచ్చిన్నానికి గురవుతుంది. విటమిన్ 'C' ని అధికంగా కలిగి ఉండే నారింజపండు తాగటం వలన కాలేయంలో ఆల్కహాల్ విచ్చిన్నం వేగవంతం అవుతుంది.

ఆస్పిరిన్ మరియు ఐబుప్రోఫైన్ వంటి మందులను తీసుకోకూడదు
ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోవటం వలన జీర్ణాశయ గోడలు చికాకులకు గురవుతాయి కావున, ఆస్పిరిన్ మరియు ఐబుప్రోఫైన్ వంటి మందులను తీసుకోకూడదు వీటి వలన జీర్ణాశయ గోడలలో చికాకులు ఎక్కువ అవుతాయి. మిరియాలు కూడా ఎక్కువగా పొట్టలో అసౌకర్యాలకు గురి చేస్తాయి. ద్రావణ రూపంలో తయారు చేయబడిన ఆంటాసిడ్ మరియు డోపమైన 1 మాత్రలు పొట్టలో కలిగే చికాకుల నుండి మరియు వాంతుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

నిద్ర:
హ్యాంగోవర్ నుండి బయటపడేసే అత్యుతమ మార్గం నిద్ర. ఎంత ఎక్కువ సేపు నిద్రపోతే అంత త్వరగా హ్యాంగోవర్ నుండి బయటపడుతారు. కొన్ని సందర్భాలలో నిద్రపట్టదు లేదా నిద్రపోయేందుకు అవకాశం దొరకదు. కాబట్టి అలాంటప్పుడు హ్యాంగోవర్ నుండి బయటపడే ఇతర మార్గాలను గురించి ఆలోచించాలి



Click it and Unblock the Notifications