Latest Updates
-
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
ఉల్లిపాయతో వివిధ రకాల అనారోగ్యాలను నివారించుకోవచ్చు..
ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదని ఊరికే అనలేదు. ఎందుకంటే ఉల్లిపాయాలో శరీరానికి అంతర్గతంగా మరియు బహిర్గతంగా అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తుంది. వీటిని కేవలం ఉడికించి లేదా పచ్చివి తినడం వల్ల ఈ ప్రయోజనాలను పొందడం మాత్రమే కాదు, వ్యాధి సంక్రమించిన ప్రదేశంలో అప్లై చేస్తే చాలు.
అనేక హెల్త్ ప్రాబ్లెమ్స్ ను నేచురల్ గా క్యూర్ చేసే వండర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఈ ఉల్లిపాయలో ఉన్నాయి . ఒక్క ఉల్లిపాయను ఉపయోగించి అనేక వ్యాధులను నివారించుకోవచ్చు . ఉల్లిపాయతో వాంతులు, దగ్గు, జలుబు, చాతీలో నొప్పి, రొమ్ము పడిశము, చెవి నొప్పి మరియు పొట్టనొప్పి వంటినెంటినో గ్రేట్ గా నివారించుకోవచ్చు. అవును ఒక్క ఉల్లిపాయతోనే ఈ జబ్బులన్నీంటే తగ్గించుకోవచ్చు.

శరీరం మీద బహిర్గతంగా అయిన గాయాలను మరియు ఇన్పెక్షన్స్ ను మరియు వీటి ద్వారా రక్త స్రావాన్ని నివారించడంలో ఉల్లిపాయ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది బాడీ ఇన్ఫెక్షన్స్ ను నివారించి, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ యాంటీ బయోటిక్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఉల్లిపాయలో క్యూర్సిటిన్ వంటి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. వివిధ రకాల వ్యాధులకు కారణమయ్యే శరీరంలోని టాక్సిన్స్ ను శరీరం నుండి ఉల్లిపాయ తొలగిస్తుంది .

ఉల్లిపాయ రసం శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. చాతీలో చేరిన అన్ని శ్లేష్మం (కఫం) బహిష్కరించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు జాయింట్ పెయిన్, డయాబెటిస్, హార్ట్ సమస్యలను సమర్థవంతంగా నివారిస్తుంది. మరి ఉల్లిపాయ వివిధ రకాల వ్యాధులను ఏవిధంగా తగ్గిస్తుందో చూద్దాం...

దగ్గు: ఉల్లిపాయను రెండు గా కట్ చేయాలి. ఉల్లిపాయ లోపలి బాగంలో ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ అప్లై చేయాలి. ఇలా ప్రతి ఒక్క లేయర్ అప్లై చేసిన తర్వాత, ఇప్పుడు ఈ రెండు భాగాలను క్లోజ్ చేసి, ఒక జార్లో పెట్టాలి. ఒక గంట తర్వాత బయటకు తీసి రోజుకు రెండు సార్లు తీసుకుంటే దగ్గును నివారిస్తుంది.

జ్వరంగా ఉన్నప్పుడు ఉల్లిపాయ హైబాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుంది. ఉల్లిపాయను రెండుభాగాలుగా కట్ చేసి, సగం ఒక కాలి పాదం క్రింద, మరో సగం మరో కాలి పాదం క్రింద ఉంచాలి. తర్వాత సాక్సులు ధరించి రాత్రంతా అలాగే పడుకోవాలి. ఇలా చేయడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. ఉల్లిపాయలు శరీరంలోని టాక్సిన్స్ మరియు జబ్బులను నివారిస్తుంది.

వికారం: ఉల్లిపాయలను గ్రైండ్ చేసి అందు నుండి రసాన్ని తియ్యాలి. ఇప్పుడు స్ట్రాంగ్ గా పుదీనా టీ తయారుచేసి, 2చెంచాలా ఉల్లిపాయ రసాన్ని త్రాగాలి, 5నిముషాల తర్వాత 2 చెంచాల చల్లటి పుదీనా టీ త్రాగాలి మరియు 5 నిముషాల తర్వాత దీన్ని రిపీట్ చేయాలి. ఇలా చేస్తుంటే వాంతులు త్వరగా తగ్గుతాయి.
రక్తస్రావం ఆపు చేస్తుంది: ఉల్లిపాయను కట్ చేసి ఉల్లిపాయ ఔటర్ స్కిన్ ను తెగిన గాయం చుట్టూ చుట్టాలి. ఇది రక్తస్రావాన్ని వెంటనే తగ్గిస్తుంది . మరియు గాయం చుట్టూ క్రిములు చేరకుండా నాశనం చేస్తుంది.
జలుబు దగ్గు నివారిస్తుంది: ఉల్లిపాయను పేస్ట్ చేసి అందులో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేయాలి . ఈ పేస్ట్ ను చాతీ మీద అప్లై చేయాలి. తర్వాత టవల్ ను కప్పాలి. లేదా రాత్రుల్లో ఇలా చేసి టీషర్ట్ ధరించి పడుకోవడం వల్ల జలుబు, దగ్గు, కఫం తగ్గుతుంది.
చెవి నొప్పి , చెవి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది:చెవి నొప్పిని మరియు ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ సహాయపడుతుంది. ఉల్లిపాయ పేస్ట్ ను నొప్పిగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి . ఆప్రదేశంలో క్లాత్ తో చుట్టేయాలి .
పిల్లల్లో పొట్టనొప్పి తగ్గిస్తుంది పిల్లల్లో పొట్టనొప్పిని నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకు చేయాల్సిందల్లా, ఉల్లిపాయను కొద్దిగా నీటిలో వేసి ఉడికించాలి . ఆనియన్ వాటర్ కూల్ గా అయిన తర్వాత , ఈ వాటర్ ను ఒక చెంచా పిల్లలకు త్రాగిస్తే తక్షణ రిలీఫ్ పొందుతారు . గంటకొక్కోసారి ఇస్తుంటే నొప్పి నివారించబడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
