Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
రక్తహీనత నివారించడానికి, హీమోగ్లోబిన్ పెంచే ఆయుర్వేదిక్ రెమెడీస్
హీమోగ్లోబిన్ అనే ఒక రకమైన ప్రోటీన్ ఆర్ బిసి(రెడ్ బ్లడ్ సెల్స్ ) లో అధికంగా ఉంటుంది. ఆ ప్రోటీనే ఐరన్ . ఈ ప్రోటీన్ అనేక జీవక్రియలు నిర్వర్థించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. హీమోగ్లోబిన్ అనేది శరీరంలో ఆక్సిజన్ ను ఊపిరితిత్తులకు ట్రాన్స్ పోర్ట్ చేస్తుంది. అక్కడి నుండి మన శరీరంలోని ఇతర భాగాలు సప్లై అవుతుంది. అలాగే కార్భన్ డై ఆక్సైడ్ ను CO2 ను తిరిగి ఊపిరితిత్తులు పీల్చుకుంటాయి.
మన శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా పనిచేయాలంటే, హెల్తీ లెవల్లో హీమోగ్లోబిన్ పుష్కలంగా ఉండాలి.
సాధారణంగా మగవారిలో హీమోగ్లోబిన్ 14-18mg/dl, మరియు ఆడవారిలో 12-16mg/dl ఉండాలి. శరీరంలో సరిపడినంత హీమోగ్లోబిన్ లేనప్పుడు అలసట, వికారం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, పేల్ స్కిన్, ఆకలి తక్కువగా ఉండం మరియు హార్ట్ బీట్ పెరగడం వంటి లక్షణాలు కనబడుతాయి.

శరీరంలో క్రమంగా హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల అనీమియాకు దారితీస్తుంది . శరీరంలో హీమోగ్లోబిన్ తగ్గడానికి వివిధ రకాల కారణాలున్నాయి. ఒకటి ప్రెగ్నెన్సీ, ఎక్సెసివ్ పీరియడ్స్, ఫోలిక్ యాసిడ్ , ఐరన్, విటమిన్ 12 లోపించడం, బ్లడ్ డొనేట్ చేయడం, బోన్ మారో, క్యాన్సర్, మరియు జీర్ణ సంబంధిత సమస్యలున్నప్పుడు హీమోగ్లోబిన్ తగ్గుతుంది.
హీమోగ్లోబిన్ పెంచడానికి ఆయుర్వేదం చక్కగా పనిచేస్తుంది. కొన్ని రకాల హెర్బ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హీమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచే ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం..

ఉసిరికాయ: ఉసిరికాయ తినడానికి వగరుగా మరియు పుల్లగా, ఉంటుంది. కానీ హీమోగ్లోబిన్ పెంచడంలో చాలా మంచి టేస్ట్ కలిగి ఉంటుంది. ఇందులో మినిరల్స్, ఐరన్, మరియు విటిమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది హీమోగ్లోబిన్ పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గుగ్గుల్:
ఆయుర్వేదంలో గుగ్గుల్ ఎక్కువగా రెకమెండ్ చేస్తున్నారు . దీన్ని ఆయుర్వేదంలో చక్రసంహిత అని పిలుస్తారు. ఇందులో అద్భుతమైన మ్యాజికల్ లక్షణాలున్నాయి. శరీరంలో కణాలు, రక్తకణాలను పునరుత్తేజపరిచే గుణాలు పుష్కలంగా ఉన్నాయిజ అందుకే హెర్బల్ మెడిసిన్ గా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షనాలు పుష్కలంగా ఉన్నాయి. కడుపుబ్బరం, పియంఎస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహయాపడుతుంది.
హరిటాకి: హరిటాకి ఇది ఒక వండర్ ఫుల్ మెడిస్ . ఇందులో అనేక హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి . అనీమియా నివారించడంలో ఆయుర్వేదంలో ఇది ఒక గొప్ప హెర్బల్ రెమెడీ. రెడ్ బ్లడ్ సెల్స్ లోపించడం వల్ల, హీమోగ్లోబిన్ లోపాన్నినివారించడానికి హారిటాకి చాలా ఉపయోగకరమైనది. దీన్ని తేనెతో మరియు నెయ్యితో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల లో హీమోగ్లోబిన్స్ లెవల్స్ పెరుగుతాయి.

అశ్వగంధ: ఆయుర్వేదంలో అశ్వగంధ బాగా పాపులరైన హెర్బ్ . ఆయుర్వేదంలో అడాప్టోజెనిక్ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి . దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ క్రమంగా పెరుగుతుంది దాంతో హీమోగ్లోబిన్ లెవల్స్ కూడా పెరుగుతాయి . మరియు ఇది బ్లడ్ ప్యూరిఫైయ్యర్ గా మరియు యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

బీట్ రూట్ :
బీట్ రూట్ ను రక్తకణాలను పునరుత్తేజపరుస్తుంది . శరీరంలో ఐరన్ లెవల్స్, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, ఫాస్పరస్, మరియు వివిధ రకాల న్యూట్రీషియన్స్ పెరగడానికి సహాయపడుతుంది. న్యూట్రీషియన్స్ పెరగడం వల్ల హీమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి.

ఆప్రికాట్లు:
ఆప్రికాట్లు, ప్రూనే, డేట్స్ మరియు రైసిన్స్ వంటి ఎండిన పండ్లు వంటివి హెమోగ్లోబిన్ లభించే అద్భుతమైన వనరులు. ఎండిన పండ్లలో అదికంగా ఉన్న ఇనుము పదార్ధం హెమోగ్లోబిన్ పెంచటానికి సహాయపడుతుంది. ఇవి శరీరానికి కావలసిన ఇతర పోషకాలు మరియు విటమిన్లు కూడా అందిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications