For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బి అలర్ట్ : అజినోమోటో ఒక సైలెంట్ కిల్లర్ ...

|

గతంలో భోజనం చేయడమంటే కేవలం ఇంట్లో వంట చేసుకుని తినడమే. బైటినుంచి పదార్థాలు తెచ్చుకుని తినడమనేది చాలా అరుదుగా జరిగేది. కాని ప్రస్తుతం కాలం మారిపోయింది. ఏ ఇంట్లో చూసినా తినడానికి సిద్ధంగా ఉండే పదార్థాలు (రెడీ టు ఈట్‌) దర్శనమిస్తున్నాయి.

మొబైల్ వాడకం వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు!

అయితే దీనితోపాటు ప్రజల్లో కొంత చైతన్యం కూడా పెరిగింది. గుడ్డిగా ఏదిపడితే అది కొనుక్కుని తినే పరిస్థితిలో ప్రజలు లేరు. తాము తీసుకుంటున్న ఆహార పదార్థాలలో ఏఏ దినుసులు మిళితం చేసి తయారు చేశారనే విషయాన్ని ఆయా ప్యాకెట్ల లేబుల్స్‌పై చూస్తున్నారు. ఈ రకమైన చైతన్యం ఆహార పదార్థాలు రుచిగా ఉండేందుకు అందులో కలిపే అజినామోటోపై విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి.

మహిళలు బ్రా ధరించి నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే హానికరమైన దుష్ప్రభావాలు

అజినామోటో శాస్త్రీయ నామం మోనోసోడియం గ్లూటమేట్‌. ప్యాకెట్లలో లభ్యమయ్యే అనేక రకాల ఆహార పదార్థాలలో దీనిని ఉపయోగిస్తున్నారు. తొలినాళ్లలో కేవలం చైనాకు చెందిన ఆహార పదార్థాలను తయారు చేయడంలో మాత్రమే దీనిని ఉపయోగించేవారు. కాని ప్రస్తుతం అన్ని రకాల ఆహారాల్లోనూ దీనిని విరివిగా వాడుతున్నారు.

రెడీ టు ఈట్‌ పదార్థాల ప్యాకెట్లపై లేబుల్‌ను నిశితంగా పరిశీలిస్తే అందులో వాడిన దినుసుల జాబితాలో ఖచ్చితంగా అజినామోటో పేరు కూడా కనిపిస్తుంది. నూడుల్స్‌ వంటి పదార్థాల్లోనే కాకుండా చివరకు ఆలు చిప్స్‌ వంటి పదార్థాల్లో కూడా దీని వాడకం కనిపిస్తుంది.

సాఫ్ట్ డ్రింక్స్ త్రాగుతున్నారా? హెల్త్ ఎఫెక్ట్స్ గురించి తెలసుకోండి

జపాన్‌కు చెందిన అజినామోటో కార్ప్‌ దీనిని తొలిసారిగా 1909లో కనుగొన్నది. ఇది ఆహార పదార్థాలకు మరింత సువాసనాభరితంగా ఉండేట్లు చేస్తుంది. అంతేకాకుండా దీనికి అలవాటుపడేలా చేస్తుంది. అజినామోటో అతి తక్కువ ధరకే లభ్యం కావడమనేది ఆహర పదార్థాలు తయారు చేసే కంపెనీలకు ఒక వరంగా మారింది. దీనిని ఉపయోగించడం వారికి లాభాలను చేకూర్చిపెట్టింది. ప్రస్తుతం దీని వాడకం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

అజినామోటో వల్ల కలిగే అనర్థాలేంటో పరిశీలిద్దాం.

 తలనొప్పి :

తలనొప్పి :

మోనోసోడియం గ్లూటమేట్‌ ప్రధాన దుష్పరిణామం తలనొప్పి. అయితే ఇది చిన్న సమస్య మాత్రమే. ఈ తలనొప్పి నెమ్మదిగా మైగ్రేన్‌గా రూపాంతం చెంది తరువాత కాలంలో తీవ్ర సమస్యలకు కారణమయ్యే అవకాశాలున్నాయి. తలనొప్పి తీవ్రంగా రావడమే కాకుండా, పదేపదే వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

నొప్పి :

నొప్పి :

ముఖంలోనూ, మెడ భాగంలోనూ మంటగా , నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలను కొంతమంది ఎదుర్కొంటున్నారు.

 నాడీ వ్యవస్థపై ప్రభావం :

నాడీ వ్యవస్థపై ప్రభావం :

అజినామోటో వల్ల నాడీ మండల వ్యవస్థ దెబ్బ తింటుంది. నరాలు మొద్దుబారడం, చిటపటమంటున్నట్లు ఉండటం, ముఖంలోనూ, మెడ భాగంలోనూ మంటగా అనిపించడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. మత్తుగా ఉన్న భావన, బలహీనత కనిపిస్తాయి. నరాల క్షీణత కారణంగా సంభవించే పార్కిన్‌సన్స్‌, అల్జీమర్స్‌, హంటింగ్టన్స్‌, మల్టిపుల్‌ స్ల్కీరోసిస్‌ తదితర వ్యాధులు సోకడానికి అజినామోటో కారణమవుతుంది.

గుండె జబ్బులు :

గుండె జబ్బులు :

గుండె కొట్టుకునే క్రమాన్ని అజినా మోటో దెబ్బ తీస్తుంది. ఛాతీ నొప్పి, హఠాత్తుగా గుండె వైఫల్యం చెందడం వంటి సమస్యలకు కారణమవుతుంది.

మహిళలకు మంచిది కాదు :

మహిళలకు మంచిది కాదు :

అజినామోటో వల్ల స్త్రీలలో వంధ్యత్వం కలిగే అవకాశాలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గర్భిణీ స్త్రీలు అజినామోటో ఉన్న ఆహారాలను తీసుకోకూడదు. శిశువులకు అజినామోటో ఉన్న ఆహారాలను ఇవ్వకూడదు.

బ్లడ్ ప్రెజర్:

బ్లడ్ ప్రెజర్:

మరికొన్ని పరిశోధనలు మరికాస్త ముందుకెళ్లి అజినోమోటో రెగ్యులర్ గా తీసుకొనేవ వారిలో బ్లడ్ ప్రెజర్ పెరుగుతున్నట్లు నిర్ధారించారు

చెమటలు ఎక్కువగా పట్టడం:

చెమటలు ఎక్కువగా పట్టడం:

అజినోమోటోను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల చెమటలు అధికంగా పట్టడుతాయి. అయితే ఇది భయపడాల్సినంత సీరియస్ సైడ్ ఎపెక్ట్ కాకపోయినా, నలుగురిలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

వికారం:

వికారం:

వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీన్ని తీసుకోవడం వల్ల కొన్ని సందర్బాల్లో వికారానికి గురి కావల్సి వస్తుంది.

 ఊబకాయం:

ఊబకాయం:

కొన్ని పరిశోధనల ద్వారా..ఈ అజినోమోటోను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల, ఇది మరింత ఇష్టంగా తినేలా చేస్తుంది. దాంతో ఇది ఒక అలవాటుగా మారుతుంది. క్రమంగా బరువు, పెరిగి, ఊబకాయగ్రస్తులగా మార్చే గుణాలు అజినోమోటోలో పుష్కలంగా ఉన్నాయి

ఇతర సమస్యలు :

ఇతర సమస్యలు :

క్యాన్సర్, ఫుడ్ అలర్జీ, కంటి సమస్యలు, అధిక రక్తపోటు, ఉదరకోశ సంబంధ రుగ్మతలు, థైరాయిడ్‌ పనితీరు దెబ్బ తినడం, స్థూలకాయం, ఆస్తమా, టైప్‌ 2 మధుమేహం, హార్మోన్లలో అసమతుల్యత, ఆటిజం, ఎలర్జీలు మొదలైన అనేక సమస్యలకు అజినామోటో కూడా కారణమవుతున్నది.

English summary

Be Alert: Ajinomoto Is A Silent-Killer

Be Alert: Ajinomoto Is A Silent-Killer, The actual name of Ajinomoto is Monosodium Glutamate. If you love Chinese food, you must be aware of this ingredient. Well, though it makes the food tasty, it isn't healthy.
Story first published:Saturday, January 2, 2016, 13:13 [IST]
Desktop Bottom Promotion