Latest Updates
-
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు
చౌకైన నిమ్మరసం డైట్ తో.. ఫ్యాట్ కరిగించడం ఈజీ
సాధారణంగా నిమ్మరసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది చాలా ఈజీగా తయారు చేయవచ్చు.. టేస్టీగానూ ఉంటుంది. ఎవరైనా అనుకోని అతిథులు వచ్చారంటే.. కాఫీ తర్వాత గుర్తొచ్చేది నిమ్మరసమే. నిమ్మరసంను వేసవిలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అయితే వేసవిలోనే కాకుండా.. అన్ని కాలాలలోనూ అందుబాటులో, అనుకూలంగా ఉంటుంది ఇది. దీన్ని నిత్యం ఉదయాన్నే తీసుకుంటే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
చాలామంది నిమ్మరసం తాగితే.. జలుబు చేస్తుందని భావిస్తారు. కానీ.. ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా అవసరం. అందరికీ అందుబాటు ధరలో ఉండే నిమ్మరసంతో రోజుని ప్రారంభిస్తే ఆ కిక్కే వేరట. అలా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

బరువు తగ్గడానికి
బరువు తగ్గాలని కోరుకునే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరైతే.. బరువు తగ్గి స్లిమ్ గా తయారవ్వాలని కోరుకుంటారో.. వాళ్ల ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవాలి. ఇది చాలా ఈజీ పరిష్కారం. అలాగే కాలేయానికి హాని కలిగించే మలినాలను, జీర్ణవ్యవస్థకు హాని కలిగించే పదార్థాలను నిమ్మరసం శరీరం నుంచి బయటకు పంపుతుంది.

రోగనిరోధక శక్తి
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, బయోఫ్లావనాయిడ్స్ శరీర నిరోధక వ్యవస్థకు శక్తినిస్తాయి. రోజంతా ఉల్లాసంగా ఉండటానికి కావాల్సిన పోషకాలన్నింటినీ ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల పొందవచ్చు.

జీర్ణక్రియకు
నిమ్మరసంలో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణక్రియ సజావుగా జరిగేలా చేస్తుంది. అలాగే కడుపులో ఇబ్బందికి గురిచేసే ఎసిడిటి, మంట, గ్యాస్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

స్కిన్ హెల్త్
రోజుని నిమ్మరసం తాగటం ద్వారా ప్రారంభిచడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. నిమ్మరసంలో ఉండే పోషకాలు.. ముఖంపై ఉన్న మచ్చలు, నల్లటి వలయాలు, మొటిమలను తొలగిస్తాయి.

ఫ్రెష్ ఫీలింగ్
నిమ్మరసం రోజు ఉదయాన్నే తీసుకోవడం వల్ల తాజాగా ఉంటారు. రోజు మొత్తం చురుకుగా గడిపేస్తారు.

ఇన్ఫెక్షన్స్
నిమ్మరసంలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని రకాల ఇన్ఫెక్షన్ లతో పోరాడతాయి. రెగ్యులర్ గా నిమ్మరసం తీసుకుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్య దరిచేరదు.

కిడ్నీల్లో స్టోన్స్
ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. అలాగే శరీరం తేమ కలిగి ఉండటానికి సహాయపడుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా కాపాడుతుంది.

డయాబెటీస్
మధుమేహంతో బాధపడే వాళ్ల నిమ్మరసం సరైన పరిష్కారం. దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే.. రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థితికి చేరకుండా కాపాడుతుంది.

క్యాన్సర్
నిమ్మరసం క్యాన్సర్ నివారణ కారకాలను కలిగి ఉంటుంది. ఇవి క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. అంతేకాదు నిమ్మరసంలో ఉండే పొటాషియం స్థాయిలు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతాయి.

ఒత్తిడి
ఒత్తిడికి లోనైనప్పుడు నిమ్మరసం తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసి ఉపశమనం కలిగిస్తాయి.
చూశారు ఉదయం నిమ్మరసంతో పొందే ప్రయోజనాలేంటో. ఇంకెందుకు ఆలస్యం ఉదయాన్నే నిమ్మరసం తాగటం అలవాటుగా మార్చుకోండి.



Click it and Unblock the Notifications