Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
వెల్లుల్లితో.. క్యాన్సర్లు నివారించవచ్చా ?
వెల్లుల్లి.. ! మనం ఎక్కువగా ఉపయోగించే పదార్థం. మసాలా వంటకాల్లో వెల్లుల్లి కంపల్సరీ. అలాగే నాన్ వెజ్, వెజ్, వెజిటబుల్ పలావ్, మసాలా రైస్ ప్రతి ఒక్కదానిలో వెల్లుల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. నిత్యం ఏదో ఒక విధంగా దీనిని డైట్ లో చేర్చుకుంటాం. కానీ కొంతమంది వెల్లుల్లి వాసనను, వెల్లుల్లి రుచిని ఇష్టపడకపోవచ్చు. అలాగే వంటకాల్లో కనిపించే వెల్లుల్లి ముక్కలు కొంతమంది పిల్లలు పక్కనపెడతారు. కానీ ఇకపై అలా చేయకుండా.. తినడానికి ప్రోత్సహించండి.
పరగడుపుతో చేసే ఈ పనులు వల్ల ఆరోగ్యానికి హాని ఎక్కువ

వెల్లుల్లితో పొందే అమోఘమైన ప్రయోజనాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రధానంగా వెల్లుల్లిలో క్యాన్సర్ తో పోరాడే అద్భుతమైన గుణం ఉంది. వెల్లుల్లిలో రకరకాల క్యాన్సర్ లకు చెక్ పెట్టే సత్తా ఉందంటున్నారు నిపుణులు. శరీరంలోని పేరుకునే చెడు కొవ్వు మోతాదును తగ్గించడానికి వెల్లుల్లి తోడ్పడుతుంది. వీటిని పచ్చిగానే తిన్నా చాలా ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నాయి అధ్యయనాలు.
వెల్లుల్లిలోని 15 పవర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్

వెల్లుల్లి ఘాటు వాసన అందులో ఎక్కువగా ఉండే గంధక రసాయనాల వల్ల వస్తుంది. దీనిలోని అజోయేన్ రక్తం గడ్డలు కట్టకుండా కాపాడుతుంది. అలిసిన్ అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్‌గా పని చేస్తుంది. ఇది రకరకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి అరికడుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా జరగడానికి సహాయపడుతుంది. దీనివల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

వెల్లుల్లిలోని డయాలీల్ సల్ఫైడ్లు ఫెర్రోపోర్టిన్ ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఇనుము సంబంధ జీవక్రియలు మరింత మెరుగ్గా సాగడానికి తోడ్పడుతుంది. అలాగే వెల్లుల్లిలోని ఆలీల్ సల్ఫైడ్‌లు కొన్నిరకాల క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో వెల్లుల్లి చేర్చుకోవడం చాలా అవసరం. ఒకవేళ పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే.. వెల్లుల్లి పేస్ట్ ని వంటకాల్లో ఉపయోగిస్తే సరిపోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
