Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
జ్ఞాపకశక్తి పెంచడంతోపాటు, బ్రెయిన్ ని షార్ప్ గా మార్చే.. టేస్టీ జ్యూసులు..!!
మనం సూపర్ మార్కెట్ లో కొనే అన్ని డ్రింక్స్ పై హెల్తీ అనే లేబుల్ ఉంటుంది. కానీ.. ఎక్కువ పంచదార, క్యాలరీలు శరీరంలోకి తీసుకొస్తాయి. అవి హెల్తీగా ఉంటాయి, అలాగే టేస్టీగా ుంటాయి. అందుకే వాటిని హెల్త్ డ్రింక్స్ అని పిలుస్తారు. కానీ.. మీరే ఇంట్లో ఈ డ్రింక్స్ ప్రిపేర్ చేసుకుంటే.. శారీరకంగా చాలా స్ట్రాంగ్ గా అలాగే.. మానసికంగా హెల్తీగా ఉంటారు.

శరీరంలాగే.. మెదడుకి కూడా.. సరైన పోషకాలు అవసరం. అప్పుడు మెదడు యాక్టివ్ గా, హెల్తీగా ఉంటుంది. సరైన ఆహార పదార్థాలు.. మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఏకాగ్రత పెరగడానికి, జ్ఞాపకశక్తి మెరుగవడానికి సహాయపడతాయి. ఇప్పుడు చెప్పబోయే 12 హెల్తీ డ్రింక్స్.. మీ బ్రెయిన్ పవర్ ని పెంచడంతో పాటు.. ఈజీగా తయారు చేసుకోవచ్చు.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

దానిమ్మ జ్యూస్
దాన్నిమ్మ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి సహాయపడతాయి. కాబట్టి.. దానిమ్మ జ్యూస్ ని ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకోండి.

యాపిల్ జ్యూస్
యాపిల్ జ్యూస్ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు సంబంధించిన సమస్యలు నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా వయసు పైబడినవాళ్లకు ఇది అద్భుతమైన ఔషధం.

ఆరంజ్ జ్యూస్
ఆరంజ్ జ్యూస్ లో ఎక్కువ ఫ్లేవనాయిడ్ కంటెంట్ ఉంటుంది. ఇది.. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది.

కొబ్బరినీళ్లు
కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోసైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరుస్తాయి. దీనివల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

అలోవెరా జ్యూస్
అలోవెరా జ్యూస్ లో విటమిన్ బి6 ఎక్కువగా ఉండటం వల్ల.. ఇది బ్రెయిన్ పవర్ ని మెరుగుపరచడంతో పాటు.. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

గ్రీన్ టీ
గ్రీన్ టీ.. ఏకాగ్రత లోపించకుండా అడ్డుకుంటుంది. అలాగే జ్ఞాపకశక్తి పెరగడానికి, బ్రెయిన్ నెగటివ్ చేంజెస్ రాకుండా అడ్డుకుంటుంది.

ఆల్మండ్ మిల్క్ షేక్
ఆల్మండ్ మిల్క్ షేక్ లో ప్రొటీన్, డొఫామైన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి.. మెదడు పనితీరుని మెరుగుపరిచి.. మెమరీని పెంచుతాయి.

కెఫీన్
కెఫీన్ మెమరీని పెంచడంతో పాటు, ఆలోచనా శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే ఏకాగ్రత చురుగ్గా ఉండేలా చేస్తుంది.

టమోటా జ్యూస్
టమోటాల్లో లైకోపెన్ ఉంటుంది. ఇది అల్జీమర్స్ వ్యాధి రిస్క్ ని తగ్గిస్తుంది. డిమెంటియాతో పాటు, ఇతర మెదడు సమస్యలను నివారిస్తుంది.

దాల్చిన చెక్క, పసుపు టీ
దాల్చిన చెక్క, పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. అల్జీమర్స్ వ్యాధి రిస్క్ ని తగ్గిస్తాయి.

డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడుకి రక్త ప్రసరణను పెంచుతాయి. దీనివల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అన్ని విషయాల్లో చాలా షార్ప్ గా ఆలోచించే శక్తి పొందుతారు.

బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్ జ్యూస్ మెదడుకి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే.. డిమెంటియా ఛాన్సెస్ ని తగ్గిస్తుంది. అలాగే.. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.



Click it and Unblock the Notifications
