Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
క్యాన్సర్ నివారించడానికి, అరికట్టడానికి సహాయపడే ఆహారాలివే.. !
క్యాన్సర్ నివారించడానికి, అరికట్టడానికి సహాయపడే ఆహారాలివే.. !
ప్రాణాంతక, భయంకరమైన క్యాన్సర్ అంటే.. అందరికీ గుండె దడే. అయితే.. ఈ క్యాన్సర్ నివారించాలన్నా, ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా.. ఆహారం చాలా ముఖ్యమైనది. క్యాన్సర్ తో పోరాడాలంటే.. తీసుకునే ఆహారంలో మార్పులు తీసుకురావాలి. కొన్ని రకాల ఆహార పదార్థాల్లో క్యాన్సర్ తో పోరాడే.. గుణాలు మెండుగా ఉంటాయి. అలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
వరల్డ్ క్యాన్సర్ డే 2016: క్యాన్సర్ మహమ్మారిని హాంఫట్ చేసే ఆహారం...
రోగాలను నయం చేయాలంటే.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందించాలి. అవి కూడా ఆహారం ద్వారానే సాధ్యమవుతుంది. క్యాన్సర్ తో బాధపడేవాళ్లకు రెగ్యులర్ వ్యాయామంతోపాటు, హెల్తీ ఫుడ్ కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తుందని.. దీనివల్లే వాళ్ల ఆయుష్షు పెంచవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
గుడ్ న్యూస్: క్యాన్సర్ తో పోరాడే దివ్యౌషధం మీ చేతుల్లోనే..!
క్యాన్సర్ తో పోరాడటానికి మందులు తమదైన శైలిలో పోరాడితే.. డైట్ లో చేర్చుకునే ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ నివారించడానికి, నిరోధించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇక్కడున్న సింపుల్ డైట్ ఒకసారి చెక్ చేసుకుని.. డాక్టర్ ని సంప్రదించి ఫాలో అయితే మంచిది. క్యాన్సర్ తో పోరాడే పవర్ ఫుల్ ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ మీకోసం..

బీట్ రూట్
బీట్ రూట్స్ లో ఆథోసైయానిన్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ సెల్స్ తో పోరాడతాయి. బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ నిరోధించడానికి బీట్ రూట్స్ సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

వెల్లుల్లి
వెల్లుల్లిలో ఎల్లుసిన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ సెల్స్ విస్తరించకుండా అరికడతాయి. అలాగే సెలీనియం, ట్రైప్టోఫాన్ ని అందిస్తాయి.

గ్రీన్ వెజ్జీస్
లీఫ్ గ్రీన్స్ అయిన క్యాబేజ్, బ్రొకోలి, వంటి ఆహార పదార్థాలలో సల్ఫోరఫేన్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ ని నిరోధిస్తాయి. కొలెరెక్టల్ క్యాన్సర్ నివారిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

టొమాటొ
టమోటాలలో లైకోపిన్ ఉంటుంది. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ తో పాటు ఇతర క్యాన్సర్లు రాకుండా కాపాడటంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే రొమ్ము, లంగ్, కొలాన్ క్యాన్సర్లను కూడా అరికట్టవచ్చు.

మష్రూమ్స్
క్యాన్సర్ తో పోరాడటంలో మష్రూమ్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని స్టడీస్ చెబుతున్నాయి.

నట్స్
కొన్ని రకాల నట్స్ లో సెలినియం ఉంటుంది. ఇది క్యాన్సర్ సెల్స్ లో పోరాడటానికి చాలా ఇంపార్టెంట్. అలాగే నట్స్ లో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ మెరుగ్గా ఉంటుంది.

గుమ్మడి విత్తనాలు
గుమ్మడి విత్తనాల్లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ని అరికడతాయి. అలాగే ఇమ్యునిటీకి కూడా ఈ విత్తనాలు మంచిది.

సన్ ఫ్లవర్ సీడ్స్
సన్ ఫ్లవర్ సీడ్స్ లో విటమిన్ ఈ, జింక్ ఉంటాయి. ఇవి ఎలాంటి వ్యాధినైనా నివారించడానికి చాలా చక్కగా సహాయపడతాయి. అలాగే త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.

రెడ్ పెప్పర్
రెడ్ పెప్పర్ లేదా క్యాప్సికమ్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యునిటీ పవర్ పెంచడంతో పాటు.. క్యాన్సర్ తో పోరాడటానికి సహాయపడుతుంది.

క్యారట్
క్యారట్ జ్యూస్ క్యాన్సర్ తో పోరాడే వాటిలో చాలా పవర్ ఫుల్. ఇందులో ఉపశమనం కలిగించే ఎన్నో రకాల సద్గుణాలు ఉంటాయి.

చేపలు
చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటితో ఇతర పోషకాలు శరీరంలో ఉండే క్యాన్సర్ సెల్స్ తో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.
చూశారుగా.. క్యాన్సర్ తో బాధపడుతున్నవాళ్లు, క్యాన్సర్ కి దూరంగా ఉండాలన్నా.. ఈ ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications
