Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల శరీరానికి జరిగే అనర్ధాలు..!
బ్రేక్ ఫాస్ట్... ఇది మన పదం కాదు... మన అలవాటు కాదు... కాని ఆరోగ్యానికి మంచిది... ఆయుష్షును పెంచేది కాబట్టి దీన్ని మన ఆహారపు అలవాట్లలో ఒకటి చేసుకున్నాం. మనం రోజూ రకరకాల సమయాల్లో ఆహారం తీసుకుంటున్నాం. ఉదయం తీసుకునేది బ్రేక్‌ఫాస్ట్ అని, మధ్యాహ్నం తీసుకునేది లంచ్ అని, సాయంత్రం తీసుకునేది డిన్నర్ అని అంటున్నాం. ఇవన్నీ బ్రిటన్ నుంచి మనం దిగుమతి చేసుకున్న వ్యవహారాలే. రాత్రి డిన్నర్‌కు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు మధ్య 12 గంటలపాటు నిరాహారంతో ఉంటాం. అంటే సుదీర్ఘ విరామం తర్వాత మనం ఫాస్టింగ్‌ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి దీనికి బ్రేక్ ఫాస్ట్ అనే పేరు వచ్చిందని చెప్పవచ్చు.
పెద్దలు కానీ, పిల్లలు కానీ, ముఖ్యంగా మహిళలు బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం చాలా చెడ్డ అలవాటు. ఎందుకంటే, ఎప్పైడైతే మనం బ్రేక్ ఫాస్ట్ ను దాటవేస్తామో, అప్పుడు మన శరీరంలో శక్తి తగ్గిపోతుంది. జీవక్రియలు ఆలస్యం అవుతాయి. అది మన శరీర ఆరోగ్యానికి మంచిది కాదు.
మీరు లేట్ గా నిద్రలేవడం మరియు బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం, వంటివి రొటీన్ గా ఉన్నట్లైతే, వెంటనే మీరు ఈ పద్దతిని మార్చుకోవాలి. మీరు డైట్ లో ఉన్నప్పుడు, మీరు ఖచ్చితంగా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు లాస్ట్ మీల్స్ తీసుకొన్న 7-8గంటల తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. ఆ ఏడు, ఎనిమిది గంటల్లో మీరు కోల్పోయిన ఎనర్జీని తిరిగి పొందడానికి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. మరియు అవసరం. అయినా కూడా మీరు ఇప్పటికీ బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయాలని చూస్తుంటే, దాని వల్ల ఎదురయ్యే సమస్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి వాటిని పరిశీలించండి...

హార్ట్ అటాక్:
బ్రేక్ ఫాస్ట్ తీసుకునే వాళ్లతో పోల్చితే.. బ్రేక్ ఫాస్ట్ మానేసే వాళ్లకు హార్ట్ ఎటాక్ రావడానికి 27 శాతం ఎక్కువ అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ నుంచి బయటపడవచ్చు. టిఫిన్ తినకపోవడం వల్ల హైపర్ టెన్షన్ రిస్క్ కూడా ఉంది. ఆరోగ్యానికి, ఆహారపు అలవాట్లకు చాలా దగ్గర సంబంధం ఉందని.. హార్వర్డ్ యూనివర్సిడీ స్టడీలో తేలింది.

డయాబెటిస్ :
బ్రేక్ ఫాస్ట్ తినకుండా మానేసే మహిళల్లో టైప్ 2 డయాబెటీస్ రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అలాగే బ్రేక్ ఫాస్ట్ మానేసే వర్కింగ్ ఉమెన్స్ కి డయాబెటీస్ రావడానికి 54 శాతం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.

బరువు పెరుగుతారు
బరువు తగ్గాలని ఉదయాన్నే అల్పాహారం మానేస్తున్నారా ? ఇలా చేయడం వల్ల నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అల్పాహారం మానేయడం వల్ల బరువు తగ్గడం కాదు.. బరువు పెరగడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ఎలా అంటే.. ఆకలిగా ఉండటం వల్ల ఫ్యాట్ ఫుడ్, చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు. అలాగే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల.. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తింటారు. దీనివల్ల ఈజీగా బరువు పెరుగుతారు.

బ్రెయిన్ పవర్ తగ్గుతుంది:
మెమరీపైనా ప్రభావం చూపుతుంది. మీరు బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్(దాటవేసినప్పుడు)చేసినప్పుడు, మీరు నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది మరియు నీరసంగా ఉంటారు?అయితే, ఎప్పుడైతే మీరు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారో అప్పుడు తేడాను గమనించండి. బ్రేక్ ఫాస్ట్ ను ఎందుకు స్కిప్ చేయకూడదు అన్నదానికి ఇది ఒక ప్రధానమైన కారణం.ఉదయం అల్పాహారం తీసుకోని వారు ఆరోజు వారి శరీరం అతి తక్కువ రక్తచక్కెర స్థాయి పొందుతుంది. అది మెదడు క్షీణత కారణమవుతుంది. మెదడుకు సరైన మోతాదులో పోషకాలు అందక మెదడు పనిచేసే శక్తి తగ్గుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ కు ఇది కూడా ఒక కారణం.

ఎనర్జీ లెవల్స్ తగ్గుతాయి:
బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల ఎనర్జీ, మూడ్ పైన కూడా దుష్ర్పభావం పడుతుంది. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి..

కొలెస్ట్రాల్ పెరుగుతుంది:
బ్రేక్ ఫాస్ట్ తినడకపోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ:
అధ్యయనాల ప్రకారం ఎవరైతే ఒబేసిటీ, అధిక బరువుతో బాధపడుతున్నారో వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది:
బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటాన్ని హైపోగ్లికోమియా అని పిలుస్తారు. బ్రేక్ ఫాస్ట్ తినడం మానేయడం వల్ల గ్లోకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాగే రక్తపోటు పెరగడానికి అవకాశాలున్నాయి.

తలనొప్పికి దారితీస్తుంది:
బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటాన్ని హైపోగ్లికోమియా అని పిలుస్తారు. బ్రేక్ ఫాస్ట్ తినడం మానేయడం వల్ల గ్లోకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాగే రక్తపోటు పెరగడానికి అవకాశాలున్నాయి. అంతేకాదు.. మైగ్రేన్, తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది.

మూడ్ స్వింగ్స్ :
బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటాన్ని హైపోగ్లికోమియా అని పిలుస్తారు. బ్రేక్ ఫాస్ట్ తినడం మానేయడం వల్ల గ్లోకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాగే రక్తపోటు పెరగడానికి అవకాశాలున్నాయి. అంతేకాదు.. మైగ్రేన్, తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది.

జీర్ణశక్తి లోపిస్తుంది:
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే, ముందు కడుపులో రిలీజ్ అవ్వాల్సిన జీర్ణరసాలు ప్రేగులని తీనటం మొదలు పెడతాయి....అసలు మార్నింగ్ తినటం పూర్తిగా మానేస్తే, ఆ రసాలు కూడా విడుదల కావు..దీంతో మొదటికే మోసం వస్తుంది....మన శరీర గడియారంలో పెను మార్పులు. జీర్ణరసాలనుంచి హార్మోన్లవరకు అన్నీ అస్థవ్యస్థం ఇదంతా ఏ నెల్లోనో రెండు నెల్లకో జరగదు...ఇదే పద్దతి లో వెలితే ఓ ఏడాది రెండేళ్ల తర్వాత పెను మార్పులు చూడాల్సివస్తుంది.

వీక్ గా కనబడుతారు:
ఇక ఉదయం శరీరానికి అందాల్సిన ఇందనం బ్రేక్ ఫాస్ట్ రూపంలో అందక పోతే, మనలోని కణాలు నిస్థేజానికి గురౌతాయి . దాని ఫలితంగా బాడీ వీక్ అయిపోతాయి. వీక్ అంటే స్లిమ్ అనుకునే ఛాన్స్ ఉంది. కాని నిజానికి వీక్ నెస్ అంటే...లుక్ మారదు, వేయిట్ మారదు....పిండేసిన ఆరేంజ్ లా ఇంటర్నల్ గా ఎనర్జీ అంటూ ఏమీ లేకుండాపోవటం...

నిద్రలేమి:
బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడంతో దాని ప్రభావం ముందు బ్లడ్ ప్రెజర్ మీదపడుతుంది. ..షుగర్ లెవల్స్ పడిపోతాయి...బ్రేయిన్ కి కావాల్సినంత న్యూట్రియంట్స్ సప్లై కాకపోతే మెదడుకి విశ్రాంతి ఉండదు....దీంతో నిద్రలేని రాత్రులు అనుభవించాల్సి వస్తుంది. కావాల్సినంత నిద్రలేకపోతే....బ్రేయిన్ సెల్స్ వేగంగా చనిపోయే అవకాశం ఉంది... అసలు బైక్ లో 100 ml పెట్రోల్ పోసి, హండ్రెడ్ కిలో మీటర్స్ వెల్లాలంటే ఎలా ఇది కూడా అంతే...బాడీకి, బ్రేయిన్ కి కావాల్సిన ఫుడ్ ఇచ్చి తీరాల్సిందే.



Click it and Unblock the Notifications