హార్ట్ బర్నింగ్, ఎసిడిటి నివారించుకోవడానికి హెల్తీ మార్గాలు...

By Super

ప్రస్తుత రోజుల్లో వయస్సుతో పనిలేకుండా హఠాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అందులో గుండెకు సంబంధించిన సమస్యలే అధికం. గుండెల్లో మంట అనేక కారణాల వలన కలుగవచ్చు ప్రాథమిక నిర్థారణ అదనపు చిహ్నాలు, లక్షణాలమీద ఆధారపడి ఉంటుంది. గుండె మంట వలన వచ్చే చాతీ నొప్పి 'మండే' అనుభూతిని కలిగిఉంటుంది. బాగా వేయించిన ఆహారాలు అనేక సమస్యలు తెస్తాయి. వాటిలో హార్ట్ బర్నింగ్ ఒకటి. తరచుగా వేపుడు ఆహారాలు తింటే ఛాతీలో కిందిభాగంలో మంట వస్తుంది. అది పొట్టకు కూడా వ్యాపిస్తుంది. దీనినే హార్ట్ బర్నింగ్ అంటారు.

గుండె మంట తరచుగా వస్తూంటే, సమస్యలు ఎక్కువవుతాయి. అటువంటి సమస్యలు రాకుండా వేపుడు ఆహారాలు తగ్గించి, ఉడికించిన ఆహారం తినాలి. ఇది సాధారణంగా రాత్రి భోజనం తరువాత వస్తూ వుంటుంది. ఈ మంట పడుకున్నప్పుడు కానీ, వంగినప్పుడు కానీ ఎక్కువవుతుంది. ఇది గర్భవతి మహిళలలో కూడా సాధారణంగా వస్తూంటుంది. ఇది ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడంవలన, లేదా కొన్ని మసాలాలు, అధిక క్రొవ్వు శాతం లేదా అధిక ఆమ్ల శాతం కల ప్రత్యేక ఆహారపదార్థాలను తీసుకోవడంవలన కూడా వస్తుంది.

ఛాతీలో మంట పుడితే ఇది గుండెనొప్పి కావచ్చుననే సందేహాలతో సతమతమయ్యే వారూ ఎక్కువగానే ఉన్నారు. ఈ రెంటికీ తేడా తెలియక గాభరాతో ఇసిజి చేయించుకునే వారూ ఉన్నారు. ఈ బిజీలైఫ్‌లో ఒత్తిడి చాలా ఉంటోంది. దీనివల్ల వచ్చేదే ఛాతీలో మంట, గ్యాస్ట్రిక్ మరియు జీర్ణ వ్యవస్థ స్తంభింపచేస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా తెలిస్తే తగ్గించుకోవడం పెద్ద సమస్య కాదు. దీనికోసం కంగారుపడి డాక్టరు దగ్గరకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులతోనే ఛాతిలో మంటను తగ్గించుకోవచ్చు.

ఉదాహరణకు కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. గుండె మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. సాధారణంగా ఈ సమస్యలను నివారించడానికి బొప్పాయి, అరటి, అలోవెరా జ్యూస్, మరియు కొన్ని ఆర్గాన్స్ బాగా సహాయం చేస్తాయి. అలాగే క్యాల్షియం రిచ్ ఫుడ్స్ కూడా హార్ట్ బర్న్ తగ్గిస్తాయి. మరి హార్ట్ బర్నింగ్ ను తగ్గించే మరికొన్ని ఆహారాలను ఉపయోగించి చూడండి. అప్పటికీ తగ్గకపోతే డాక్టరును సంప్రదించండి.

అల్లం:

అల్లం:

అల్లం కు మంట తగ్గించే శక్తి వుంది. సుమారు 500 మి.గ్రా. అల్లం పచ్చిది లేదా ఇతర ఆమారంతో కలిపి తీసుకోండి. లేదా అల్లం టీ తాగి రిలీఫ్ పొందండి.అల్లం కొన్ని రకాల జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. హార్ట్ బర్న్ మరియు అసిడిక్ రిఫ్లెక్షన్ నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . అందుకే రెగ్యులర్ డైట్ లో దీన్ని చేర్చుకోవడం చాలా అవసరం.

నీరు:

నీరు:

నీళ్ళల్లో ఒక చెంచాడు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలిపి తాగండి. గుండె మంటనుండి తక్షణ రిలీఫ్ వస్తుంది. రుచి బాగా లేకపోయనప్పటికి బాగా పని చేస్తుంది. బేకింగ్ పౌడర్ లో వుండే సోడియం బాగా పనిచేస్తుంది. యాసిడ్ రిఫ్లెక్షన్ కు ఉత్తమహోం రెమెడీ, నీరు. ఇది ఎసిడిటిని మాత్రమే తగ్గించడం కాదు, జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు అన్ని రకాలుగా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. జనరల్ డైజెస్టివ్ డిసీజ్ అండ్ సైసెన్సె స్టడీ ప్రచురించినవిధంగా ఎసిడిటిని ఎదుర్కోవడంలో నీళ్ళు చాలా ప్రధానమైనవి .

బాదం:

బాదం:

బాదంపప్పు గుండెలో మంటను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని బాదంపప్పులు తిని చూడండి.గుండె మంట వచ్చినపుడు రెండు బాదం పప్పులు తినండి. వీటిలో వుండే అధికమైన నూనె పొట్టలో ఏర్పడిన ఎసిడిటీని దూరం చేస్తుంది. వెంటనే గుండెమంట తగ్గుతుంది.

వెనిగర్:

వెనిగర్:

వెనిగర్ తో కూడా హార్ట్ బర్న్ నివారించుకోవచ్చు . ఒక టీ స్పూన్ వెనిగర్ గ్లాసు నీటిలో కలుపుకొని త్రాగడం వల్ల హార్ట్ బర్న్ మిరయు ఎసిడిటి తగ్గించుకోవడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అలోవెర జ్యూస్:

అలోవెర జ్యూస్:

కలబంద రసంలో హీలింగ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి మరియు ఇది గ్యాస్ట్రోఇంటెన్షనల్ ట్రాక్ లో ఇన్ఫ్లమేషన్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మరియు ఇది ఆల్కహాల్ స్వభావం కలిగి ఉండటం వల్ల స్టొమక్ లోని యాసిడ్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది . దాంతో హార్ట్ బర్న్ తగ్గించుకోవచ్చు.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటి పండ్లు తినడం వల్ల హార్ట్ బర్న్ నివారించుకోవచ్చు. వేసవిలో హార్ట్ బర్న్ నివారించుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.అరటిపండులో అధికంగా పొటాషియంతో పాటు నేచురల్ ఆంటాసిడ్స్(సహజ ఆమ్లహారం) ఉండి గుండె మంటను నుండి ఉపశమన పొందడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణకోశం శుభ్రపరచడానికి మరియు మలబద్ధకం నివారికి బాగా సహయపడుతుంది.

Story first published: Friday, April 1, 2016, 11:06 [IST]
Desktop Bottom Promotion