Latest Updates
-
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!
హెల్తీగా ఉండాలంటే పాటించాల్సిన సింపుల్ అండ్ హెల్తీ టిప్స్
ఆరోగ్యమే మహాభాగ్యమనేది గోల్డెన్ వర్డ్. ఎందుకంటే.. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉండటమే.. చాలా గొప్ప సంగతి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడటం చాలా కామన్. అంతేకాదు.. చిన్న వయసులో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దీనంతటికీ.. మన అన్ హెల్తీ లైఫ్ స్టైలే ప్రధాన కారణం.
హెల్తీగా ఉండటానికి.. చాలా సింపుల్ టిప్స్ మైండ్ పెట్టుకుంటే చాలు. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. హెల్తీగా, బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలని చాలా అవసరం. కానీ చాలామంది బిజీలైఫ్ కారణంగా.. సరుకులు తెచ్చుకుని వండుకోవడానికే సమయం సరిపోవడం లేదని భావిస్తారు. దీనివల్ల హోంమేడ్ ఫుడ్స్ , ప్రాసెస్డ్, ఫుల్ ఫ్యాట్, సాల్ట్, షుగర్ ఉన్న ఆహారాలను తీసుకుంటూ ఉంటాం.

ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. ఓట్స్, తృణధాన్యాలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ డైట్ లో చేర్చుకోవాలి. దాంతో పాటు హెల్తీ ఫ్యాట్ కూడా తీసుకోవాలి. ఆల్మండ్ బట్టర్, ఆలివ్ ఆయిల్ ద్వారా హెల్తీ ఫ్యాట్ పొందవచ్చు. స్కిన్ లెస్ చికెన్, ఫిష్ ద్వారా ప్రొటీన్ పొందవచ్చు. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే.. బీన్స్ ద్వారా ప్రొటీన్ పొందవచ్చు. క్యాల్షియం ఎక్కువగా లభించే పెరుగుని డైట్ లో చేర్చుకోవాలి.

డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ చేసుకోవడమే కాదు.. హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవడం వల్ల పోషకాలను గ్రహిస్తాయి. అలాగే ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లు శరీరం నుంచి మలినాలను బయటకు పంపిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నీళ్లు తక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తాగడం తగ్గించాలి.

రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. బాడీని మూవ్ చేస్తూ ఉండాలి. 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్ ప్రతిరోజూ చాలా వండర్ చేస్తుంది. ఇది.. చాలా రకాల వ్యాధులకు దూరంగా ఉంచడమే కాకుండా.. శక్తి సామర్థ్యాలను పెంచుతాయి.

సరైన నిద్ర చాలా ముఖ్యమైనది. ఒక వేళ రాత్రి సరైన నిద్ర పొందలేకపోతున్నారంటే.. చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. హైబ్లడ్ ప్రెజర్, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ రిస్క్ ఉంటుంది. అలాగే ఆందోళన, ఇరిటేషన్, డిప్రెషన్ కి కారణమవుతాయి. హెల్తీగా ఉండాలంటే.. కనీసం రోజుకి 7 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
